KRNL: డ్రగ్స్, మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మిద్దామని DYFI జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర పిలుపునిచ్చారు. ఆదోనిలో డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా యువ చైతన్య సైకిల్ యాత్ర నిర్వహించారు. యువత ఉపాధి లేక మత్తుపదార్థాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఖాళీ పోస్టులు భర్తీ చేసి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కృష్ణ: నూజివీడు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధాన అధికారి దేవరకొండ భూషణం తెలిపారు. నూజివీడులో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. 8వ తరగతి నుండి టెన్త్ క్లాస్ వరకు అర్హత కలిగిన వారు ఈ నెల 29 నుండి మే 24వ తేదీలోపు https//itiadmissions.ap.gov.in/iti/login.do ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చన్నారు.
KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో మే 1న తేదీన వర్చువల్ విధానంలో టెక్స్ టైల్ పార్క్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు మంగళవారం సంబంధిత అధికారులతో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, MLA జయ నాగేశ్వర రెడ్డి కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం బనవాసిలో టెక్స్ టైల్స్ పార్క్ స్థల ప్రాంతాన్ని తనిఖీ చేసి, ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
W.G: వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలని మంగళవారం మొగల్తూరు గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. మొగల్తూరు నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న వక్ఫ్ బోర్డు భూములలో పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమ మట్టి తవ్వకాలు సాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. అక్రమ మట్టి రవాణాను అడ్డుకొని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
W.G: భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన యశస్విని రోడ్డు ప్రమాదం బాధాకరమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఇటీవలే హైదరాబాద్ నుంచి భీమవరం వస్తు రోడ్డు ప్రమాదంలో యశస్విని మృతి చెందింది. తుందుర్రులో యశస్విని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అంజిబాబు పరామర్శించారు.
TPT: పుత్తూరు పట్టణంలోని బుధవారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు పుత్తూరు మున్సిపల్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు పుత్తూరు మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్స్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు హాజరవాలన్నారు.
KRNL: ఆదోని రెండో వార్డులో కమిషనర్ ఎం.కృష్ణ మంగళవారం పర్యటించారు. మాజీ కౌన్సిలర్ తిమ్మప్పతో కలిసి కాలువలలో పూడిక తీశారు. పట్టణ ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల వద్దకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కోరారు. పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు.
కృష్ణా: అమరావతి నిర్మాణంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం అని టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు అన్నారు. మంగళవారం అవనిగడ్డలోని టీడీపీ మండల కార్యాలయంలో చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని సహకారంతో కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతోందన్నారు. ఫిబ్రవరి రెండున అమరావతిలో జరిగే ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలన్నారు.
KDP: పహల్గామ్లో ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ ఏపీ పీఈటీస్ అండ్ ఎస్ఏ పీఈ అసోసియేషన్, జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ సంయుక్తంగా కడపలో ర్యాలీ నిర్వహించాయి. కోటిరెడ్డి సర్కిల్ నుంచి సైనిక్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో డీఎన్డీఓ జగన్నాథరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నేతలు, స్కేటర్లు పాల్గొన్నారు.
VZM: బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ పావు వెంకట మురళీ కృష్ణపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు జరగనున్న ప్రత్యేక సమావేశానికి పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పట్టణ సీఐ కె.సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ రమేశ్, కానిస్టేబుల్స్ బందోబస్తులో పాల్గొన్నారు. సమావేశంలో ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సీఐ సతీశ్ కుమార్ చెప్పారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి వేకువజామునే అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
KDP: ప్రొద్దుటూరు ఆర్ట్స్ కళాశాల రోడ్డులో తప్పిపోయిన ఇద్దరు బాలుర కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంబటూరు వెంకటరమణ కుమారుడు వెంకటదర్శన్ (10వ తరగతి), తన తమ్ముడు లక్ష్మణ్‌తో కలిసి ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లినట్లు తెలిపారు. సోమవారం నుంచి వారి ఆచూకీ తెలియడం లేదని ఎస్సై సంజీవరెడ్డి పేర్కొన్నారు.
KDP: లింగాల మండలంలోని కోమన్నూతల పంచాయతీలో జరుగుతున్న పనులను ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఉపాధి వేతనదారులకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలపై అవగాహన కల్పించారు.
KRNL: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పూర్తి ఏర్పాట్లు చేయాలని డీఆర్వో వెంకట నారాయణమ్మ ఆదేశించారు. ఈ నెల 30వ తేదీన 11am-1pm వరకు పాలిటెక్నిక్ పరీక్ష జరుగతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షకు విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం: నగరపాలక సంస్థ పరిధిలో గృహ యజమానులు, వాణిజ్య సముదాయ యజమానులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని నగరపాలక సంస్థ కోరింది. ఈ నెల 30లోగా చెల్లించాలని, లేకుంటే మే నెల నుంచి అదనంగా 2% వడ్డీ విధిస్తామన్నారు. దీనిపై నగరంలోని పలు వీధుల్లో ఆటోతో అవగాహన కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.