NTR: గంపలగూడెం మండలం నెమలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంఈవో నరసింహారావు సోమవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లు, తదితర రికార్డులు పరిశీలించారు. తదనంతరం 10వ తరగతి విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ.. పక్క ప్రణాళికతో చక్కగా చదువుకుంటూ, పబ్లిక్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
E.G: నల్లజర్ల మండలం సుభద్రపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం రౌండ్ సోషల్ ఆడిట్ గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ MPDO కె.రాంబాబు, ఉపాధి హామీ ఏపీవో త్రిమూర్తులు, TNSF మండల అధ్యక్షులు గండ్రకోటి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. వికసిత భారత్ జి-రామ్-జి ఉపాధి హామీ పథకం 125 రోజులకు పొడిగించడం జరిగిందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రకాశం: సీఎం చంద్రబాబు పాలనలోనే అంగన్వాడీ కార్యకర్తలకు రెట్టింపు గౌరవం, ఆర్థిక భద్రత లభించిందని మంత్రి స్వామి అన్నారు. చరిత్రలో తొలిసారి రెండు సార్లు అంగన్వాడీ వేతనాలను పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో అంగన్వాడీలకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదని విమర్శించారు. అంగన్వాడీ టీచర్లపై పనిభారాన్ని తగ్గించే యాప్లను కుదించినట్లు తెలిపారు.
ELR: ముదినేపల్లి మండలం సింగరాయపాలెం చేవూరు పాలెం సెంటర్లోని వేంచేసి ఉన్న శ్రీ వల్లే దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంగళవారం మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి శ్రీ స్వామివారి దర్శనాన్ని నిలిపివేసి తిరిగి బుధవారం 8 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు.
KRNL: వెల్దుర్తిలో AITUC ఆధ్వర్యంలో, ఏపీఅంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మహా ధర్నాకు బయలుదేరుతున్న కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. నాయకులు నాగమద్దయ్య మాట్లాడుతూ, శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడి కార్యకర్తలను పోలీసులు నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.
AKP: అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సమస్యలపై అర్జీలను తీసుకొని వాటిని పరిశీలించి అర్జీదారులతో మాట్లాడుతున్నారు. ప్రజల సమర్పించిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.
అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ప్రభుత్వ సహకారంతో 50 మందికి పైగా మూగ, బధిర చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రపంచ శ్రవణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ చిన్నారులకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. ఖరీదైన ఈ సర్జరీలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
NLR: అల్లూరు మండలం పురిణి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ ఛైర్మన్ మర్రిబోయిన సురేంద్ర ప్రారంభించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ-పంట నమోదు చేసుకుని, ఈకేవైసీ పూర్తయిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చని సూచించారు.
కోనసీమ: 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఉంటేనే కాలేజీలోకి అనుమతించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సోమవారం సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో 60% మంది యువతే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు బైక్ ఇచ్చే విషయంలో కఠినంగా ఉండాలన్నారు. కాలేజీలు ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ విధానాన్ని అమలు చేయాలన్నారు.
E.G: రాజమండ్రిలోని బర్మా కాలనీ వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పుష్కరాల రేవు వద్ద సూలాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు.
అన్నమయ్య: రాయలసీమ హక్కుల పేరిట వైసీపీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయ డ్రామా మాత్రమేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. జగన్ హయాంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై భారీగా నిధులు ఖర్చు చేసిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో అభివృద్ధి వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
TPT: తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, రోజ్ మాండ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
BPT: ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి అండగా ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. సోమవారం బాపట్లలో 43 మంది లబ్ధిదారులకు రూ.20,73,963 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యమన్నారు.
KKD: తొండంగి మండలం వలసపాకల గ్రామంలో రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పొలాల్లో తగినంత తేమ ఏర్పడింది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతులు మార్కెట్లకు వెళుతున్నారు. అయితే ఎరువుల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ సరఫరా సక్రమంగా అందించాలని రైతులు కోరుతున్నారు.
ELR: జంగారెడ్డిగూడెంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ యూట్యూబర్‌గా చలామణి అవుతూ, సహాయం కోసం వచ్చిన యువతిపై అత్యాచారం చేశాడని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీసులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.