• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆదోని సుందరయ్య భవన్ సీపీఎం కార్యాలయం నిర్మాణానికి విరాళం

KRNL: ఆదోనిలో సుందరయ్య భవన్ సీపీఎం కార్యాలయం నిర్మాణానికి డీవైఎఫ్ఐ పట్టణ నాయకులు సతీష్ గారి తల్లి గ్రేసమ్మ ఆదివారం రూ.10,111 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని పార్టీ నాయకులకు ఆమె స్వయంగా అందజేశారు. కార్యాలయ నిర్మాణానికి సహకరించినందుకు సీపీఎం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఇటువంటి సహకారం మరింత ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 09:09 AM IST

ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

KKD: శంఖవరంలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీర్రాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరానికి గానూ ఈనెల 25వ తేదీ నుంచి 31వరకు ఆన్‌లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

February 22, 2026 / 09:06 AM IST

24 పరదేశిమాంబ పండగ మహోత్సవం

AKP: సబ్బవరం మండలం తవ్వవానిపాలెంలో ఈ నెల 24న పరదేశిమాంబ పండగను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ స్వామి నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం గోడపత్రిక ఆవిష్కరించారు. పండగ సందర్భంగా ఆదివారం రాష్ట్రస్థాయి మహిళ వాలీబాల్ పోటీలు, 23న చిడతల పోటీలు జరుగుతాయన్నారు. 24న ఎడ్ల బండ్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.

February 22, 2026 / 09:03 AM IST

జిల్లాలో కేజీ టమాటా రూ.12

విశాఖలోని 15 రైతు బజార్లో కాయగూరలు ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. టమోటా కేజీ రూ.12, కాకరకాయలు కేజీ రూ.50, దొండకాయలు కేజీ రూ.36, బరబాటి కేజీ రూ.26, చిక్కుడు కేజీ రూ.36, బీట్రూట్ కేజీ రూ.22, బీన్స్ కేజీ రూ.44, పండుమిర్చి కేజీ రూ.80, స్వీట్ గుమ్మడి కేజీ రూ.22, కేజీ ఉల్లిపాయలు రూ.18గా ఉన్నాయి. దయచేసి సరళీకరించాల్సిన వాక్యాన్ని పంపండి.

February 22, 2026 / 09:02 AM IST

బంగారుపాళ్యంలో పోలీసుల కర్డన్ సెర్చ్

CTR: బంగారుపాళ్యం మండలంలోని పాలేరు, బలిజపల్లి గ్రామాల్లో ఈ రోజు తెల్లవారుజామున పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో సిబ్బంది ట్రబుల్ మాంగర్స్, NDPS అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలు, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని అనుమానితులను కఠినంగా హెచ్చరించారు.

February 22, 2026 / 09:02 AM IST

రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి: ఎస్పీ

ATP: ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ జగదీష్ శనివారం సాయంకాలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, శాంతి భద్రతల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల పురోగతిపై సమగ్రంగా ఆరా తీశారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పారదర్శకత పాటించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు.

February 22, 2026 / 09:00 AM IST

చోళసముద్రం గ్రామంలో మహిళ అదృశ్యం

సత్యసాయి: లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన రజిని (19) కనిపించడం లేదని తల్లి నాగమ్మ, తండ్రి ఆదినారాయణలు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బంధువులు, గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సమాచారం లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 9676852213 నంబర్‌కు తెలపాలని కోరారు.

February 22, 2026 / 09:00 AM IST

కోనేరులో పడి వ్యక్తి మృతి

CTR: బంగారుపాళ్యం మండలం గౌరీ నారాయణపురంకు చెందిన పండు (42) ప్రమాదవశాత్తు మొగిలి కోనేరులో పడి మృతి చెందాడు. శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈనెల 19 లేదా 20న కోనేరులో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. బాధితుడి భార్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లు బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.

February 22, 2026 / 08:54 AM IST

నేడు మరిడిమాంబ ఆలయం ప్రారంభం

VSP: మునగపాక మండలం తోటాడలో నూతనంగా నిర్మించిన మరిడిమాంబ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల విరాళాలతో ఆలయాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఆలయం ప్రారంభం సందర్భంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 22, 2026 / 08:49 AM IST

జిల్లాలో నేటి చికెన్ ధరలు

పల్నాడు: నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.230 నుంచి రూ.260, స్కిన్‌తో రూ.220 నుంచి రూ. 240 వరకు అమ్ముతున్నారు. లైవ్ కోడి రూ.115. మటన్ కేజీ రూ. 900 నుంచి 1000 వరకు ఉంది. 100 కోడి గుడ్లు రూ. 530కి విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

February 22, 2026 / 08:49 AM IST

మర్చిపోయిన ఆభరణాల బ్యాగును ట్రేస్ చేసిన పోలీసులు

కృష్ణా: విశాఖపట్నం నుండి మచిలీపట్నం వెళ్లే రైలులో మహాలక్ష్మి అనే ప్రయాణికురాలు తన హ్యాండ్ బ్యాగ్‌ను భీమవరం రైల్వే స్టేషన్‌లో నిన్న మర్చిపోయారు. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై మహబూబ్ షరీఫ వెంటనే అప్రమత్తమై హ్యాండ్ బ్యాగులో ఉన్న 110 బంగారు ఆభరణాలు, ఒక మొబైల్ ఫోన్, రూ.5000 నగదు బాధితురాలికి ఎస్సై నిన్న అందజేశారు.

February 22, 2026 / 08:47 AM IST

జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి

శ్రీకాకుళం: నేటి స్థానిక మార్కెట్‌లో చికెన్ ధరలు సుమారు స్థిరంగానే ఉన్నట్లు మార్కెట్ డేటా ప్రకటిస్తోంది. వ్యాపారుల సమాచారాల ప్రకారం కేజీ స్కిన్‌ చికెన్ సుమారు ₹265కు, స్కిన్‌లెస్ సుమారు ₹270కు, బోన్‌లెస్ చికెన్ సుమారు ₹275 కు విక్రయింపబడుతున్నాయి, మరియు షాపులివ్వే రేట్లు కొంచెం తేడాలతో మారవచ్చని సూచనలున్నాయి.

February 22, 2026 / 08:45 AM IST

APO సస్పెండ్.. అసిస్టెంట్లకు నోటీసులు..!

CTR: పలమనేరు ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం.. ఈ అంశంలో ఎంత మేర ప్రభుత్వ నిధులు ప్రజలకు అందకుండా స్వాహా చేశారో తేలనుంది.

February 22, 2026 / 08:43 AM IST

గ్యాస్ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు: జేసీ

KKD: గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ గ్యాస్ ఏజెన్సీల డీలర్లను హెచ్చరించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, లీడ్ బ్యాంక్ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్‌తో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

February 22, 2026 / 08:37 AM IST

‘బిఎస్ఎన్ఎల్ సేవలు మెరుగుపరచాలి’

ASR: అనంతగిరి మండలం కొండిభ పంచాయతీలో ఉన్న బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ మూగబోయిందని తక్షణమే సెల్ సేవలు అందించాలని గ్రామస్తులు బిఎస్ఎన్ఎల్ టవర్ వద్ద ఆందోళన నిర్వహించారు. గత వారం రోజులుగా సేవలు నిలిచి పోవడంతో వినియోగదారులతోపాటు పంచాయతీ సచివాలయ కార్యకలాపలు నిలిచిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సెల్ సేవలను పునరుద్దరించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 08:36 AM IST