VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్లలోని 4 మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ & యూనిట్, బూత్ ఇన్ఛార్జ్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23న CM చంద్రబాబు అనకాపల్లిలో శంకుస్థాపన చేయబోయే ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ వలన ఉత్తరాంధ్రకు జరిగే అభివృద్ధి, ఉపయోగాలను ప్రజలకు వివరించాలని సూచించారు.