• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మహిళా పారిశ్రామిక వేత్తల ఎక్స్‌పో ప్రారంభం

అనంతపురం జేఎన్టీయూలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ‘విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ప్రొడక్ట్ ఎక్స్‌పో-2026’ శనివారం ప్రారంభమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మహిళా వ్యాపారులు తయారు చేసిన హ్యాండ్‌మేడ్ వస్తువులు, ఆహార పదార్థాలు, స్టార్టప్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.

March 7, 2026 / 06:20 PM IST

దేవరపల్లిలో 2026 ప్రశిక్షణ మహాబియన్ కార్యక్రమం

E.G: గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో 2026 ప్రశిక్షణ మహాబియన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా భాజపా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ సునాయిలా వెంకటేష్, సీనియర్ నాయకులు నిమ్మగడ్డ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 06:20 PM IST

సిబ్బంది కొరత.. ప్రజలకు తిప్పలు.!

KRNL: పెద్దకడబూరులో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వ సేవలు మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సచివాలయం-1లో సిబ్బంది కొరత వేధిస్తోందని స్థానికులు చెప్పుకొచ్చారు. అన్ని మండల ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ సకాలంలో ప్రజలకు సేవలు అందడంలేదని తెలిపారు. ఆధార్, భూముల మ్యూటేషన్ సేవల కోసం పక్కగ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు.

March 7, 2026 / 06:19 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం’

SKLM: పలాస నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం అని MLA గౌతు శిరీష అన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆమె తన 20 నెలల పదవీకాలంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ, నియోజకవర్గ ప్రజలకు ఒక సందేశం విడుదల చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలోని మహిళలందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

March 7, 2026 / 06:14 PM IST

‘మార్గదర్శులను గుర్తించాలి’

ASR: జిల్లాలో ఎక్కువ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి మార్గదర్శిలను గుర్తించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం, వీసీ నిర్వహించారు. బంగారు కుటుంబాలను, మార్గదర్శిలతో రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్నారు.

March 7, 2026 / 06:11 PM IST

‘రక్తదానం అంటే ప్రాణం దానం చేయడమే’

KKD: రక్తదానం చేయడం అంటే మరొకరి ప్రాణం దానం చేయడమేనని DCCB ఛైర్మన్ తుమ్మల బాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్‌లు పేర్కొన్నారు. సామర్లకోట యువత ఆద్వర్యంలో లయన్స్ క్లబ్ భవనంలో మెగా రక్త దాన శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్త దానం చేసిన యువకులను వారు అభినందించారు.

March 7, 2026 / 06:03 PM IST

మంచి మనసున్న చాటుకున్న హెడ్ కానిస్టేబుల్

పార్వతీపురానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి తన మానవత్వాన్ని చాటుకున్నారు. 26వ వార్డు తెలికుల వీధికి చెందిన కొప్పర సాయి రూప అనే మహిళ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం కృష్ణమూర్తి రూ.5,000 ఆర్థిక సాయాన్ని అందించారు.

March 7, 2026 / 06:02 PM IST

సీతంపేట అడ్వెంచర్ పార్కులో సందడి

PPM: పర్యాటక రంగానికి చిరునామాగా మారుతున్న సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కులో కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి శనివారం సందడి చేశారు. పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన ఫ్లవర్ గార్డెన్‌ను ఆయన రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వివిధ రకాల దేశీ, విదేశీ పుష్పాలతో ముస్తాబైన ఈ గార్డెన్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

March 7, 2026 / 06:01 PM IST

స్మృతి వనం పనులను పరిశీలించిన మంత్రి

సత్యసాయి: రాజధాని అమరావతిలోని తుళ్లూరు ప్రాంతంలో నిర్మిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం పనులను మంత్రి సవిత శనివారం పరిశీలించారు. ఈనెల 16న అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా స్మృతి వనంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయడమే ఈ స్మృతి వనం నిర్మాణం లక్ష్యమన్నారు.

March 7, 2026 / 06:00 PM IST

వేలం పాట ద్వారా మున్సిపాలిటీకి భారీ ఆదాయం

ATP: గుంతకల్లులో శనివారం దినసరి సుంకం వసూలకు బహిరంగ వేలం పాట నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. దినసరి, వారపు, జంతువదశాల నుంచి సుంకం వసూలకు బహిరంగ వేలం పాట నిర్వహించామన్నారు. ఈ వేలం పాటలో పత్తిపాటి చంద్రశేఖర్ నాయుడు అనే వేలం పాట దారుడు రూ.53,65,000 లక్షల బహిరంగ వేలం పాట పాడి సుంకం వసూలు చేసుకునే హక్కును దక్కించుకున్నారన్నారు.

March 7, 2026 / 06:00 PM IST

‘సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేయాలి’

E.G: బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, పార్టీ సిద్ధాంతాల‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పిలుపునిచ్చారు. శనివారం గోపాలపురంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 06:00 PM IST

వినాయక స్వామికి వెండి తొండం, హస్తములు విరాళం

CTR: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో స్వామివారికి బెంగళూరుకు చెందిన భక్తుడు కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 2 కిలోల 700 గ్రాముల బరువున్న వెండి తొండం, హస్తములు విరాళంగా సమర్పించారు. వీటి విలువ సుమారు రూ.3.50 లక్షలు అని తెలిపారు. ఆలయ అధికారులు దాతలకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.

March 7, 2026 / 06:00 PM IST

ఆరోపణలను ఖండించిన నజీర్ అహమ్మద్

KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్‌ఛైర్మన్, వైసీపీ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నజీర్ అహమ్మద్ తనపై చేస్తున్న ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలను ఇవాళ తీవ్రంగా ఖండించారు. ఇవి అసత్యాలు, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారమని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

March 7, 2026 / 05:54 PM IST

‘ఇంటి పన్నును వేగవంతం చేయాలి’

VZM: గుర్ల మండలం కెల్లగ్రామ సచివాలయాన్ని చీపురుపల్లి డీడీవో హేమ సుందర్ రావు శనివారం సందర్శించారు. ఇంటి పన్ను వసూళ్లు, కుటుంబ సర్వేపై సమీక్షించి వెంటనే పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే, గ్రామాల్లో పరిశుభ్రతపై దృష్టి సాధించాలని సూచించారు.

March 7, 2026 / 05:53 PM IST

ముస్తాబు గ్రామంగా ఇప్పగూడ: కలెక్టర్

PPM: సీతంపేట మండలం ఇప్పగూడ గ్రామం సమగ్ర అభివృద్ధితో ఆదర్శ ‘ముస్తాబు’ గ్రామంగా నిలిచిందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన సవర సాంస్కృతిక భవనాన్ని ప్రారంభించారు. గిరిజనులు నాటు మందులు, ఆర్‌ఎంపీల జోలికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందాలని సూచించారు.

March 7, 2026 / 05:50 PM IST