• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నూజివీడులో రేపు మీకోసం కార్యక్రమం

ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రతి సమస్య ఆన్ లైన్ చేసి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు.

February 22, 2026 / 09:44 AM IST

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 18 గంటలు

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం కృష్ణతేజ అతిథి భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 82,043 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లుగా నమోదైంది.

February 22, 2026 / 09:40 AM IST

సింగరాయకొండ వద్ద ఘోర ప్రమాదం

ప్రకాశం: సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కందుకూరు ఫ్లైఓవర్ మీద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్తున్న కంటైనర్ బాక్స్ లారీని పుచ్చకాయ లోడ్‌తో వెళ్తున్న మినీ వ్యాన్ వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో మినీ లారీ డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:40 AM IST

నగరంలో పెళ్లింట విషాదం.. యువతి మృతి

VZM: అనకాపల్లి జిల్లా బత్తివానిపాలెం వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయనగరం జిల్లా రాచకిండాం గ్రామానికి చెందిన లావణ్య మృతి చెందింది. సోదరుడి పెళ్లి వేడుక అనంతరం నూతన వధూవరులతో నిన్న శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లావణ్య మృతి చెందగా నవ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.

February 22, 2026 / 09:37 AM IST

ఈనెల 27న బహిరంగ వేలం పాట

ATP: తాడిపత్రి మండలం గంగాదేవి పల్లెలో కొలువైన గంగాభవాని దేవస్థానంలో ఈనెల 27న మధ్యాహ్నం ఒంటి గంటకు తల నీలాల సేకరణ, వసతి గదులు, సప్లయర్స్ సామాన్ల అద్దె, హోటల్ నిర్వహణ, గాజులు, బొమ్మలు, ఐస్క్రీమ్, చెరుకు రసం విక్రయిం చుకొనుటకు వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఈవో రామాంజినేయులు తెలిపారు. రూ.10 వేలు డిపాజిట్ చెల్లించి పాల్గొనాలన్నారు.

February 22, 2026 / 09:36 AM IST

అనంత బాబు కేసులో ఉన్నతాధికారి సస్పెండ్

W.G: కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన MLC అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో డీఎస్పీ, ప్రస్తుతం జిల్లా ఏఎస్పీగా ఉన్న భీమరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

February 22, 2026 / 09:34 AM IST

చింతపల్లి మండలంలోని రైతులకు గమనిక

VSP: చింతపల్లి మండలంలో మొత్తం 16,127మంది రైతులకు గాను ఇప్పటి వరకూ 9,600మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేశామని ఏవో మధుసూదనరావు తెలిపారు. పెండింగ్లో ఉన్న 6,527మందికి రైతులకు త్వరలో పూర్తి చేస్తామన్నారు. గెంజిగెడ్డ గ్రామంలో పర్యటించారు. ఆర్ఎస్కే సిబ్బందితో కలిసి రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ చేశారు. ఫార్మర్ రిజిస్ట్రీ గడువు దగ్గర పడుతుందన్నారు.

February 22, 2026 / 09:32 AM IST

కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి భేటీ

SKLM: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌‌తో టెక్కలి MLA, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం తిరుపతిలో మర్యాదపూర్వకంగా భేటీఅయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగా భివృద్ధి, రైతుల సంక్షేమ పథకాల అమలు పై చర్చించారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రిని కోరారు.

February 22, 2026 / 09:31 AM IST

మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఏమ్మెల్యే

TPT: సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలో కొత్త మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆదివారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రజలకు నాణ్యమైన శుద్ధి నీటిని అందించే ప్రయత్నంలో ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నాయకులు, ప్లాంట్ యజమాని నాగరాజు మోడలియార్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ఎంపీపీలు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:28 AM IST

‘ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై అవగాహన ఉండాలి’

ASR: ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన ఉండాలని చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయభారతి అన్నారు. విజ్ఞానయాత్రలో భాగంగా స్థానిక ఎంపీడీవో, రెవెన్యూ, విద్యాశాఖ కార్యాలయాలు, న్యాయస్థానాన్ని శనివారం బీఏ విద్యార్థులకు చూపించారు. వివిధ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే అధికారులు, ఉద్యోగులు, విధులు వివరాలను విద్యార్థులకు వివరించారు.

February 22, 2026 / 09:23 AM IST

రేపు డీఆర్డీఏలో ఉద్యోగ మేళా

TPT: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో సోమవారం కోటక్ మహీంద్ర మైక్రో ఫైనాన్స్ సంస్థలో ‘ట్రైనింగ్ సెంటర్ ఆఫీసర్’ భర్తీకి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శోభన్‌బాబు తెలిపారు. పది నుంచి పీజీ వరకు చదివి వయసు 21-25 సంవత్సరాల వారు అర్హులన్నారు. సమాచారం కోసం 87124 95517లో సంప్రదించాలన్నారు.

February 22, 2026 / 09:22 AM IST

శ్రీవారి సేవలో మంత్రి అచ్చెన్న నాయుడు

SKLM: టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ వేదపండితుల మంత్రో చ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. దర్శనం అనంతరం మంత్రి ఆధ్యాత్మిక అనుభూతి పొందినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:19 AM IST

రైతులు ఆదాయ మార్గాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్

NTR: ఏ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈ రైతోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి రైతు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రతి గ్రామ క్లస్టర్‌ను ఎంచుకొని, ఆదాయ మార్గాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:16 AM IST

ఈ నెల 28న జిల్లాకు సీఎం చంద్రబాబు

VZM: ఈ నెల 28న సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. చీపురుపల్లి మండలం రావివలసలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికారికంగా సమాచారం అందినట్లు ఎమ్మెల్యే కళా వెంకట్రావు తెలిపారు. అనంతరం అదే రోజున పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారన్నారు.

February 22, 2026 / 09:15 AM IST

ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిస్సింగ్

KDP: ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సాయి ఊర్మిళ మిస్సింగ్ అయ్యారు. ఈ మేరకు ఆమె భర్త సూర్యకృష్ణ స్థానిక 2-టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2-టౌన్ SI రాఘవేంద్రారెడ్డి ఆదివారం మీడియాకు ఇచ్చిన సమాచారం మేరకు.. సాయి ఊర్మిళ, సూర్య కృష్ణ దంపతులు స్థానిక గోపవరం పంచాయితీలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నారు.

February 22, 2026 / 09:12 AM IST