• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రహదారిపై ఫ్లెక్సీ బోర్డులు ప్రమాదాలకు నిలయాలు

SKLM: రాజాంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పోలిపల్లి పైడితల్లి అమ్మవారు ఉత్సవాలకు ఇటు రాజకీయ నాయకులు, వ్యాపార సంస్థలు రోడ్డుకు అడ్డంగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయడంతో రాకపోకలు సాగించే ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. ఏ క్షణంలో వాహనాలు ఢీ కొట్టుకుంటాయోనని ప్రయాణికులు వాపోతున్నారు.

February 24, 2026 / 10:07 AM IST

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

విశాఖ: నగరంలోని బిర్లా జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. భారీ వేగంతో డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమయ్యే అంశాలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

February 24, 2026 / 10:07 AM IST

డబ్బు ఇవ్వలేదని భార్యపై కొడవలితో దాడి

ATP: అనంతపురం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో నాగభూషణం అనే వ్యక్తి తన భార్య గౌరమ్మపై కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 09:58 AM IST

అక్రమ కేసులకే ప్రభుత్వం ప్రాధాన్యం: నారాయణ స్వామి

చిత్తూరు: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం.. అక్రమ కేసులు అధికమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరులోని ఆయన నివాసంలో ఇవాళ మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కూటమి తప్పులను ప్రశ్నిస్తే అరాచకం, దౌర్జన్యం, దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయని వాపోయారు.

February 24, 2026 / 09:56 AM IST

నేడు శంబరలో 5వ వారం జాతర

PPM: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర 5వ వారం మంగళవారం జరగనుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో B.శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలియజేశారు. పటిష్ఠమైన క్యూలైన్లు, బారీకేడ్లు, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనంతో పాటు ఉచిత దర్శనం, తాగు నీరు ఏర్పాటు చేశారని చెప్పారు.

February 24, 2026 / 09:56 AM IST

ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీలో కార్డన్ సర్చ్

ప్రకాశం: ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 80 మందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి రికార్డులు లేని 4 ఆటోలు, 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహన రికార్డులు చూపిన తర్వాత వాటిని యజమానులకు అప్పగించారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కాలనీలో ర్యాలీ చేపట్టారు.

February 24, 2026 / 09:55 AM IST

కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

బాపట్ల అప్పికట్ల రోడ్డులోని యారకాలువలో ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల్లో వంశీకృష్ణ మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. సోమవారం సాయంత్రం మద్యం మత్తులో ఈత పోటీకి దిగి వంశీ, చందు అనే స్నేహితులు నీటిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అధికారుల గాలింపు చర్యల తర్వాత వంశీ మృతదేహం బయటపడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

February 24, 2026 / 09:53 AM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్

NLR: నగరంలోని బాబు ఐస్క్రీం ఎదురుగా మంగళవారం ఓ వ్యక్తి మద్యం తాగి వాహనాలకు అడ్డుపడ్డాడు. ఆటోలు, కార్లు, బైకులను ఆపి వాటిని పోనివ్వకుండా హల్‌చల్ చేశాడు. కొందరు యువకులు ఆ వ్యక్తిని పక్కకు తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

February 24, 2026 / 09:52 AM IST

మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువకుడు

NLR: మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించి, ఆమెపై పెట్రోల్ పోసి ఓ యువకుడు నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళతో పాటు యువకుడు కూడా గాయపడ్డాడు. ఇద్దరూ ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

February 24, 2026 / 09:51 AM IST

ఆరో తరగతి ప్రవేశాలకు ఆహ్వానం

PPM: ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలన్నారు. జిల్లాలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిరవదికంగా 2024- 25, 2025-26 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలన్నారు.

February 24, 2026 / 09:51 AM IST

డయేరియాపై అప్రమతమైన యంత్రాంగం

SKL: దమ్మల వీధి, గోల్కొండ రేవు వీధుల్లో అతిసారం వ్యాపించి 25 కేసులు నమోదయ్యాయి. బాధితులను చికిత్స కోసం కొందరిని రాజీవ్ గాంధీ వైద్యశాలలో చేర్చి చికిత్స ఇవ్వగా కోలుకున్నారు. పరిస్థితిపై అధికారులు అప్రమత్తమై కలెక్టరేట్‌లో 08942-229080 హెల్ప్‌లైన్‌ను 24 గంటలు అందుబాటులో ఉంచారు. ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేపట్టారు.

February 24, 2026 / 09:49 AM IST

అర్జీల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

కర్నూలు: కలెక్టర్ సిరి ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. నిర్ణీత గడువులోపు ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని, ఒక్క అర్జీ కూడా ఎస్‌ఎల్‌పీకి మించకూడదని స్పష్టం చేశారు.

February 24, 2026 / 09:45 AM IST

పూర్వపు మఠాధిపతి చిత్రపటానికి ప్రత్యేక పూజలు

KDP: కందిమల్లయపల్లిలోని జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠంలో నూతన మఠాధిపతుల పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి దర్శనం నిర్వహించగా, పూర్వపు మఠాధిపతి చిత్రపటానికి నూతన మఠాధిపతులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై మహోత్సవంలో పాల్గొన్నారు.

February 24, 2026 / 09:43 AM IST

ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆదాయ వివరాలు

SKLM: నాగావళి నది తీరాన కొలువై ఉన్న శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని ఈవో సుకన్య ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ లెక్కింపులో ఆలయానికి రూ.2,38,567 ఆదాయం లభించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

February 24, 2026 / 09:43 AM IST

అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు: సీఐ

NDL: కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయినిపేటకి చెందిన నాగజయంతిని అదనపు కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు. నాగ జయంతిని నొస్సం గ్రామానికి చెందిన గాదంశెట్టి వెంకటరాముడుకి ఇచ్చి వివాహం చేయగా, కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పుట్టింటికి చేరుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇవాళ కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

February 24, 2026 / 09:42 AM IST