కోనసీమ: కొత్తపేటలో మండల శెట్టిబలిజ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి ఆదివారం ఆర్.ఎస్ బీసీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 1909లో జన్మించి 98 సంవత్సరాల పాటు బడుగు వర్గాల కోసం నిరంతరం పోరాడిన లచ్చన్న నిజమైన ప్రజానాయకుడని కొనియాడారు.