• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

50KM ప్రయాణం.. డివిజన్ మార్పుపై చర్చ

KDP: కడప డివిజన్‌లోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోకి చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం నుంచి కడప చాలా దగ్గర. ప్రస్తుతం రాజంపేటలోకి కలపడంతో ఏదైనా పనికోసం 50కి.మీ వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు.

November 26, 2025 / 03:12 PM IST

‘బాలోత్సవాలను విజయవంతం చేయండి’

W.G: భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి బాలోత్సవం కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల బాలికల్లో సృజనాత్మకత, వికాసం పెంపొందించేందుకు డిసెంబర్ 12, 13వ తేదీల్లో సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాలలో బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

November 26, 2025 / 03:12 PM IST

ఆటో చోదకులకు ఎస్సై అవగాహన

VZM: చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ఆదేశాల మేరకు గుర్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఆటో చోదకులకు ప్రమాదాల నివారణపై ఎస్సై నారాయణరావు బుధవారం అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ఇష్టానుసారంగా రోడ్లమీద పార్కింగ్ చేయరాదన్నారు. రాత్రి వేళలో ఆటోలు కనబడేలా రేడియం స్టిక్కర్లు పెట్టాలన్నారు.

November 26, 2025 / 03:11 PM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: గండేపల్లి మండలంలో పోలవరం కాలువ గట్టు పక్కన 18 అడుగుల వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షష్టి రోజున విగ్రహాన్ని ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం భక్తులతో అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

November 26, 2025 / 03:10 PM IST

పొన్నూరులో అభివృద్ధి బాట.. రూ.36 లక్షల పనులు ప్రారంభం

GNTR: పొన్నూరు పట్టణంలో మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ దృష్టి సారించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన రూ.36.57 లక్షల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పాత పంచాయతీ ఆఫీస్ వద్ద రూ.26 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్‌ను ప్రారంభించారు. అనంతరం చేనేత సొసైటీ ఎదుట రూ.10.57 లక్షలతో వేసిన సీసీ రోడ్డును ప్రజలకు అంకితం చేశారు.

November 26, 2025 / 03:09 PM IST

ఉంగుటూరు యూటీఎఫ్ అధ్యక్షుడు నియామకం

ELR: ఉంగుటూరు మండలం యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లు శీను బుధవారం తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా శీతాల సత్యనారాయణ, అధ్యక్షులుగా వునుముల రాంబాబు, ఉపాధ్యక్షులుగా కత్తుల ఝాన్సీ రాణి, బొమ్మిడి ప్రసాద్, ప్రధానకార్యదర్శిగా డాకి జోగినాయుడు, కోశాధికారిగా ఊట ఆనందకుమార్, సభ్యులుగా పలువురు ఎన్నికయ్యారు.

November 26, 2025 / 03:03 PM IST

బ్యాంకుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు: ఎమ్మెల్యే

PLD: బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించి, సకాలంలో రుణాలు అందజేసి ఖాతాదారులను ఆకర్షించే విధంగా ఉండాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం బ్యాంకులోని వివిధ రకాల సౌకర్యాలు, లాకర్లను పరిశీలించారు.

November 26, 2025 / 03:02 PM IST

శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్యే శ్రావణి

ATP: శాసన మండలి ‘కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్’ ఆధ్వర్యంలో అమరావతిలోని శాసనసభ భవనంలో బుధవారం కమిటీ సమావేశం జరిగింది. ​ఈ సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ (దుకాణాలు, ప్రీమియం దుకాణాలు, బార్ లైసెన్సులు)కు సంబంధించిన 2024, 2025 నియమావళి అజెండాలపై కమిటీ చర్చించింది.

November 26, 2025 / 03:00 PM IST

‘భారత రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత’

NDL: భారత రాజ్యాంగ పరిరక్షణ మనఅందరి బాధ్యత అని అందుకు ప్రతి భారతీయుడు తనవంతు కృషిచేయాలని డీఆర్‌వో రాము నాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు భారతీయ పౌరుడిగా కృషి చేయడం మన అందరి బాధ్యత అన్నారు.

November 26, 2025 / 02:54 PM IST

‘మహిళల కష్టాలు తీర్చిన ఘనత చంద్రబాబుదే’

CTR: ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మంజూరైన ఉచిత గ్యాస్ కనెక్షన్, సిలిండర్లను లబ్ధిదారులకు బుధవారం నగరిలో MLA గాలి భాను ప్రకాష్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి సారి దీపం కనెక్షన్‌లు ఇచ్చి మహిళలకు గుర్తింపు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదే అబ్నారు. ఈ కార్యక్రమంలో సంబందిత అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

November 26, 2025 / 02:53 PM IST

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి ప్రాధమిక బాధ్యత

NTR: గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆధారమైన రాజ్యాంగాన్ని ప్రతి భారత పౌరుడు గౌరవించి పరిరక్షించాలని అన్నారు.

November 26, 2025 / 02:44 PM IST

ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎస్పీ తుహీన్ సిన్హా పూలమాలవేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందన్నారు.

November 26, 2025 / 02:43 PM IST

ఓవర్ లోడ్‌తో వెళుతున్న వాహనాలకు జరిమానా

AKP: రాంబిల్లి మండలం వెంకటాపురం వద్ద ఓవర్ లోడ్‌తో వెళ్తున్న నాలుగు లారీలకు పోలీసులు భారీ జరిమానా విధించారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కోడి వాసు, సీఐ నర్సింగరావు, ఎస్సై నాగేంద్ర కలిసి బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్‌తో వెళ్తున్న నాలుగు లారీలకు రూ.2,85,180 జరిమానా విధించినట్లు తెలిపారు.

November 26, 2025 / 02:41 PM IST

మాక్ అసెంబ్లీ విజేతలకు బహుమతులు అందజేత

E.G: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూ.గో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం జరిగిందని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ప్రతి మండలం నుంచి ఒక విద్యార్థి చొప్పున 21 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. బుధవారం రాజమండ్రిలో విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

November 26, 2025 / 02:40 PM IST

కొలిమిగుండ్లలో వీధిలైట్ల ఏర్పాటు

NDL: కొలిమిగుండ్లలోని పలు కాలనీలలో నూతన వీధిలైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ జినుగు శివరాముడు వెల్లడించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు వీధిలైట్లు పనిచేయని పలు కాలనీలో లైట్లకు మరమ్మతులు నిర్వహించామన్నారు. అవసరమున్నచోట నూతన వీధిలైట్లు ఏర్పాటు చేసి వెలుగులు నింపినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు పరిసరాల పరిశుభ్రతతో పాటు గ్రామ పరిశుభ్రతకు సహకరించాలన్నారు.

November 26, 2025 / 02:37 PM IST