• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పోరుమామిళ్ల కవికి విజయవాడలో సత్కారం

KDP: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న తెలుగు మహాసభల్లో పోరుమామిళ్లకు చెందిన కవి బొల్లు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష ప్రాముఖ్యతను గురించి పలువురు ప్రసంగించారు. అనంతరం తెలుగు, సాంస్కృతిక అకాడమీ AP ఛైర్మన్ విల్సన్ చేతుల మీదుగా ఆయనకు మెమెంటో అందించి సత్కరించారు.

February 22, 2026 / 07:05 AM IST

మసీదును సందర్శించిన ఎంపీ కేశినేని చిన్ని

NTR: జగ్గయ్యపేట మండలం మహమ్మద్ పేటలోని మసీదును ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్‌తో కలిసి ఎంపీ కేసినేని చిన్ని నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పలు సమస్యలు గురించి ఎంపీ కేశినేని దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ ముస్లిం పెద్దలకు హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

February 22, 2026 / 07:05 AM IST

హాస్టల్ విద్యార్థి మిస్సింగ్.. కేసు నమోదు

KKD: పిఠాపురం ఎస్సీ బాలుర హాస్టల్లో చదువుతున్న దాసరి పార్ధు శనివారం ఉదయం హాస్టల్ నుంచి RRBHR ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రమైనా హాస్టల్‌కు తిరిగి రాకపోవడంతో వార్డెన్ చుట్టు పక్కలా వెతికినా కనిపించ లేదు. పార్ధు సొంతూరు గొల్లప్రోలులోని రంగప్ప చెరువు అని సమాచారం. బాలుడికి 13 ఏళ్లు ఉంటాయాని, పాఠశాల యూనిఫామ్ వేసుకున్నాడని తెలిపారు.

February 22, 2026 / 07:03 AM IST

ఆస్పరి సీఐ కీలక సూచనలు

KRNL: ఆస్పరి మండల ప్రజలకు CI ఏ. గంగాధర్ పలు సూచనలు చేశారు. పక్క మండలాల్లో చైన్ స్నాచింగ్, దొంగతనాలు జరుగుతున్నాయని, ఈ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానస్పద వ్యక్తులపై దృష్టి పెట్టి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మహిళలు, వృద్ధులు ముఖ్యంగా చైన్లు ధరించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎటువంటి సమాచారం కోసమైనా 9121101159కు సంప్రదించాలన్నారు.

February 22, 2026 / 07:03 AM IST

నేడు మెగా జాబ్ మేళా

కోనసీమ: సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రామచంద్రపురం ఉపాధి భవన్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి సుభాష్ కార్యాలయం తెలిపింది. 10వ తరగతి నుంచి డిప్లమా వరకు చదివిన 18-27 ఏళ్ల యువత అర్హులు. నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశమని, పెద్ద ఎత్తున పాల్గొనాలని అధికారులు కోరారు. ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.

February 22, 2026 / 07:00 AM IST

నేడు పరిగిలో పర్యటించనున్న మాజీ మంత్రి

సత్యసాయి: పరిగి మండలంలోని శాసనకోట గ్రామ పంచాయతీలో ఆదివారం మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ పర్యటించనున్నట్లు మండల వైసీపీ కన్వీనర్‌ నరసింహమూర్తి తెలిపారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు ‘కాఫీ విత్‌ వైసీపీ లీడర్స్‌’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని తెలిపారు. అనంతరం గ్రామ కమిటీల నిర్మాణంపై నాయకులతో చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొనాలని కోరారు.

February 22, 2026 / 07:00 AM IST

ఐదుగురు డిగ్రీ విద్యార్థుల డిబార్

ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. అనంతపురం శ్రీ చైతన్య కళాశాలలో ముగ్గురు, గుత్తి MS డిగ్రీ కళాశాలలో ఒకరు, హిందూపురం బాలాజీ విద్యామందిర్‌లో ఒకరిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 07:00 AM IST

రేపు ప్రజా సమస్యల పరిష్కారవేదిక

KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు.

February 22, 2026 / 06:56 AM IST

డిగ్రీ పరీక్షల్లో 18 మంది డిబార్

KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరగుతున్న డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 18 మంది విద్యార్థులను శనివారం డిబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. 10,263 మంది విద్యార్థులకు గాను 9,387 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు వెల్లడించారు.

February 22, 2026 / 06:48 AM IST

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా

CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.144 నుంచి రూ.150, మాంసం రూ.209 నుంచి 234 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.238 నుంచి రూ.260 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.75 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

February 22, 2026 / 06:47 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి టీడీపీ కార్యాలయంలో 9 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ.7,63,198 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చంద్రబాబు ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:44 AM IST

‘వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలి’

శాసనమండలలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామిని అవమానించి అపచారం చేశారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ విమర్శించారు. ఈ మేరకు అనకాపల్లి పట్టణం గాంధీనగరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, ఆలయ సంప్రోక్షణ చేశారు. వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 06:43 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

TPT: సైదాపురం నుంచి రాపూరు వెళ్లే దారిలో జగనన్నా లేఅవుట్ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై బైకుపై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడిందా లేదా మరో వాహనం వీరిని ఢీకొట్టిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 06:43 AM IST

నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఉదయం 8:30 కు రాష్ట్ర పండుగగా గుర్తింపు పోందిన రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గోననున్నారు. అనంతరం 11కు చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవానికి హాజరుకానున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి.

February 22, 2026 / 06:40 AM IST

ఇక ప్రొద్దుటూరుకు నాన్ స్టాప్ బస్సులు ఉండవు

KDP: జమ్మలమడుగు RTC డిపో నుంచి ప్రొద్దుటూరుకు 9 నాన్ స్టాప్, 3 పల్లెలకు సర్వీసులు ఉన్నాయి. ఇక ఇప్పటి నుంచి 12 సర్వీసులను పల్లె వెలుగు బస్సులు గా మారుస్తున్నట్లు డిపో మేనేజర్ సుబ్బమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈనెల 26 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 06:39 AM IST