అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం బాపనవారిపల్లిలో ఆదివారం ఉదయం భార్యాభర్తలపై దాడి జరిగింది. నరసింహులు, మమత దంపతులు సర్వే నంబర్ 357లో ఇల్లు నిర్మాణానికి గుంట తీయిస్తుండగా నజీర్ కుటుంబసభ్యులు వచ్చి వాగ్వాదానికి దిగినట్లు బాధితులు తెలిపారు. అనంతరం దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపైబ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
సత్యసాయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూనే కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, 50 ఏళ్లకే పింఛన్ వంటి పథకాల్లో మహిళలకు వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డారని ఆరోపించారు.
ASR: అరకులోయలో వెలుగు వ్యవస్థ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సృష్టికర్తలు మహిళలను ఆర్టీసీ ప్రాంతీయ జోన్ ఛైర్మన్ దొన్నుదొర దేవతలతో పోల్చి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా విద్యతో ఇంటితో పాటు సమాజానికి మహిళలు వెలుగు ఇస్తారని వేడుకలో పాల్గొన్న మహిళా డాక్టర్, సామాజికవేత్తలు, అధికారులు, నాయకులు పేర్కొన్నారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఎస్ఆర్ షాపింగ్ మాల్‌ను సినీనటి మీనాక్షి చౌదరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మాల్ పట్టణ ప్రజలకు మంచి షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
KRNL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలు ఇవాళ అందజేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ASP హుస్సేన్ పీరా పాల్గొని మహిళా పోలీసులను అభినందించారు. మహిళా పోలీసులు సమాజ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ELR: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మహిళా సిబ్బంది, జిల్లాలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘అభయ–శక్తి టీం’లు జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు.
PPM: సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి, డిగ్రీ పూర్తి చేసి, సొంతంగా సంపాదించే వరకు వివాహం వద్దు అని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్‌సీఎం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకు కలెక్టర్, జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
NDL: చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని పాముల పాడు మండల రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డిని కలిసి ఎత్తిపోతల ద్వారా కేసీకి నీరు ఇప్పించాలని కోరారు. స్పందించిన బైరెడ్డి ఫోన్ ద్వారా EE ప్రతాప్‌తో మాట్లాడి, విడుదల చేయించారు. దీంతో రైతులు సంతోష వ్యక్తం చేశారు.
CTR: బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్ నిండిపోయి రద్దీ నెలకొంది. అమ్మవారి దర్శనం అనంతరం ఉచిత తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.
NDL: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. కల్లూరు మండలం నాయకల్లులో రైతులకు ఇవాళ నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పల్నాడు: దుర్గి మండలం అడిగొప్పుల శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. నిదానంపాటి అమ్మవారి కృపతో పల్నాడు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తిరునాళ్ల నిర్వహణలో కృషి చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.
KNRL: కోసిగి మండల MPP పెండేకంటి లవకుశ ఈరన్న భార్య, మాజీ వైస్ యంపీపీ పెండేకంటి నాగరత్నమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఇవాళ కోసిగి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరన్న కుటుంబాన్ని ఓదార్చి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
TPT: సత్యవేడు మండలం ఇరుగుళం గ్రామంలో క్రొత్తగా నిర్మించబడిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, విద్యార్థులు, సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ ద్వారా సమాజంలో సామ్య, సమానత్వ భావాలను పెంపొందించడమే లక్ష్యం అని వారు తెలిపారు.
ELR: ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఏలూరు డీఎల్‌పీవో అమ్మాజీ అన్నారు. ఆదివారం ఉంగుటూరు మండలంలో ఉంగుటూరు, చేబ్రోలు గ్రామాలలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను డీఎల్‌పీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో గెడ్డం రమేష్ బాబు, ఉంగుటూరు పంచాయతీ అభివృద్ధి అధికారి బొడ్డు రవి పాల్గొన్నారు.
NDL: మహిళల అభ్యున్నతితోనే సమాజాభివృద్ధి సాధ్యమని గ్రంథాలయ జిల్లా సెక్రటరీ ప్రకాష్, గ్రంథాలయ అధికారి సుజాత అన్నారు. సిరివెళ్ల గ్రంథాలయ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళల అభివృద్ధిలో విద్య కీలకమని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.