• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

TPT: వరదయ్యపాలెం మండల కేంద్రంలోని మర్కస్ మజీద్‌లో నిర్వహించిన ఇఫ్తియార్ విందులో తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన తర్వాత, ముస్లిం సోదరులు ఇచ్చిన విన్నతులను స్వీకరించారు. ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

March 20, 2026 / 07:02 AM IST

ఏలూరు జిల్లాలో అంబరాన్నంటిన ఉగాది సంబరాలు

ELR: జిల్లా వ్యాప్తంగా పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఉదయం నుంచే ప్రధాన దేవాలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. పలుచోట్ల పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఉగాది పచ్చడి పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ శోభ వెల్లివిరిసింది.

March 20, 2026 / 07:00 AM IST

‘జాబ్ క్యాలెండర్‌తో హామీ నిలబెట్టిన ప్రభుత్వం’

KRNL: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ మాట నిలబెట్టుకుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల కావడం ఆనందదాయకమన్నారు.

March 20, 2026 / 06:59 AM IST

ఉగాది పురస్కారం అందుకున్న స్నేక్ క్యాచర్

విశాఖకు చెందిన స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ను ఉగాది పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ మేరకు గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా పురస్కారం అందుకున్నారు. కిరణ్ కుమార్ స్నేక్ కేర్ సొసైటీ ద్వారా ఇప్పటికి సుమారు 35 వేలకు పైగా పాములను రక్షించారు. రెండు సార్లు పాము కాటుకు కూడా గురి అయ్యి ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.

March 20, 2026 / 06:56 AM IST

డిజిటల్ అరెస్టు పేరిట రూ.56 లక్షల మోసం

SKLM: జిల్లాలో విశ్రాంత అధికారి కృష్ణమోహన్‌ను సైబర్ నేరగాళ్లు “డిజిటల్ అరెస్టు” పేరిట బెదిరించి రూ.56 లక్షలు దోచుకున్నారు. మానవ అక్రమ రవాణా కేసులో విచారణకు ముంబయి రావాలని చెప్పి, ముందుగా డిపాజిట్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. బెదిరింపులతో విడతలుగా మొత్తం నగదు తీసుకున్నారు. నంబర్లు పనిచేయకపోవడంతో బాధితుడు 1930కు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

March 20, 2026 / 06:54 AM IST

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

PPM: జియ్యమ్మవలస మండలంలోని పెదమేరంగి విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో ఇవళ విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శంకరరావు తెలిపారు. నిర్వహణ పనుల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యుత్తు నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.

March 20, 2026 / 06:52 AM IST

కనపర్రులో ఘనంగా శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ వేడుకలు

పల్నాడు: నాదెండ్ల మండలం కనపర్రులో వేంచేసిన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు, గోత్రనామ పూజలు చేశారు. మహిళలు పొంగళ్లు చేసి దేవతామూర్తికి నివేదించారు. భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. బాల ప్రభలు ఆకట్టుకున్నాయి. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.

March 20, 2026 / 06:51 AM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రముఖులు

బాపట్ల: పంగులూరు మండలం, పంగులూరు గ్రామంలో రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో అద్దంకి మాజీ ఎమ్మెల్యే డా. బాచిన చెంచు గరటయ్య, యువ నాయకుడు బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ZPTC నాయకుడు రాయుని వెంకట సుబ్బారావు, మండల ఉపాధ్యక్షుడు యర్రం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

March 20, 2026 / 06:48 AM IST

కొక్కిరాపల్లిలో పార్కు ప్రారంభం

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లిలో గురువారం వివేకానంద మెమోరియల్ పార్క్‌ను 23వ వార్డు మాజీ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లె నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్ అబ్దుల్లా, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

March 20, 2026 / 06:43 AM IST

‘మిట్టల్ గ్రీన్ ఫీల్డ్‌తో కలిగే ప్రయోజనాలు వివరించాలి’

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్లలోని 4 మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ & యూనిట్, బూత్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23న CM చంద్రబాబు అనకాపల్లిలో శంకుస్థాపన చేయబోయే ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ వలన ఉత్తరాంధ్రకు జరిగే అభివృద్ధి, ఉపయోగాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

March 20, 2026 / 06:42 AM IST

అద్భుత అలంకరణతో పాతపట్నం అమ్మవారు

SKLM: నియోజకవర్గం పాతపట్నం నీలమని ఆలయంలో అమ్మవారు ఇవాళ అద్భుతాలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చింది. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టి అనంతరం పూలమాల అలంకరణను చేపట్టారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మను దర్శించారు.

March 20, 2026 / 06:40 AM IST

ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 30 వరకు గడువు

అన్నమయ్య జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని DEO కె.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించనున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని DEO కోరారు.

March 20, 2026 / 06:40 AM IST

సేవా పురస్కారానికి ఎంపికైన కానిస్టేబుల్ రామచంద్రరావు

NTR: తిరువూరు హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజబోయిన రామచంద్రరావుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక “ఉత్తమ సేవ పథకం” పురస్కారం ప్రకటించింది. పోలీస్ విభాగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రరావుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

March 20, 2026 / 06:38 AM IST

కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే

SKLM: ఉగాది సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం గరికపాలేంలోని గ్రామస్తులు కబడ్డీ పోటీలు గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు, Mp అప్పల నాయుడు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు. ఎమ్మెల్యే ఎంపీ కాసేపు కబడ్డీ ఆడారు.

March 20, 2026 / 06:32 AM IST

రేపు ఆకివీడు చేపల మార్కెట్‌కు సెలవు

W.G: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు ఆకివీడు హోల్ సేల్ చేపల మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు శ్రీ రామ భక్తాంజనేయ చేపల కమిషన్ వర్తక సంఘం వెల్లడించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు షేక్ సుభాని మాట్లాడుతూ.. ముందస్తు తీర్మానం ప్రకారం ఆ రోజు వ్యాపార లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రైతులు, వర్తకులు సహకరించాలని కోరారు.

March 20, 2026 / 06:32 AM IST