KDP: ప్రభుత్వం అందిస్తున్న సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని MPDO శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూచించారు. లింగాల మండల పరిధిలోని గుణకణపల్లిలో నిర్వహించిన అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్షను ఆదివారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. చదవడం,రాయడం ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యులు తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. అక్షరాస్యతతో వ్యక్తిగత, సమాజాభివృద్ధి కూడా సాధ్యమవుతుందన్నారు.