AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లిలో గురువారం వివేకానంద మెమోరియల్ పార్క్‌ను 23వ వార్డు మాజీ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లె నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్ అబ్దుల్లా, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.