ప్రకాశం: హనుమంతలపాడు మండలం నాగిరెడ్డిపాలెం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుగ్గెంపూడి అంకిరెడ్డి తన మోటార్ సైకిల్‌పై నాగిరెడ్డి పాలెం సమీపంలో తోట వద్దకు వెళుతుండగా వెలుగండ్ల మండలం మరుపుకుంట్ల మలుపు వద్ద ఓ కారు బైక్‌ను ఢీకొట్టడంతో అంకిరెడ్డికి ఎడమ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితున్ని 108లో కనిగిరి వైద్యశాలకు తరలించారు.