NDL: డోన్ పట్టణంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని నయారా పెట్రోల్ పంపు వద్ద బైక్‌ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో ఆలంకొండకు చెందిన మునిరంగడు (28) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు,కొడుకు ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ELR: వైసీపీ సభ్యులు కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను రాజకీయ ప్రదర్శనలకు వినియోగించడం అత్యంత దురదృష్టకరమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. శనివారం ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దేవుడి పేరును రాజకీయ లాభాల కోసం వినియోగించడం హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీయడమేనని అన్నారు.
E.G: చాగల్లు గ్రామ పంచాయతీలో గృహ నిర్మాణ ప్రగతిపై పీడీ హౌసింగ్ నాతి బుజ్జి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో ఉగాది నాటికి పూర్తి చేయాల్సిన 417 గృహాల నిర్మాణంపై ఆమె సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాన్ని సమయానికి పూర్తి చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
KNL: జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధ్యక్షతన మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకోసం కట్టుబడి పనిచేయాలని, యువతను రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ ప్రజలకు సంక్షేమ సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వరు ఉన్నారు.
GNTR: ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు శనివారం మంగళగిరిలో TDP మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దళిత యువకుడి హత్యకేసులో పాల్పడ్డ అనంతబాబు ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు అని, జగన్ పార్టీని వెంటనే సస్పెండ్ చేయాలి అని, దళితుల భద్రత, హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా స్పందించాలని డిమాండ్ చేశారు.
GNTR: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తెనాలి నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న 61 మందికి రూ. 46,59,619ల విలువైన చెక్కులను శనివారం తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. వైద్య చికిత్సల ఖర్చులు భారంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం అనేక కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు.
BPT: రేపల్లె పట్టణంలో శనివారం ఆర్డీవో ఎన్ రామలక్ష్మి ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీరో వెస్ట్–లిట్టర్ ఫ్రీ గవర్నెన్స్ లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ అనగాని శివ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు.
VSP: 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ గంగవరం ప్రాంతానికి చెందిన నోళ్లు తేజ ఎంపికయ్యాడు. ఈ పోటీలు ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు గుజరాత్‌లోని వడోదరలో జరగనున్నాయి. గంగవరం గ్రామానికి చెందిన కనకరావు కుమారుడు తేజ ప్రస్తుతం అదానీ ఫౌండేషన్‌లో స్పోర్ట్స్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
ప్రకాశం: కార్మికుల, కష్టజీవుల దోపిడీకి వ్యతిరేకంగా శ్రామికులంతా ఐకమత్యంతో పోరాడాలని సీపీఎం నాయకులు ఊసా వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రశేఖరపురం సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రెడ్ బుక్స్ డే కారుక్రమంలో భాగంగా చదువుదాం సమాజాన్ని మార్చుదాం అనే అంశం గురించి చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులు, కష్ట జీవులను దోచుకోవడం నేటికీ కొనసాగుతుందన్నారు.
SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు యూజీ పరీక్షల విభాగం డీన్ ఎం. అనురాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీబీ, సీఏ. బీబీఏ, బీటెక్ పరీక్షలు సంబంధించి రిజల్ట్ యూనివర్సిటీ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, వర్సిటీ వెబ్‌సైట్ ఫలితాలను విద్యార్థులు చూడవచ్చని తెలిపారు.
ప్రకాశం: కనిగిరి డీఎస్పీ ఆదేశాల మేరకు, పొదిలి పట్టణంలోని చిన్నచెరువు ప్రాంతంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులు లేని 3 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరి డీఎస్పీ ఆదేశాల మేరకు, పొదిలి పట్టణంలోని చిన్నచెరువు ప్రాంతంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులు లేని 3 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
CTR: నగరి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమం ఆదివారం ఉదయం 10.26 గంటలకు చిత్తూరు బస్టాండ్ సమీపంలో నిర్వహించనున్నట్లు నగరి ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటించింది. కార్యక్రమానికి MLA భానుప్రకాష్ హాజరుకానున్నారు. నగరి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
CTR: నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం తన కార్యాలయంలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. పరిష్కారం అవసరమైన అంశాలపై వెంటనే స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
TPT: సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి వెంకటనాగరాజు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతను సామాజిక ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు ర్యాలీ, పోస్టర్ పోటీలు నిర్వహించగా ఎన్ఎస్ఎస్ సభ్యులు పాల్గోన్నారు.