NTR: వీరులపాడు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రోగ్రాం దాచవరం గ్రామంలో బుధవారం తిమోతి చర్చిలో జరిగింది. మండల ప్రెసిడెంట్ మంద స్వామి దాసు మాట్లాడుతూ.. రానున్న క్రిస్టమస్ వేడుకలు ఘనంగా చెయ్యాలని పిలుపునిచ్చారు. పేదవారికి చేయూతనివ్వాలని అయన కోరారు. దైవ సేవకులు సమాజాని మంచి మార్గంలో ముందుకు నడిపిస్తూ.. తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు.
కృష్ణా: గ్రామాల అభ్యున్నతి ద్వారానే దేశ అభ్యుదయం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కేడీసీసీ బ్యాంకు ప్రాంగణంలో బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, భూమి తనఖా బ్యాంక్ మాజీ అధ్యక్షుడు అడుసుమిల్లి అశ్వర్ధ నారాయణమూర్తి కాంస్య విగ్రహలను ఛైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
BPT: ఈస్ట్ బాపట్ల పంచాయతీ కార్యదర్శి పల్నాటి శ్రీరాములుకు పదోన్నతి లభించింది. ఆయనను డిప్యూటీ ఎంపీడీవోగా, డెప్యుటేషన్‌పై మండల సచివాలయాల శాఖ అధికారిగా కలెక్టర్ నియమించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన బాపట్ల ఎంపీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా అధికారి విజయలక్ష్మి, ఎంపీడీవో బాబురావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
KRNL:భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 76 సంవత్సరాలు పూర్తిఅయింది. ఈ సందర్భంగా ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత BR అంబేద్కర్ చిత్రపటానికి కర్నూలు ASP జి. హుస్సేన్ పీరా, AR ASP కృష్ణ మోహన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మన దేశానికి ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలని అంబేద్కర్ లాంటి మహానుభావులు కృషి చేసి రాజ్యాంగాన్ని తీసుకువచ్చారన్నారు.
NTR: జగన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని ఐదేళ్లు నాశనం చేశాడని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. గొల్లపూడిలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. పంచసూత్రాల ఆధారంగా సాగును పటిష్టం చేసే చర్యలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. రసాయన రహిత పద్ధతులతో పంట దిగుబడిని పెంచుకోవచ్చు అన్న విషయాన్ని తమ అనుభవాలతో వెల్లడించారు.
E.G: రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారుల అధికారులు, ఎమ్మెల్యేలు ఎంపీతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సమావేశం అయ్యారు. 2027 పుష్కరాలకు సంబంధించి అంశాలపై వారు చర్చించారు. జాతీయ రహదారులను పుష్కరాలకు ముందే అభివృద్ధి చేయాలని రోడ్లు నిర్మాణ పనులతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.
SKLM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి ధర్మ హుండీ ఆదాయం రూ.6.91లక్షలు లభించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాచర్ల రాధాకృష్ణ తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో కమిటీ ఛైర్మన్ కోరాడ గోవిందరావు, పాలకమండలి, సోంపేట ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్, పోలీస్ సిబ్బంది భక్తులు ఆధ్వర్యంలో లెక్కించినట్లు పేర్కొన్నారు.
ATP: రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను కలెక్టర్ ఆనంద్ అందజేశారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, వారికి పలు అమూల్యమైన సూచనలను చేశారు. మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.
AKP: సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందరూ రాజ్యాంగానికి బద్ధులై నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ విజయకృష్ణన్, పంచకర్ల రమేష్ బాబు, ఎస్పీ తుహీన్ సిన్హా విద్యార్థినులకు 426 సైకిళ్లు పంపిణీ చేశారు. బాలికలు బాగా చదువుకుని ఉన్నత విద్యావంతులు కావాలని సూచించారు.
NLR: సామాజికంగా వెనుకబడి వున్న గిరిజనుల ఆర్థికాభివృద్ధికి పాటు పడతానని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుధవారం విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఏఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు 500 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
W.G: పాలకోడేరు మండలం కుముదవల్లిలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతన్న మీకోసం” కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి నిర్వహించారు .ఈ సందర్భంగా ఆమె రైతులతో కలిసి అరుగుపై కూర్చుని ముఖాముఖిగా పాల్గొని వారి బాధలను, వరి పంట సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.
NDL: నంద్యాల పట్టణంలోని నాగులకుంట రోడ్డులోని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్టిని ఇవాళ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు, ఎండు ఫలాలతో అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు చేశారు.
PLD: పిడుగురాళ్ల పట్టణంలోని మన్యం పుల్లారెడ్డి ZP హై స్కూల్లో బుధవారం వసుదైక కుటుంబం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై, నిరుపేద విద్యార్థినీ విద్యార్థులకు సైకిళ్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు తమ చదువుకున్న పాఠశాలకు సాయం అందించారు.
GNTR: ఫిరంగిపురం మండలం డిప్యూటీ ఎంపీడీవో GSWS అధికారిగా కె. విష్ణువర్ధన రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏవో రవిబాబు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సేవలను ప్రజలకు సమయానికి, సక్రమంగా అందేలా చూసుకుంటానని తెలిపారు.
TPT: నాగలాపురం పరిధిలోని ద్వారకా నగర్ వద్ద అరుణా నదిపై వంతెన నిర్మాణానికి MLA కోనేటి ఆదిమూలం గురువారం భూమిపూజ చేయనున్నట్లు మాజీ MPP మురళీ తెలిపారు. దీనికోసం MLA రూ.8 కోట్ల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఇది పూర్తయితే పిచ్చాటూరు, నాగలాపురం మండలాలకు అనుసంధానంగా రోడ్డు ఏర్పడుతుందని, 2 మండలాల ప్రజల చిరకాల కోరిక తీరుతుందన్నారు.