ASR: అనంతగిరి మండలం, చిలకలగడ్డ పరిధిలో ఆదివాసీ JAC ఛైర్మన్ రామారావు దొర ఆదివాసీ సత్యాగ్రహ యాత్రను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రామారావు దొర మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ నియామకాల చట్టం చేయాలన్నారు. ఏజెన్సీలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టులన్నీ రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. 1/70, FRA, PESA చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు.
AKP: భాను రూరల్ అండ్ అర్బన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సొసైటీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి మారుడుపూడి సతీష్ ఇన్‌స్పైర్ అవార్డు అందుకున్నారు. పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అందజేశారు. ఈ సందర్భంగా సతీష్‌ను పలువురు అభినందించారు.
KRNL: విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో సాధన చేసి రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఇవాళ కర్నూల్ అవుట్డోర్ స్టేడియం నందు విభిన్న ప్రతిభావంతులకు క్రీడ పోటీలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమన్వయంతో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.
TPT: నాయుడుపేట పట్టణంలోని బుధవారం జనసేన పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడుపేట ఏఎంసీ ఛైర్మన్, జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇంఛార్జి ఉయ్యాల ప్రవీణ్ స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా JC మౌర్య భరద్వాజ్ ధర్మవరం మండలం పోతుకుంట గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పంచసూత్రాలు, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల సంరక్షణపై నేరుగా అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
VSP: కాపుల ఆత్మగౌరవ ప్రతీక, సహాయసేవల ప్రతిరూపం స్వర్గీయ మిరియాల వెంకటరావు 86వ జయంతి వేడుకలను డిసెంబర్ 14న VMRDA బాలల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం డాబాగార్డెన్స్ VJF ప్రెస్ క్లబ్‌లో ఆహ్వాన కమిటీ సభ్యులు ఉషా కిరణ్, శేఖర్ తెలిపారు. మిరియాల సేవలను స్మరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణ జరుగుతాయాన్నరు.
PLD: మాచర్ల మండలం చింతలతండా గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బుధవారం శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అమ్మవారిని అభిషేక పూజలతో దర్శించుకున్నారు. అనంతరం ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు.
శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ వ్యాధి అపరిశుభ్ర పరిసరాలు, చిన్న పురుగు కుట్టడం వలన వస్తాయని డాక్టర్లు తెలిపారు. కొత్తూరు, హిరమండలం, గార మండలాల్లో ఈ బాధితులు ఉన్నారు.
E.G: గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అసెంబ్లీ బడ్జెట్ ఎస్టిమేట్స్ కమిటీ మెంబర్ హోదాలో ఉత్తరాంధ్రలో బుధవారం పర్యటించారు. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆలయ ప్రభుత్వ అధికారులతో కలిసి అంచనాల కమిటీ రివ్యూ మీటింగ్లో పాల్గోన్నారు. దేవాలయ అభివృద్ధి, భక్తులకు అందించే సేవల మెరుగుదల వంటి కీలక అంశాలపైచర్చించి, పలు సూచనలు అందజేశారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గ యువ నాయకుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డిని బుధవారం బొమ్మనహల్ మండల ప్రజాప్రతినిధులు, వైసీపీ సీనియర్ నాయకులు కలిశారు. కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాల నిర్వహణపై ఈ సందర్భంగా విశ్వనాథ్ రెడ్డి సమీక్షించారు. సంతకాల సేకరణ పూర్తయిన పాంప్లెట్లను డిసెంబర్ 2వ తేదీలోగా కార్యాలయంలో అందించాలని ఆయన నాయకులకు సూచించారు.
W.G: భీమవరం అంబేద్కర్ చౌక్‌లో బుధవారం కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర పాలకులు కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ, రైతులు, కార్మికులు, కౌలు రైతుల హక్కులను, చట్టాలను తొలగిస్తున్నారని సీఐటీయూ అధ్యక్షుడు గోపాలన్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు.
కృష్ణా జిల్లాల్లోని 26 పాఠశాలల్లో Personal Adaptive Learning అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఉన్న ల్యాబ్‌లతో పాటు కొత్తగా ఈ ఏర్పాటు జరిగింది. ఒక్కో ల్యాబ్‌లో 30 ట్యాబ్‌లు ఉండి, తెలుగు, ఇంగ్లీష్ సంబంధించిన వీడియో కంటెంట్ లభిస్తుంది. టీచర్స్ బోధించిన తర్వాత, 6-9th క్లాస్ విద్యార్థులు ట్యాబ్‌ల ద్వారా పాఠ్యాంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవచ్చును
TPT: శ్రీకాళహస్తి బేరివారి మండపం వద్ద ఆగ్నేయ గణపతి స్వామి విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నేడు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పట్టణమంతా భక్తిభావంతో పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో BJP స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోలా ఆనంద్, దేవస్థానం EO బాపిరెడ్డి, దేవస్థానం ఛైర్మన్ కొట్టే సాయి పాల్గొన్నారు.
KRNL: ఆదోని టీడీపీ రాష్ట్ర కార్య దర్శి ఉమాపతి నాయుడు ఇవాళ మంత్రి లోకేశ్‌ను కలిశారు. జిల్లాల విభజనలో ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. 46 గ్రామాలు 42 వార్డులతో అతి పెద్ద నియోజకవర్గంగా వెనుకబడిందని, జిల్లా ఏర్పాటుతో ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి అవుతాయని వివరించానన్నారు.
SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి తాల భద్రలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు.