• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నిడదవోలు – హైదరాబాద్‌కు 2 కొత్త బస్సు సర్వీసులు..!

E.G: నిడదవోలు నుంచి హైదరాబాద్‌కు బుధవారం 2 ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు డిపో మేనేజర్ ధనుంజయ రావు తెలిపారు. చౌటుప్పల్ వద్ద డిపో బస్సు ప్రమాదానికి గురవడంతో ఆ సర్వీసును నిలిపివేసి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వెంటనే ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

March 4, 2026 / 02:20 PM IST

ఆర్డీటీ సేవలకు ఇబ్బంది లేదు: మాంచో ఫెర్రర్

ATP: జిల్లాలో ఆర్డీటీ సేవలకు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదని ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ స్పష్టం చేశారు. ఎఫ్సీఆర్ఏ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్న దివ్యాంగ సంఘాల నాయకులతో బత్తలపల్లి ఆసుపత్రిలో ఆయన చర్చించారు. వైద్య సేవలు, విద్యా సౌకర్యాలపై భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రెండు మూడు నెలల వరకు సేవలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని వివరించారు.

March 4, 2026 / 02:20 PM IST

రేపటి నుంచి గ్రామాల్లో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమం

PLD: జిల్లాలోని  మార్చి 5న ప్రతి గ్రామంలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కనీసం 200 మందితో గ్రామ సభలు నిర్వహించి, గ్రామంలోని ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

March 4, 2026 / 02:16 PM IST

ఈనెల 6న మెగా రక్తదాన శిబిరం

SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 6న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు మెడికవర్ సెంటర్ హెడ్ డాక్టర్ పి.సాగరిక తెలిపారు. నగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో బుధవారం గైనకాలజిస్ట్ డాక్టర్ బలగ రజిని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో మహిళలకు ఆరోగ్య సంబంధిత వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయన్నారు.

March 4, 2026 / 02:16 PM IST

స్వీయ రక్షణ పై విద్యార్థులకు శిక్షణ

AKP: నాతవరం మండలం డీ.యర్రవరం పాఠశాలలో మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్. రేవతమ్మ, ఎస్ఐ వై. తారకేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థినీలకు స్వీయరక్షణపై అవగాహన కల్పించారు. ప్రాథమిక రక్షణ పద్ధతులు నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి ప్రమాద పరిస్థితుల్లో ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందని సీఐ తెలిపారు.

March 4, 2026 / 02:13 PM IST

CMRF చెక్కును అందజేసిన KUDA ఛైర్మన్

అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం మార్గోపల్లి పంచాయతీ గుడ్లవారిపల్లికి చెందిన గోపిశెట్టి శంకరయ్యకు CMRF ద్వారా మంజూరైన రూ.41,324 చెక్కును టీడీపీ ఇంఛార్జ్, KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి వారి నివాసంలో అందజేశారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

March 4, 2026 / 02:09 PM IST

ఈ- పంట నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

ELR: పెదవేగి(మం) దుగ్గిరాలలో వరిపంట పొలాల్లో బుధవారం ఈ-పంట సూపర్ వైజర్ చెక్ రికార్డులను కలెక్టరు కే. వెట్రిసెల్వి బుధవారం తనిఖీలు చేశారు. అధికారులు, సిబ్బంది రైతులకు సంబంధించిన ప్రతి ఎకరాను పంట వివరాలు నమోదు ప్రక్రియ అత్యంత ముఖ్యమని చెప్పుకొచ్చారు. తక్కువ నీటి వినియోగంతో అధిక లాభదాయకత కలిగిన పంటలుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

March 4, 2026 / 02:04 PM IST

మాజేరులో మినుముల కొనుగోలు కేంద్రం ప్రారంభం

కృష్ణా: చల్లపల్లి మండలం కొత్తమాజేరులో రైతు సేవా కేంద్రంలో మినుములు, పెసల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మార్క్ ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, మార్క్ ఫెడ్ డీఎం మురళీ కిషోర్ ప్రారంభించారు. ఏఎంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, వైస్ ఎంపీపీ రాంబాబు పాల్గొన్నారు.

March 4, 2026 / 02:00 PM IST

కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీ: అనంత

ATP: ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలా మారిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురంలో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని చంద్రబాబు తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీల అమలును ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

March 4, 2026 / 02:00 PM IST

గుంతలమయంగా రహదారి.. గ్రామస్థుల ఆందోళన

KKD: వలసపాకలి గ్రామంలో ప్రధాన రహదారి దెబ్బతినడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల గుంతలు ఏర్పడి వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల రాకపోకలు కష్టంగా మారాయి. విద్యార్థులు, రైతులు, వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మరమ్మతు చేసి సురక్షితంగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

March 4, 2026 / 02:00 PM IST

టపాసుల గోడౌన్లలో ఆర్డీవో తనిఖీలు

నెల్లూరులోని పొర్లు కట్ట సమీపంలోని టపాసుల తయారీ గోడౌన్లలో ఆర్డీవో అనూష తనిఖీలు నిర్వహించారు. టపాసుల తయారీకి అనుమతులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా టపాసులు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంతపేట పోలీసులు పాల్గొన్నారు. స్టాక్ పాయింట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె వివరించారు.

March 4, 2026 / 02:00 PM IST

జంపాపురంలో సుంకలమ్మ అవ్వ దేవర ఉత్సవాలు

KRNL: కోసిగి మండల పరిధిలోని జంపాపురం గ్రామంలో శ్రీ సుంకలమ్మ అవ్వ దేవర ఉత్సవాలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారికి నైవేద్యం, అకుపూజ, కుంకుమార్చన, పంచామృత అభిషేకం నిర్వహించారు. సుంకులమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వైసీపీ జిల్లా కార్యదర్శి పీ. మురళీ మోహన్ రెడ్డి, ఎంపీపీ ఈరన్న, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

March 4, 2026 / 01:47 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారికి ఆర్థిక సహాయం

అన్నమయ్య: చిట్వేల్ మండలం మార్గోపల్లి పంచాయతీ గుడ్లవారిపల్లికి గ్రామానికి చెందిన పెనగలూరు లక్ష్మీదేవి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 20,524/-విలువైన చెక్కును వారి నివాసం వద్ద రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ ఛార్జ్ KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు అందజేశారు.

March 4, 2026 / 01:45 PM IST

రీజనల్ కో-ఆర్డినేటర్‌గా బూడి ముత్యాలనాయుడు

పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు YCP రీజనల్ కో-ఆర్డినేటర్‌గా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు YS.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.

March 4, 2026 / 01:44 PM IST

శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం

NDL: శక్తి యాప్ ఉండటం వల్ల మహిళలు, బాలికలకు మెరుగైన రక్షణ లభిస్తుందని శక్తి టీం సభ్యులు తెలిపారు. గోస్పాడు(మం) దీబగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు యాప్‌పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేయించారు.

March 4, 2026 / 01:41 PM IST