• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమీన్ పీర్ దర్గాలో మొక్కులు తీర్చుకున్న ఛైర్‌పర్సన్

ATP: కడపలోని పవిత్ర అమీన్ పీర్ దర్గాను అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి సందర్శించారు. మంగళవారం దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గతంలో తాను కోరుకున్న మొక్కుబడి నెరవేరిన సందర్భంగా సంప్రదాయం ప్రకారం భక్తులకు చక్కెర పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కడప దర్గా విశిష్టతను కొనియాడారు.

March 17, 2026 / 01:03 PM IST

మంత్రితో చింతలపూడి ఎమ్మెల్యే భేటీ

ELR: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు జిల్లా మంత్రులతో, ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం నిర్వహించనున్నారని అన్నారు.

నేటితో ముగిసిన కౌన్సిలర్ల పదవీకాలం

ప్రకాశం: మార్కాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్ల 5 ఏళ్ల పదవి కాలం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిని వారు కలిసి సన్మానించారు. కౌన్సిలర్లుగా తమకు అవకాశం కల్పించినందుకు కొండారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్లు షేక్ ఇస్మాయిల్, చాతరాజుపల్లి అంజమ్మ శ్రీనివాసులు, ఇతర కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు ఉన్నారు.

March 17, 2026 / 01:02 PM IST

‘శెనగ రైతులకు ఇవ్వాల్సింది కొండంత.. ఇచ్చింది గోరంత’

KDP: జిల్లాలో బుడ్డ శెనగల రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సింది కొండంత, ఇప్పటివరకు ఇచ్చింది గోరంత అని కాంగ్రెస్ తులసి రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. గత ఫిబ్రవరి నెల 19వ తేదీ జిల్లాలో 21 బుడ్డ శెనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. క్వింటాలుకు రూ. 5,875 చొప్పున మార్క్ ఫెడ్ ద్వారా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారన్నారు.

March 17, 2026 / 01:02 PM IST

తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టండి : చైర్మన్

CTR: వేసవి సమీపిస్తున్న దృశ్య పట్టణంలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష అధికారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పుంగనూరు పురపాలక పాలకవర్గ చివరి సమావేశం జరిగింది. అజెండాలోని తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇంతకాలం తమ పాలక వర్గానికి సహకారం అధికారులకు ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.

March 17, 2026 / 01:02 PM IST

తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టండి: ఛైర్మన్

CTR: వేసవి సమీపిస్తున్న దృశ్య పట్టణంలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష అధికారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పుంగనూరు పురపాలక పాలకవర్గ చివరి సమావేశం జరిగింది. అజెండాలోని తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇంతకాలం తమ పాలక వర్గానికి సహకారం అధికారులకు ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.

March 17, 2026 / 01:02 PM IST

‘పన్నుల చెల్లింపులో 50% వడ్డీ రాయితీ’

ATP: గుత్తి మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మంగళవారం మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. 2024-2025 సంవత్సరానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ ఇస్తామని కమిషనర్ పేర్కొన్నారు. పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు.

March 17, 2026 / 01:01 PM IST

నీలకంఠాపురంలో శ్రీరామనవమి వేడుకల పోస్టర్ల విడుదల

సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురంలో ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ రఘువీరారెడ్డి మంగళవారం ఈ ఉత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. 28న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సామూహిక వివాహాలు జరగనున్నాయి. కల్యాణం కోసం వినియోగించే తలంబ్రాల తయారీకి రఘువీరారెడ్డి గ్రామస్థులకు వడ్లను పంపిణీ చేశారు.

March 17, 2026 / 01:00 PM IST

ఈలప్రోలులో ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణానికి శంకుస్థాపన

NTR: పల్లెల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణంతో వైద్యసేవలు అందుబాటులోకి తేవడంతో పాటు ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో రూ.36 లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.

March 17, 2026 / 12:58 PM IST

సర్వేయర్ల సంఘ అధ్యక్షులుగా శ్రీనివాసులు

CTR: అన్నమయ్య జిల్లా సర్వేయర్ల సంఘ అధ్యక్షులుగా పుంగనూరు మండల సర్వేయర్ శ్రీనివాసులు నాయక్ ఎన్నికయ్యారు. సర్వేయర్ల ఎదుర్కొంటున్న సమస్యలుపై చర్చించి రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మంగళవారం పుంగనూరు MRO కార్యాలయంలో తహసీల్దార్ రాము, వివిధ ప్రజా సంఘల నేతలు సన్మానించారు.

March 17, 2026 / 12:57 PM IST

ఏటీఎం చోరీ యత్నం.. దొంగ అరెస్ట్

అనంతపురం: పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎమ్‌లో చోరీ చేయడానికి ప్రయత్నించిన సాయికుమార్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి ఏటీఎం తలుపులు తీయడానికి ప్రయత్నించిన సమయంలో సైరన్ మోగడంతో నిందితుడు పారిపోయాడు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో త్రీ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితున్ని పట్టుకున్నారు.

March 17, 2026 / 12:56 PM IST

ఇంటర్ పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజర్

AKP: ఇవాళ జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,552 మంది హాజరు కావలసి ఉండగా 9,335 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.

March 17, 2026 / 12:56 PM IST

బస్సు లేక విద్యార్థులు అవస్థలు..!

KDP: సింహాద్రిపురం – వెలిదండ్ల బస్సును కేవలం స్కూల్ టైమింగ్లో మాత్రమే నడిపిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు సోమవారం నుంచి మార్నింగ్ స్కూల్ కావడంతో మధ్యాహ్నం 12:30 గంటలకు బస్సు వెళ్లిపోయింది. 10వ తరగతి విద్యార్థులు పరీక్ష రాసి వచ్చేసరికి బస్సు వెళ్లిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమయం పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

March 17, 2026 / 12:56 PM IST