అనంతపురం జేఎన్టీయూలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ‘విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ప్రొడక్ట్ ఎక్స్పో-2026’ శనివారం ప్రారంభమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మహిళా వ్యాపారులు తయారు చేసిన హ్యాండ్‌మేడ్ వస్తువులు, ఆహార పదార్థాలు, స్టార్టప్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.