• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

NDL: వేల్పనూరులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఆత్మకూరు బార్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఇవాళ ఎమ్మెల్యే స్వగృహంలో ప్రెసిడెంట్ బోల్లు నగేష్,సెక్రటరీ సుదర్శన్, వైస్ ప్రెసిడెంట్ నూర్ అహమ్మద్ కలిసి సత్కరించారు. ఆత్మకూరులో కొత్తగా ఏర్పాటు కాబోతున్న అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ,శిధిలావస్థలో ఉన్న కోర్టు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు.

April 16, 2026 / 06:01 PM IST

పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న చైర్‌పర్సన్

ATP: ఆర్డీటీ కోసం బహుజన రాజ్యాధికార జేఏసీ నిర్వహించిన వెయ్యి కిలోమీటర్ల ‘చలో రాజధాని’ పాదయాత్ర ముగింపు సందర్భంగా అనంతపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి పాల్గొని, మాట్లాడారు. సామాజిక న్యాయం, సేవా సంస్థల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ యాత్రకు సహకరించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

April 16, 2026 / 06:00 PM IST

పులేరులో పురుషులకు వంటల పోటీలు నిర్వహణ

సత్యసాయి: గోరంట్ల మండలం పులేరు గ్రామంలో పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా పురుషులకు గురువారం వంటల పోటీలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో కుటుంబ పోషణలో పురుషుల భాగస్వామ్యం అంశంపై తండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ.. గర్భిణీలు, చిన్నపిల్లల సంరక్షణలో తండ్రుల బాధ్యతలను క్షుణ్ణంగా వివరించారు.

April 16, 2026 / 06:00 PM IST

‘డీఈవోని వెంటనే సస్పెండ్ చేయాలి’

కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు రఘునాథ్, షాహిద్, ఆఫ్రిద్ డిమాండ్ చేశారు. కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయులను ఆయన వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా గేదెకు వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

April 16, 2026 / 06:00 PM IST

‘పోలీస్ క్వార్టర్స్‌ను ఆధునికరించండి’

ELR: ద్వారకాతిరుమలలో పోలీసు సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్స్ నేడు శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం క్వార్టర్స్‌లో ఎవరు లేకపోవడంతో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తుంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన క్వార్టర్స్ నిరుపయోగంగా మారడంతో విషపురుగుల సంచరించే అవకాశం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి క్వార్టర్స్ పునరుద్ధరించాలని కోరారు.

April 16, 2026 / 06:00 PM IST

స్వీయ జన గణన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఏపీలో జరుగుతున్న స్వీయ జనగణనలో తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగణన గణాంకాలు భవిష్యత్తు ప్రణాళికలకు పునాది వంటివని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ఈ అవకాశాన్ని పౌరులందరూ బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు.

April 16, 2026 / 06:00 PM IST

స్వీయ జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే

NLR: దేశ వ్యాప్తంగా జనగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కందుకూరు R&B గెస్ట్ హౌస్లో గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. MLA ఇంటూరి నాగేశ్వరరావు తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. DRO ఓబులేసు మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు స్వీయ గణన కొనసాగుతుందని, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.

April 16, 2026 / 06:00 PM IST

బాలకృష్ణను కలిసిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు

ఎన్టీఆర్: గుంటూరులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను, నందిగామ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వర కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా బాలకృష్ణ నియమితులైన సందర్భంగా ఆయన శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 16, 2026 / 05:59 PM IST

‘శ్రీనివాస్ యాదవ్ క్షమాపణలు చెప్పాలి’

SKLM: తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ PACS డైరెక్టర్ పైడి మురళీ మోహన్ తీవ్ర ఖండించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.

April 16, 2026 / 05:56 PM IST

సంతమాగులూరులో రీ సర్వే పనులు ప్రారంభం

BPT: సంతమాగులూరు మండలంలోని కొప్పరం రెవిన్యూ సజ్జాపురంలో గురువారం రీ సర్వే ప్రారంభించారు. ఉదయం ఫీల్డ్‌లోకి వెళ్లి భూములను పరిశీలించారు. మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్లు, వీఆర్వోలు పారదర్శకంగా రీ సర్వే నిర్వహించిన భూములను వెబ్ ల్యాండ్‌లో నమోదు చేస్తామని తెలిపారు. రీ సర్వే నిర్వహించే భూముల యజమానులకు నోటీసులు ఇచ్చామని వారు అన్నారు.

April 16, 2026 / 05:51 PM IST

సెల్ఫీ వీడియోతో వ్యక్తి ఆత్మహత్య

KKD: సీతారామపురంలో పంపన రాజు అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తన భార్య అక్రమ సంబంధం, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు, పోలీసుల వేధింపులే కారణమని ఆరోపించాడు. భార్య పెట్టిన కేసుల వల్ల మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 16, 2026 / 05:50 PM IST

జలధార-జలహారతిపై సమావేశం

AKP: గొలుగొండ మండల కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో ‘జలధార-జలహారతి’ కార్యక్రమంలో భాగంగా అన్ని చెరువుల స్థితిగతులను పరిశీలించి చేపట్టాల్సిన పనులను గుర్తించినట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ పనులను ఎన్ఆర్ఈజీఎస్, వేతన, మెటీరియల్ ఆధారిత పనులుగా వర్గీకరించి ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశామని చెప్పారు.

April 16, 2026 / 05:48 PM IST

17 నుంచి సీఐటీయూ రాష్ట్ర మహాసభలు

VSP: నంద్యాలలో ఏప్రిల్ 17 నుంచి 19 వరకు సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్‌వీ కుమార్ తెలిపారు. ఈమేరకు గురువారం జగదంబ సీఐటీయూ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. విశాఖ నుంచి 60 మంది ప్రతినిధులు హాజరవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 650 మంది పాల్గొంటారని పేర్కొన్నారు.

April 16, 2026 / 05:47 PM IST

‘సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి’

ఎన్టీఆర్: ప్రజాదర్బార్‌కు వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు అధికారులను ఆదేశించారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గొల్లపూడిలోని వారి కార్యాలయంలో గురువారం ప్రజాదర్బారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జీలు స్వీకరించారు.

April 16, 2026 / 05:47 PM IST

సికిల్ సెల్ ఎనీమియాపై అవగాహన కార్యక్రమం

VZM: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో యూనిసెఫ్ సహకారంతో సికిల్ సెల్ ఎనీమియా (రక్తహీనత)పై వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను వివరించారు. ఈ శిక్షణలో జిల్లాలోని 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

April 16, 2026 / 05:45 PM IST