• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైతు మృతి.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా డిమాండ్

ASR: డుంబ్రిగూడ మండలం పిత్తగూడ గ్రామానికి చెందిన కీల్లో బలరాం (47) విద్యుత్ ఘాతుకానికి గురై మృతి చెందిన ఘటనపై ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ ఇవాళ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. బలరాం మరణంతో వారి కుటుంబం ఆర్థికంగా దిక్కుతోచని స్థితిలో ఉందని తెలిపారు.

March 17, 2026 / 12:55 PM IST

‘TTD ఛైర్మన్ పదవి నుండి బి.ఆర్ నాయుడుని తొలగించాలి’

PPM: తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన సమయం ఇది, వెంటనే బి.ఆర్.నాయుడిని టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలి అని వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు, మాజీ MLA అలజంగి జోగారావు అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాయుడు అడ్డంగా వీడియో, ఫొటోలతో దొరికిపోయినా నిస్సిగ్గుగా మళ్లీ తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామి క్షేత్రాన్ని ఆపవిత్రం చేస్తున్నాడని మాజీ MLA అన్నారు.

March 17, 2026 / 12:54 PM IST

కొలిమిగుండ్ల ఎస్సైగా షేక్ నగీన బాధ్యతలు

NDL: కొలిమిగుండ్ల నూతన ఎస్సైగా షేక్ నగీన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన గోపాల్ శిక్షణ నిమిత్తం బదిలీ కావడంతో, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆమెను నియమించారు. సీఐ రమేశ్ బాబు సమక్షంలో బాధ్యతలు చేపట్టిన నగీన, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

March 17, 2026 / 12:46 PM IST

నమాజ్‌కు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ

VSP: మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి, 63వ వార్డు క్రాంతి నగర్‌లో చోరీ చోటుచేసుకుంది. బాధితురాలు ముంతాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. సమీపాన ఉన్న మసీదుకు ఇవాళ వేకువజామున ఒంటి గంటన్నర సమయంలో నమాజ్ నిమిత్తం వెళ్లానని, తిరిగి రెండున్నర సమయంలో వచ్చేసరికి బీరువాలో పది తులాల ఆభరణాలు, రూ.25 వేల నగదు, వెండి చోరీ జరిగాయని బాధితురాలు వాపోయారు.

March 17, 2026 / 12:45 PM IST

మధ్యాహ్న భోజనం అమలును పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను మంగళవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించారు. హైస్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యత స్వయంగా పరిశీలించారు. ఆహారం నాణ్యత ఎలా ఉంటోంది? అని ఎమ్మెల్యే విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

March 17, 2026 / 12:45 PM IST

మధ్యాహ్న భోజనం అమలును పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను మంగళవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించారు. హైస్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యత స్వయంగా పరిశీలించారు. ఆహారం నాణ్యత ఎలా ఉంటోంది? అని ఎమ్మెల్యే విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

March 17, 2026 / 12:45 PM IST

‘మధ్యాహ్నం భోజనం నాణ్యతయుతంగా ఉంది’

BPT: చీరాల NRPM బాయ్స్ హైస్కూల్‌లో మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును ఎమ్మెల్యే కొండయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అలాగే, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం మెనూ రుచికరంగా, నాణ్యతయుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హెచ్ఎం సాల్మన్ రాజు, టీచర్లను ఎమ్మెల్యే కొండయ్య అభినందించారు.

March 17, 2026 / 12:44 PM IST

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ

ప్రకాశం: ఒంగోలులోని 7వ డివిజన్లో రూ.75 లక్షలతో సీసీ రోడ్లు, 8వ డివిజన్లో రూ.13 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడను ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు.

March 17, 2026 / 12:41 PM IST

ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం మంత్రి స్వామి తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పలు ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు భారీగా మంత్రి కార్యాలయానికి అర్జీదారులు చేరుకున్నారు. ఆయన వారి సమస్యలను సావధానంగా విని అర్జీల రూపంలో ఇచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.

March 17, 2026 / 12:37 PM IST

ధర్మవరం వాసవి కలెక్షన్స్‌లో మహిళల చోరీ

సత్యసాయి: ధర్మవరంలోని వాసవి కలెక్షన్స్‌లో చోరీ జరిగింది. దుకాణంలోకి ప్రవేశించిన కొందరు మహిళలు రూ.18 వేల విలువైన వస్తువులను అపహరించారు. యజమాని అనుమానంతో సీసీ కెమెరాలు పరిశీలించగా మహిళలే ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. బాధితుడు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

March 17, 2026 / 12:37 PM IST

రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సు

ప్రకాశం: రహదారులపై ఆటోలు నడిపేవారు ఆర్టీవో నిబంధనలను పాటించాలని సింగరాయకొండ సీఐ హజరత్తయ్య అన్నారు. మంగళవారం ఆటో డ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, ఆటో నడిపేవారు యూనిఫామ్ కచ్చితంగా ధరించాలి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని సూచించారు.

March 17, 2026 / 12:30 PM IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

AKP: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ మునగపాకలో ‘రైతన్న మీ కోసం’ వారోత్సవాల్లో పాల్గొన్నారు. పంటల సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుంటారన్నారు.

March 17, 2026 / 12:29 PM IST

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు: MEO

VZM: వంగర మండలంలోని పాఠశాలలో ఒంటిపూట బడుల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎంఈవో గణేశ్ నాయుడు తెలిపారు. ఇవాళ ఎంఆర్‌సీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతాయన్నారు.

March 17, 2026 / 12:29 PM IST

పాఠశాలలో విద్యార్థులతో భోజనం చేసిన ఎమ్మెల్యే

SKLM: కాశీబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కూర్చొని మధ్యాహ్నం భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని అందుతుందో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

March 17, 2026 / 12:24 PM IST

ఏప్రిల్ 2 నుంచి పంచాయతీలకు అధికారుల పాలన

ప్రకాశం: సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుందని డీపీవో వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 27 మండలాల్లో 519 పంచాయతీలు ఉండగా, మార్కాపురం జిల్లాలో 21 మండలాల్లో 405 పంచాయతీలకు ఈ అధికారులను నియమించినట్లు ఆయన వెల్లడించారు.

March 17, 2026 / 12:24 PM IST