PPM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని చంద్ర గ్రహణం సందర్బంగా మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాస్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 6గంటలకు నిత్య పూజల్లో భాగంగా అమ్మవారికి భోగం నివేదించి, ఆలయం తలుపులు మూసి వేయడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. బుధవారం ఉదయం పోలమాంబ అమ్మవారి దర్శనం పునః ప్రారంభం జరుగుతుందన్నారు.
VZM: మెరకముడిదాం మండలం సిరియాలపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణం కోసం విరాళంగా రూ.10,5000, 2 బియ్యం బస్తాలు వైసీపీ జిల్లా బూత్ కన్వీనర్ అధ్యక్షులు బూర్లె నరేష్ కుమార్ ఆదివారం అందించారు. ఈ నెల 6, 7, 8వ తేదీలో రామాలయం ప్రతిష్ట జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈమేరకు గ్రామ ప్రజలు, యువత హర్షం వ్యక్తపరిచారు.
SKLM: పలాసలో గోపీచంద్ రోలర్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక పెరుగుదల, ఏకగ్రత శక్తి పెరుగుతుందని అన్నారు.
VSP: ఎండలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో విశాఖ కింగ్‌జార్జ్ ఆస్పత్రిలో తాగునీటి సమస్య ఉధృతమైంది. రోజూ వేలాది మంది రోగులు, సహాయకులు వచ్చే ఈ ఆస్పత్రిలో తాగడానికి నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు విభాగాల్లో వాటర్ ప్లాంట్లు పనిచేయకపోవడంతో బయట దుకాణాల్లో అధిక ధరలకు నీటి బాటిళ్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ATP: నగరంలో మాంసం విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన ఏపీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు విక్రేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించిన పలు దుకాణాలకు జరిమానాలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ కుళ్ళిన మాంసం లేదా చనిపోయిన కోళ్లను విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
E.G: సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో దర్శిపాటి నాని, ఏడిద సంపత్ కుమార్, గంపల మంగ, గంపల నాగరాజు, మందపల్లి చిన్ని, గొడత మహేష్, గొడత వీరవెంకట రమణ, కడింపల్లి ధనరాజు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించి రూ.20 లక్షల చెక్కును అందజేశారు.
KDP: లింగాల మండలంలోని బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోత పథకం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఆదివారం రైతులు ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ తెప్పించినా, కనెక్షన్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రైతుల విషయంలో రాజకీయాలకు తావులేకుండా అధికారులు వ్యవహరించాలన్నారు. విద్యుత్ అధికారులు కనెక్షన్ ఇవ్వకపోతే ధర్నా చేస్తామన్నారు.
NDL: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన CMRF చెక్కులు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పంపిణీ చేశారు. జూపాడు బంగ్లా మండలం, మండ్లెం గ్రామానికి చెందిన షేక్ ఫరీదాబికి రూ.79,670 విలువైన చెక్కు ఎమ్మెల్యే ఆదివారం అందజేశారు. ఈ మేరకు CM మంద్రబాబు, MLAకు ఫరీదా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ELR: ప్రమాదాల నివారణే లక్ష్యంగా గుండు గొలనులో బాణాసంచా నిల్వ కేంద్రాలపై పోలీసులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గుండు గొలను గ్రామంలోని హోల్‌సేల్ టపాకాయల దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. భీమడోలు సీఐ విల్సన్ నేతృత్వంలో రెవిన్యూ, అగ్నిమాపక సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు. అనుమతించబడిన పరిమితికి మించి బాణాసంచాను నిల్వ చేయకూడదన్నారు.
ప్రకాశం: బెస్తవారిపేటలోని పలు కిరాణా దుకాణాలను సీఐ మల్లికార్జున ఆదివారం పరిశీలించారు. గతంలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయాలు నిర్వహించిన దుకాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా సంబంధిత దుకాణాల యజమానులకు చట్టపరమైన నిబంధనలు వివరించి, అనుమతులు లేకుండా విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంలోని పలకలూరు చైతన్య స్కూల్స్‌లో ఆదివారం K.SAT లెవెల్-2 ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయన మాట్లాడుతూ.. శాస్త్రీయ దృక్పథం, పోటీ భావనకు ఇలాంటి పరీక్షలు అవసరమన్నారు.
NDL: బేతంచర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో రౌడీషీటర్లు ఘర్షణలు, అల్లర్లకుకు పాల్పడితే శాఖపరమైన కఠిన చర్యలు తప్పవని CI వెంకటేశ్వరావు హెచ్చరించారు. బేతంచర్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సమాజంలో ప్రజాశాంతికి భంగం కలిగినా, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా గ్రామ బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.
ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు హనుమంతరాయ చౌదరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అనంతపురంలోని సవేరా ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. హనుమంతరాయ చౌదరి ఆరోగ్య స్థితిగతులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
NDL: కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర ఆలయం శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గుముఖం పట్టడంతో గర్భాలయ శిఖరాగ్రం దర్శనమిస్తోంది. దాదాపు 8 నెలలుగా నీటిలో మునిగి ఉన్న ఈ ఆలయం, 837 అడుగుల నీటిమట్టానికి చేరితే పూర్తిగా బయటకు వస్తుందని అర్చకులు తెలిపారు. కాగా, ప్రస్తుతం రోజుకు సుమారు ఒక అడుగు మేర నీటిమట్టం తగ్గుతోంది.
VSP: విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలోని 150 ఏళ్ల నాటి మర్రి చెట్టు వద్ద గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ రాఘవేంద్రరావు కార్యక్రమాన్ని ప్రారంభించి పిచ్చుకలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రసాయన క్రిమిసంహారకాల వినియోగం, కాంక్రీట్ భవనాల పెరుగుదలతో పిచ్చుకలు అంతరించిపోతున్నాయన్నారు.