• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘బీఆర్ నాయుడు పదవికి రాజీనామా చేయాలి’

సత్యసాయి: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కదిరిలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త బీయస్.మక్బుల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకుల అక్రమ అరెస్టులను ఖండించారు.

March 17, 2026 / 04:41 PM IST

రైతన్నల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే

KDP: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి పాల్గొని పశువులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. పాడి రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు, టీడీపీ నాయకులు హాజరయ్యారు. పశువుల ఆరోగ్య సంరక్షణతో రైతుల ఆదాయం పెరుగుతుందని ఆమె తెలిపారు.

March 17, 2026 / 04:40 PM IST

టీటీడీ ఛైర్మన్ రాజీనామా చేయాలి: కాటసాని

KRNL: తిరుపతిలో మహిళలపై జరిగిన దాడిని నిరసిస్తూ నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులో నిరసన చేపట్టారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటోందని, ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

March 17, 2026 / 04:40 PM IST

భవిత కేంద్రాన్ని పరిశీలించిన అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్

NLR: బుచ్చిరెడ్డిపాలెం(మం) ప్రత్యేక అవసరాల గల పిల్లల భవిత కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకులు అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. పిల్లల సామర్థ్యాలపై ఆరా తీశారు. ప్రత్యేక విద్య, ఫిజియోథెరపీ సేవలకు ఉపయోగించే ఉపకరణాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న భవిత కేంద్రాన్ని సందర్శించారు.

March 17, 2026 / 04:39 PM IST

సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

SKLM: పాతపట్నం మండలం కాగువాడ మహాత్మా జ్యోతిబాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న మెనూ, విద్య, వసతిపై ఆరా తీశారు. సిబ్బంది మెనూలో పెరుగుకు బదులుగా మజ్జిగ పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు అడిగినంత భోజనం వడ్డించాలని సూచించారు.

March 17, 2026 / 04:36 PM IST

చింతలగరువు పాఠశాలలో రాయప్రోలు సుబ్బారావు జయంతి

W.G: పోడూరు మండలం చింతలగరువు పాఠశాలలో రాయప్రోలు సుబ్బారావు జయంతిని హెచ్.ఎం కొల్లాబత్తుల సూర్య కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సుబ్బారావు నవ్యకవితా పితామహుడుగా పేరు గాంచారు అన్నారు. ఈ సందర్బంగా రాయప్రోలు సుబ్బారావు రచించిన ‘ఏ దేశమేగినా’ అభినయ గేయాన్ని విద్యార్థులు ప్రదర్శించి నివాళులర్పించారు.

March 17, 2026 / 04:34 PM IST

ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: అయినవిల్లి(మం) వీరవల్లిపాలెం చివర కోటిపల్లి రేవు వద్ద అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదన్నారు. రైతుల జీవనోపాధికి పశువుల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు.

March 17, 2026 / 04:30 PM IST

రేపల్లెలో తాగునీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం

బాపట్ల జిల్లా రేపల్లె మండలం చెన్నుపల్లివారిపాలెంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పైప్‌లైన్ పనులను టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 04:26 PM IST

‘ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి’

ASR: ప్రమాదాలకు గురవుతున్న కాఫీ, మిరియాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని జాతీయ కాఫీ రైతు సంఘం నాయకులు జి చినబాబు డిమాండ్ చేశారు. మంగళవారం అరకులోయలో ఆయన మాట్లాడుతూ.. మిరియాల కోతకు తీసుకువెళ్తూన్న నిచ్చెనకు విద్యుత్ వైర్లు తగలడంతో మృతి చెందిన కిల్లో బలరాం(49) కుంటుంబానికి 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.

March 17, 2026 / 04:23 PM IST

అనంతపురం అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

అనంతపురం నగర అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ కుమార్ నుంచి అన్ని శాఖల అధికారులతో కలిసి పెండింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలో చేపట్టవలసిన మౌలిక సదుపాయాల కల్పన, సుందరీకరణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు.

March 17, 2026 / 04:23 PM IST

బొమ్మూరులో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం

E.G: రాజమండ్రి రూరల్(మం) బొమ్మూరులోని వైసీపీ కార్యాలయం వద్ద జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వజ్ర భాస్కర్ రెడ్డి విచ్చేశారు. ఈ మేరకు డిజిటలైజేషన్ ప్రక్రియ గురించి, దాని విధి విధానాలు పూర్తి వివరించారు.

March 17, 2026 / 04:21 PM IST

చిన్నతుంబళంలో ఉచిత కంటి వైద్య శిబిరం

KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం సొసైటీ ఆవరణలో మంగళవారం మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు కంటి ఆసుపత్రి వైద్యులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ నరసప్ప, సీఈవో నరసింహమూర్తి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు అనూష రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు.

March 17, 2026 / 04:20 PM IST

కడప డీఆర్వో బదిలీ

KDP: రాష్ట్ర ప్రభుత్వం డీఆర్వోలను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప డీఆర్వోగా ఉన్న విశ్వేశ్వర నాయుడు విశాఖపట్నంకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు రానున్నారు. అలాగే ప్రభుత్వం ఆర్డీవోలను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప ఆర్డీవోగా మురళి రానున్నారు.

March 17, 2026 / 04:20 PM IST

‘పశు పోషణ కూడా వ్యవసాయమే’

ASR: పాడేరు మండలం సుకూరుపుట్టు, డి.గొందూరు గ్రామాల్లో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశు సంరక్షణ వ్యవసాయానికి అనుబంధమైందని, పశుసంపద రైతుకు ముఖ్య ఆధారమని తెలిపారు.

March 17, 2026 / 04:15 PM IST

నందిగామలో పోలీసుల ప్రత్యేక డ్రైవ్

NTR: నందిగామలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, త్రిబుల్ రైడింగ్ చేస్తూ అధిక వేగంతో వెళ్తున్న విద్యార్థులను ఆపి ట్రాఫిక్ ఎస్సై నరేష్ కౌన్సెలింగ్ ఇచ్చారు. పరీక్షల అనంతరం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. తల్లిదండ్రుల కష్టం గుర్తుంచుకుని బాధ్యతగా ఉండాలని సూచించారు.

March 17, 2026 / 04:12 PM IST