• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘లచ్చన్న ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకం’

కోనసీమ: కొత్తపేటలో మండల శెట్టిబలిజ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి ఆదివారం ఆర్.ఎస్ బీసీ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 1909లో జన్మించి 98 సంవత్సరాల పాటు బడుగు వర్గాల కోసం నిరంతరం పోరాడిన లచ్చన్న నిజమైన ప్రజానాయకుడని కొనియాడారు.

April 19, 2026 / 02:54 PM IST

పవన్ కళ్యాణ్ కోలుకోవాలని పూజలు

SKLM: కొణిదెల పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసైనికులు మందస గ్రామదేవత శ్రీ అన్నపూర్ణమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

April 19, 2026 / 02:52 PM IST

ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యప్రభ

KKD: ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడిలోని TDP కార్యాలయంలో సత్య ప్రభ ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించారు. ప్రజల సమస్యలను విని కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్ని సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఎమ్మెల్యే ఇచ్చారు.

April 19, 2026 / 02:44 PM IST

తణుకు ఎమ్మెల్యేకు అభినందనల వెల్లువ

W.G: ఇటీవల తెలుగుదేశం పార్టీలో రీజనల్ కో- ఆర్డినేటర్‌గా నియమితులైన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు ఆదివారం పలు సంఘాలు అభినందనలు తెలిపాయి. శాలివాహన కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాధాకృష్ణను కూటమి కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చంతో శాలువాతో ఘనంగా సత్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గురుజుకోట రాకేష్ బాబు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

April 19, 2026 / 02:43 PM IST

మాజీ సర్పంచ్‌పై దాడి

GNTR: కాకుమాను మండలం కొల్లిమర్లలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామ సమీపంలోని పొలం వద్ద మాజీ సర్పంచ్ రామకోటయ్య, కొడలి అనే వ్యక్తి ఇరువురు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో మాజీ సర్పంచ్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘర్షణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 19, 2026 / 02:41 PM IST

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

KDP: ముద్దనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను సీఐ నగేష్ బాబు పోలీస్ స్టేషన్‌కు ఆదివారం పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మంచి ప్రవర్తనతో ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనరాదని హెచ్చరించారు.

April 19, 2026 / 02:37 PM IST

రావులపాలెం నుంచి కర్ణాటకకు స్పెషల్ బస్ సర్వీస్

కోనసీమ: భక్తుల సౌకర్యార్థం APSRTC రావులపాలెం డిపో నుంచి కర్ణాటక, మైసూర్ ఎనిమిది రోజుల పుణ్యక్షేత్ర యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వై.వీ.వీ.ఎన్. కుమార్ తెలిపారు. ఈ బస్సు ఈ నెల 25న మధ్యాహం రావులపాలెం నుంచి బయలుదెరుతుందన్నారు. ఈ సూపర్ లగ్జరీ బస్సుకు అడ్వాన్స్ రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

April 19, 2026 / 02:37 PM IST

భానుడి భగభగ.. అల్లాడుతున్న ప్రజలు

మార్కాపురంలో వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు ఉష్ణోగ్రత 41 డిగ్రీలకు చేరింది. అధిక వేడిమితో పట్టణ ప్రజలు బయటకు రావడం కష్టమవుతోంది. ఒకవైపు వేడిమి, మరోవైపు ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన వీధులు కూడా ఖాళీగా మారిపోయాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులు సూచించారు.

April 19, 2026 / 02:32 PM IST

పెద్దమ్మతల్లి మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామ పెద్దలు ఆదివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో ఈ నెల 22న జరిగే పెద్దమ్మతల్లి ఊరిదేవర మహోత్సవ ఆహ్వాన పత్రికతో పాటు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గ్రామ పెద్దలు సుధీర్ గౌడ్, లోకేష్ గౌడ్ మాట్లాడుతూ.. పెద్దమ్మ జాతరకి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.

April 19, 2026 / 02:31 PM IST

ఘనంగా పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు

NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఈ నెల 27 నుంచి మే 7 వరకు పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇవాళ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బిసి రాజారెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని వారు బీసీ రాజారెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.

April 19, 2026 / 02:30 PM IST

వృథాగా పోతున్న తాగునీరు

TPT: సూళ్లూరుపేట(M) కోటపోలూరు వెస్ట్ హరిజనవాడలో నీటి ట్యాంక్ నుంచి తాగునీరు భారీగా వృథా అవుతోంది. రాత్రి నుంచి పైప్‌లైన్ పగిలిపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని స్థానికులు తెలిపారు. తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

April 19, 2026 / 02:29 PM IST

స్టీల్ ప్లాంట్ రక్షణపై తీర్మానం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, సొంత గనులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర సీఐటీయూ మహాసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ప్రధాన కార్యదర్శి జె.అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. కేంద్రం అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని, కార్మికులపై లేబర్ కోడ్స్ ప్రయోగిస్తోందని మండిపడ్డారు.

April 19, 2026 / 02:22 PM IST

‘సాహసానికి ప్రతీక సర్దార్ గౌతు లచ్చన్న’

కృష్ణా: సాహసానికి ప్రతీక సర్దార్ గౌతు లచ్చన్న అని అవనిగడ్డ టీడీపీ మండల అధ్యక్షుడు మోర్ల రాంబాబు అన్నారు. ఆదివారం చల్లపల్లిలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి గౌతు లచ్చన్న 20వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో షేక్ నబీఘోరీ, తాతా ప్రదీప్, మోర్ల ప్రసాద్, బీసీ నాయకులు పాల్గొన్నారు.

April 19, 2026 / 02:20 PM IST

బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్రకాశం: హనుమంతలపాడు మండలం నాగిరెడ్డిపాలెం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుగ్గెంపూడి అంకిరెడ్డి తన మోటార్ సైకిల్‌పై నాగిరెడ్డి పాలెం సమీపంలో తోట వద్దకు వెళుతుండగా వెలుగండ్ల మండలం మరుపుకుంట్ల మలుపు వద్ద ఓ కారు బైక్‌ను ఢీకొట్టడంతో అంకిరెడ్డికి ఎడమ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితున్ని 108లో కనిగిరి వైద్యశాలకు తరలించారు.

April 19, 2026 / 02:20 PM IST

నరసాపురం ఎమ్మెల్యేని కలిసిన డీఎస్పీ

WG: నరసాపురంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను డీఎస్పీ ఎం. సుధాకర్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఎమ్మెల్యేకు పూలమొక్కను అందజేశారు. అనంతరం నియోజకవర్గంలోని శాంతిభద్రతల పరిస్థితులపై వారు చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా విధులు నిర్వహించాలని సూచించారు.

April 19, 2026 / 02:20 PM IST