NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి జడ్పీ హైస్కూల్లో గురువారం కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కౌమారదశలో ఎదురయ్యే మార్పులపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం జీవీ రమేశ్ బాబు, డీపీఎమ్ ఎం.మోహన్ రావు, వైద్య సిబ్బంది జి. విమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా డెస్క్ ఏర్పాటు చేయాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం నుంచి గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లోని అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల ఫిర్యాదులను విని వాటికి పరిష్కార మార్గం చూపాలని ఆయన ఆదేశించారు.
NLR: గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆత్మకూరు DSP వేణుగోపాల్ తెలిపారు. డివిజన్ పరిధిలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా నిరంతరం దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని డీఎస్పీ పేర్కొన్నారు.
ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్-7, సవిత-11, పయ్యావుల కేశవ్-24వ ర్యాంకులు సాధించారు.
ATP: గుంతకల్ డివిజన్ రైల్వే మేనేజర్ శాఖా కార్యాలయాలతో కలిసి గుంతకల్-నల్వార్ స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్ సురక్షితతను గురువారం సమీక్షించారు. ట్రాక్, సిగ్నల్ సిస్టమ్, సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిచూసేందుకు రియర్ విండో పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖా అధికారులు, టెక్నికల్ టీమ్‌లు పాల్గొన్నారు.
ATP: అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ గురువారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు సృజనాత్మక రీల్స్, పోస్ట్లు, వీడియోలు తయారు చేయాలని కోరారు. యువతకు చేరేలా సామాజిక బాధ్యతగా ఈ విషయాలపై కంటెంట్ సృష్టించాలని ఎస్పీ జగదీష్ తెలిపారు.
E.G: ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. కొత్తపేట కళానగర్ వినాయకుని గుడిలో పూజలు జరిపించి కొత్తపేట నియోజక వర్గ ఎమ్మెల్యే సత్యానందరావు తనయుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో కొత్తపేటలో గురువారం ప్రచారం నిర్వహించారు. అనంతరం సంజీవ్ పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు.
NDL: బేతంచెర్ల మండలంలోని రంగాపురం గ్రామం వద్ద ఎన్‌హెచ్ 340B హైవే రహదారికి తూర్పున ఉన్న పొలాలకు రస్తా కోసం రైతులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పొలాలకు వెళ్లే రాస్తాను గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ రైతులు ఎమ్మెల్యే కోట్లకు వినతిపత్రం అందజేశారు.
ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించారు. రేగడికొత్తూరుతో అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వరయ్యను ఆమె పరామర్శించారు. అనంతరం ఆకులేడు గ్రామంలో నాగరాజు భౌతికకాయానికి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
NLR: బుచ్చి మండలంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్, వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె కార్యాలయ సిబ్బంది తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.
NLR: ముత్తుకూరు మండలం వల్లూరులోని పశువైద్యశాలతోపాటు సిమెంట్ రోడ్లను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తుందని చెప్పారు. ఎంపీడీవో, సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు అమలుపై ఆరా తీయాలన్నారు.
W.G: రాష్ట్రంలోని పట్టభద్రులంతా జనసేన వైపు చూస్తున్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు యువత వెళ్ళిపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కూటమి అభ్యర్థి రాజశేఖరంను గెలిపించుకోవాలన్నారు.
GNTR: ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గుంటూరు పార్టీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్ల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలపాలని అంగన్వాడీ టీచర్లను కోరారు.
GNTR: అమరావతిలో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై జరిగిన నియోజకవర్గ కూటమి ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పై ముఖ్య నాయకులకు మంత్రి పలు సూచనలు చేశారు. అలాగే కూటమి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు.
TPT: ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకీ ఇవాళ ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రిన్సిపల్ రమణకు ఆగంతకులు మెయిల్ చేశారు. అప్రమత్తమైన ప్రిన్సిపల్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో డిస్పోజబుల్ టీం, పోలీసులు యూనివర్సిటీకి చేరుకుని యూనివర్సిటీ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.