GNTR: జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీలు జి.వి.రమణమూర్తి, హనుమంతు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్గదర్శకమని, ప్రతి పోలీస్ అధికారి రాజ్యాంగ విలువలను కాపాడాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం పోలీసులంతా రాజ్యాంగ ప్రమాణ స్వీకారం చేశారు.
PLD: రైతుల మేలు కోసం సీసీఐ నిబంధనలు సరళీకృతం చేయాలని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలతో కలిసి కావూరు, కోమటినేనివారిపాలెంలో రూ.39 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ‘రైతన్నా మీకోసం’లో భూసార కార్డులు పంపిణీ చేశారు. లిఫ్టుల ఆధునికీకరణకు త్వరలో టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఆలోచనలను ఆచరణలో పెట్టాలన్నారు.
NTR: భారత ప్రజలకు అనుక్షణం తోడుగా, నీడగా ఉంటూ వస్తున్న రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ పీఠ...
KRNL: ఆదోని పత్తి మిల్లు వద్ద ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని జేసీ నూరుల్ కమర్ ఇవాళ సందర్శించి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి, కొనుగోలులో వారికి ఎదురవుతున్న సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు. అలాగే, కొనుగోలుకు సిద్ధంగా ఉన్న పత్తిని, ముఖ్యంగా తేమ, రంగు మార్పు ఉన్న పత్తిని పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.
BPT: పెన్షనర్లు నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ ఆగిపోతుందని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు హెచ్చరించారు. బాపట్లలో ఆయన సర్టిఫికెట్ల జారీని పరిశీలించారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇంటి వద్దే సేవలు అందిస్తామని తెలిపారు. పెన్షన్ సమస్యలున్న వారు యూనియన్‌ను సంప్రదించాలన్నారు.
కృష్ణా: గుడివాడలో యూనియన్ బ్యాంక్ శాఖలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై బ్యాంక్ అధికారులు ఈరోజు దర్యాప్తు చేపట్టారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ ఉమా రామలింగారెడ్డి బ్యాంక్‌లోని అన్ని విభాగాలను పరిశీలించారు. పరీక్షలో బ్యాంక్‌కు సంబంధించిన రికార్డులు, ప్రధాన డాక్యుమెంట్లు భద్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 4 రోజుల్లో బ్యాంకు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ATP: రాయదుర్గం మండల పరిధిలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి రాజ్యాంగ పీఠికను శ్రద్ధగా పఠించారు. ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రపంచంలో విశిష్టమైన, అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగం భారతదేశానికి ఉండడం గర్వకారణం అన్నారు.
కోనసీమకు దిష్టి తగిలిందని, రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కారణమై ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘నరుడు’ దిష్టికి నల్ల రాయి అయినా బద్దలై పోతుంది అంటారు. కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగి ఉంటుందని వ్యాఖ్యానించారు. కొబ్బరి చెట్లను పరిశీలించి, రైతులను ఆదుకుంటామన్నారు.
SKLM: భారత రాజ్యాంగం – దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. పోలీసులు రాజ్యాంగ స్ఫూర్తిని తమ పనితీరులో అలవర్చుకోవాలని అని పేర్కొన్నారు.
ప్రకాశం: కనిగిరి మండలం గురవాజిపేట అంగనవాడి కేంద్రం నందు బుధవారం సూపర్వైజర్ పార్వతి అంగన్వాడీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం లబ్ధిదారుల నమోదు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ డిజిటల్ అకౌంట్‌ను పూర్తి చేయాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో మంచినీటి వసతుని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
VSP: క్రిస్టియన్ మైనార్టీ నేత సొండి సుధాకర్ బాబు బుధవారం 32వ వార్డు అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కండువా వేసి స్వాగతించారు. మైనార్టీలపై కూటమి అన్యాయంతో వైసీపీలో చేరానని సుధాకర్ చెప్పారు. జగన్ నేతృత్వం రాష్ట్రానికి అవసరమని, వాసుపల్లి సేవలు తనను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.
SKLM: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బహుమతులు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో బహుమతులు పొందిన వారిని అభినందించారు. ప్రథమ స్థానంలో బహుమతులు పొందిన దృశ్యాలను వీడియోకాన్ఫరెన్స్‌లో వీక్షించారు.
సత్యసాయి: హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు పని గంటలను పెంచి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. 8 గంటల పనివిధానాన్ని కొనసాగించాలని డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్‌కు వినతి పత్రం అందజేశారు.
TPT: తిరుపతి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) కార్యాలయంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రమాణం చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని ‘సంవిధాన్ దివస్ ‘ ప్రతి ఏడాది జరిపుకుంటున్నామని వివరించారు.