• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నూతన బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: ప్రయాణికుల సౌకర్యార్థం వేపాడ నుంచి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నూతన బస్సు సర్వీస్‌ను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ముఖ్యఅతిథిగా హాజరై ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం విశాఖ నగరానికి రాకపోకలు సాగించే ఉద్యోగులు, రోగుల కష్టాలు తీర్చేందుకు ఈ బస్సు ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

March 1, 2026 / 04:14 PM IST

‘గర్భకోశ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి’

SKLM: బూర్జ మండలం ఓవీపేటలో వికాస తరంగణి-ఆరోగ్య వికాస్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వైస్ ఎంపీపీ సూర్యారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు గర్భకోశ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని గర్భకోశ వ్యాధులు గుర్తించడానికి ఉచితంగా పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు.

March 1, 2026 / 04:13 PM IST

ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

E.G: నల్లజర్ల మండలం అయ్యవరంలో వాటర్ ప్లాంట్‌ను MLA మద్దిపాటి వెంకటరాజు ఆదివారం ప్రారంభించారు. ద్వారక తిరుమల వెళ్లే భక్తుల దాహం తీర్చేందుకు నల్లజర్ల సొసైటీ డైరెక్టర్ గుడిసె శివకృష్ణ సొంత నిధులతో దీనిని ఏర్పాటు చేశారు. 365 రోజులు సేవలందించే ఈ ప్లాంట్, ఈ వేసవిలో నడిచి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కొనియాడారు.

March 1, 2026 / 04:13 PM IST

పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిల్ ర్యాలీ

ATP: గుత్తి ఎస్సై అమీర్ ఖాన్ ఆధ్వర్యంలో పోలీసులు, విద్యార్థినులు ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ చేసినట్లు ఎస్సై అమీర్ ఖాన్ చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

March 1, 2026 / 04:12 PM IST

రామచంద్రపురం సబ్ డివిజనల్ పరిధిలో సెక్షన్-30 అమలు

కోనసీమ: రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో మార్చి 31 వరకు సెక్షన్-30 అమలులో ఉంటుందని ఇంఛార్జ్ డీఎస్పీ టీఎస్ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రామచంద్రపురం, ద్రాక్షారామం, పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఆయన హెచ్చరించారు. ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు.

March 1, 2026 / 04:10 PM IST

రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం

NLR: నెల్లూరు కలెక్టరేట్‌లో రేపు యథావిధిగా PGRS కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

March 1, 2026 / 04:10 PM IST

తెలుగు భాష తెలుగు వారి ఆత్మ గౌరవం: గవర్నర్

కోనసీమ: సుదీర్ఘ చరిత్రను, మహోన్నత సాహిత్య సంపదను, అద్భుతమైన సాంస్కృతిక వైభవాన్ని కలిగిన తెలుగు భాష తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకని, దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో రెండవ రోజు గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

March 1, 2026 / 04:09 PM IST

శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న త్రిపుర సీఎం

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి త్రిపుర సీఎం మనీష్ షా కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని దర్శనం అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 04:09 PM IST

కళ్యాణదుర్గం వద్ద ఘోర ప్రమాదం

ATP: కళ్యాణదుర్గం సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 04:05 PM IST

పామూరు మండల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: పామూరు మండల సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీపీ గంగసాని లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలో మౌలిక సమస్యలపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో ఛైర్మన్ ఉప్పలపాటి హరిబాబు మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులకు పిలుపునిచ్చారు.

March 1, 2026 / 04:05 PM IST

జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదు

ELR: జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పాలసీ కొండంత అండగా నిలుస్తుందని డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం బయ్యనగూడెంలో నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.లక్ష బీమా వర్తిస్తుందని తెలిపారు.

March 1, 2026 / 04:03 PM IST

‘సీమకు తీరని నష్టం జరుగుతోంది’

CTR: కడపలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాయలసీమ లిఫ్ట్ పూర్తి కోసం- భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు రాయలసీమకు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. చంద్రబాబు చర్యల వల్ల సీమకు తీరని నష్టం జరుగుతోందని ఆరోపించారు.

March 1, 2026 / 04:02 PM IST

ఇంటి పన్నుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

AKP: ఎస్ రాయవరం మండలంలో రూ.2,54,99,134 వసూళ్లు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,26,46,557 వసూళ్లు చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆదివారం తెలిపారు. దార్లపూడి, చినగుమ్ములూరు, తిమ్మాపురం, కొరుప్రోలు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రజలు చెల్లించే ఇంటి పన్నులు ద్వారా కనీస సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు.

March 1, 2026 / 04:01 PM IST

శంకుస్థాపనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

GNTR: తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపాడు శివారులో పిచ్చుకులపాలెం వద్ద జరగనున్న ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ భవన నిర్మాణ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటారు.

March 1, 2026 / 04:00 PM IST

శంకుస్థాపనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

GNTR: తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపాడు శివారులో పిచ్చుకులపాలెం వద్ద జరగనున్న ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ భవన నిర్మాణ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటారు.

March 1, 2026 / 04:00 PM IST