ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. ఇబ్రహీంపట్నం నుంచి కొండపల్లి వైపుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బారికేడ్లను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారన్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తిరుపతి నగర ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కమిషనర్ ఎన్. మౌర్య సూచించారు. సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు కార్యక్రమం నిర్వహిస్తామని, 0877-2227208 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలని తెలిపారు.
ATP: గరుగు చింతలపల్లి చెరువుకు నీరు విడుదల చేయకపోవడంపై వైసీపీ మండల అధ్యక్షుడు పొన్నపాటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకే శైలజానాథ్ నాయకత్వంలో అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా చెరువు ఎండిపోవడంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
ప్రకాశం: ఒంగోలులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ‘మీకోసం కార్యక్రమం’ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజా బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే, నమోదైన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు
SKLM: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. గార మండలం సతివాడ పంచాయతీ యాలపేట గ్రామంలో ఉన్న పాఠశాలలో రూ 3.8 లక్షలతో మరుగుదొడ్లు, రూ 9.8 లక్షలతో పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల భద్రత పరిరక్షణ అవసరం అన్నారు.
PLD: వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం బొగ్గరంలో ఆదివారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
PLD: చిలకలూరిపేట టిడ్కో గృహాల వద్ద రూ. 3.60 కోట్లతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. 5,520 కుటుంబాలకు సౌకర్యంగా ఉండేలా 30 దుకాణాలతో దీన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడ నివాసముంటూ ఉపాధి లేని వారికే ఈ షాపులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఆరు నెలల్లోగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని రంగాపురం గ్రామంలో కొండపై వెలసిన శివాలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలను చల్లగా చూడాలని ఆకాంక్షించారు.
SKLM: కోటబొమ్మాలి ఎంపీడీవో కార్యాలయం ఎదుట దివంగత నేత, కలింగుల ఆరాధ్య దైవం స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు 34వ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఉమామల్లయ్య, గోవిందరావు, సత్యరాజు, సతీష్, తదితరులు ఉన్నారు.
తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శాప్ చెస్ లీగ్ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఆయన మాట్లడుతూ.. క్రీడలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని కలెక్టర్ తెలిపారు.
NDL: తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ తప్పుచేసి మళ్లీ బుకాయిస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న వైసీపీని హిందూ వ్యతిరేక పార్టీగా ఆయన అభివర్ణించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, గౌరు వెంకటరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు పాల్గొన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదివారం పర్యటించారు. సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పాత మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. పాత మున్సిపాలిటీ కార్యాలయ భవనాన్ని ఆధునికరించి ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు.
ATP: గుత్తిలో ఆదివారం ది గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మహాజన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు శ్రీనివాసులనే ఖాతాదారుడు ఇంటి రుణాల్లో గోల్ మాల్ జరిగిందని, మార్కెట్ విలువ కంటే తక్కువకు గృహాల వేలం వేశారంటూ టౌన్ బ్యాంక్ ఛైర్మన్, అబ్దుల్ జిలాన్‌తో మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. సమస్య పరిష్కరిస్తామని తెలపడంతో ఖాతాదారుడు శాంతించాడు.
సత్యసాయి: పెనుకొండ సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పరిస్థితిపై ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో పెనుకొండ డీఎస్పీ, సీఐలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
KDP: VN పల్లె (M) తలపనూరులోని గంగమ్మ తల్లి ఆలయ 33వ వార్షికోత్సవం ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నాగిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయము అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అనంతరం అమ్మవారికి గ్రామ మహిళలచే బోనాల సమర్పణ ఉంటుందన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.