• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నోబుల్ వాకర్స్ క్లబ్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

PPM: నోబుల్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను పార్వతీపురం జీజే కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలను నోబుల్ ఏరియా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఐ.గుణేశ్వర రావు, రీజనల్ కౌన్సిలర్ జే.నారాయణస్వామి, ప్రెసిడెంట్ డీవీ.రమణ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుణేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.

March 8, 2026 / 10:59 AM IST

ప్రత్యేక అలంకరణలో బుగ్గ రామలింగేశ్వరుడు

ATP: తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆదివారం భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారిని విశేష పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

March 8, 2026 / 10:51 AM IST

ఎక్సైజ్ SI సత్తా.. ఒకేసారి మూడు మెడల్స్..!

ELR: ఏలూరులో జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయి ఎక్సైజ్ స్పోర్ట్స్ మీట్లో ఆకివీడు SI కొలుసు కరుణ ప్రియ మూడు పతకాలు సాధించారు. త్రో బాల్, టెన్నికాయిట్లో బంగారు పతకాలు, చెస్లో రజత పతకం కైవసం చేసుకున్నారు. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పతకాలు సాధించడంపై అధికారులు, సిబ్బంది ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

March 8, 2026 / 10:45 AM IST

ఆర్.శాంతమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే ఘన నివాళులు

CTR: చిత్తూరు దొడ్డిపల్లి మాజీ సర్పంచ్, ఎల్.జి.బి గ్రూప్ సంస్థల అధినేత కీ.శే. రఘురామన్ గారి సతీమణి ఆర్.శాంతమ్మ శుభ స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే తేదేపా నాయకులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

March 8, 2026 / 10:42 AM IST

‘కార్మికుల తొలగింపు అన్యాయం’

SKLM: ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ కార్మికులను 50 ఏళ్ల వయోపరిమితి పేరుతో తొలగించడం అన్యాయమని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు అన్నారు. రాయలసీమ జిల్లాల్లో కార్మికుల తొలగింపులకు నిరసనగా ఇవాళ శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. దశాబ్దాలుగా పని చేస్తున్న కార్మికులను ఒక్కసారిగా తొలగించడం చట్టవ్యతిరేకమని తేజేశ్వరరావు అన్నారు.

March 8, 2026 / 10:41 AM IST

ఆంధ్రుల అన్నపూర్ణ మన డొక్కా సీతమ్మ

కోనసీమ: మహిళా దినోత్సవం వేల ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన ‘డొక్కా సీతమ్మ’ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆకలితో వచ్చిన వారికి కడుపు నిండా అన్నం పెట్టిన మహాదాత డొక్కా సీతమ్మ అని చెప్తారు. ఆమె మండపేటలో జన్మించింది. లంకల గన్నవరంకు చెందిన ధనవంతుడు జోగన్న పంతులు ఆమెను వివాహం చేసుకున్నారు. ఆమె ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతూ అన్న దాత అయ్యారు.

March 8, 2026 / 10:39 AM IST

విద్యార్థులచే శ్రీ భగవద్గీత శ్లోకపారాయణం

KDP: తొండూరులోని నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామి ఉత్సవమూర్తుల ప్రాకార ఉత్సవం జరగనుంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో తొండూరు విద్యార్థులచే శ్రీ భగవద్గీత శ్లోక పారాయణం నిర్వహించనున్నారు. ఇస్కాన్ వైష్ణవులు శ్రీ గీత సందేశాన్ని అందించనున్నారు.

March 8, 2026 / 10:38 AM IST

మహిళా రైల్వే స్టేషన్ గురించి తెలుసా..!

TPT: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చంద్రగిరి రైల్వే స్టేషన్ ఇది దక్షిణ భారతదేశంలోనే ఏకైకా మహిళా రైల్వే స్టేషన్. స్టేషన్ మాష్టర్ నుంచి ఆర్పీఎఫ్ సిబ్బంది, గార్డులు ఇలా అన్ని విభాగాల్లో రాత్రి, పగలు మహిళలే విధులు నిర్వహిస్తుంటారు. 2018 నుంచి ఇప్పటివరకు మహిళలే నడిపిస్తున్న మహిళా రైల్వే స్టేషన్‌గా కీర్తి గడించింది.

March 8, 2026 / 10:36 AM IST

టీడీపీ సీనియర్ నాయకుడు బాలా కుమార్‌కు ఘన నివాళి

CTR: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కుప్పం మున్సిపాలిటీ బూత్ నెం.171 ఇన్‌ఛార్జ్ బాలా కుమార్ మృతి చెందారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటుగా APSRTC వైస్‌ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. ఆయన పార్థివ దేహానికి పార్టీ జెండా కప్పి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

March 8, 2026 / 10:32 AM IST

దూబచర్ల వాసులకు అలర్ట్

తూ.గో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దూబచర్లలో ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఇంటి పన్నుల వసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పంచాయతీ కార్యదర్శి ఆశా అలేఖ్య గ్రామంలో పర్యటిస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. గ్రామ అభివృద్ధికి సహకరించేలా ప్రజలు సమయానికి పన్నులు చెల్లించి సహకరించాలని అలేఖ్య విజ్ఞప్తి చేశారు.

March 8, 2026 / 10:30 AM IST

పోతులనాగేపల్లిలో వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

సత్యాసాయి: ధర్మవరం మండలం పోతులనాగేపల్లిలో ఆదివారం నిర్వహించిన వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. గ్రామస్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్న ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని కేతిరెడ్డి పేర్కొన్నారు.

March 8, 2026 / 10:30 AM IST

రోడ్డు ప్రమాదంలో మహిళలకు తీవ్ర గాయాలు

KKD: పిఠాపురం బైపాస్ రోడ్డులో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. విరవాడ జంక్షన్ వద్ద బైక్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. విద్యుత్ స్తంభం విరిగిపోయినా, పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు గాయపడిన వారిని వెంటనే కాకినాడ ఆసుపత్రికి తరలించారు.

March 8, 2026 / 10:29 AM IST

త్వరలో హైవే పెట్రోలింగ్ వాహనాలు: ఐజీ

ELR: ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం లక్కవరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. హైవే పెట్రోలింగ్ కోసం ప్రభుత్వం రూ. 300 కోట్లు మంజూరు చేసిందని, త్వరలో కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గంజాయి రవాణా కట్టడిలో ఉందని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

March 8, 2026 / 10:26 AM IST

విసన్నపేటలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

ఎన్టీఆర్: విసన్నపేటలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ప్రసన్నపేటలోని బీజేఆర్ నగర్లో నివాసం ఉంటున్న జొన్నలగడ్డ ఏసురక్తం అనే వ్యక్తి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందారు. భవన నిర్మాణ కూలి పనుల నిమిత్తం వెళ్లిన అతనికి 11కేవీ వైర్లు తగిలి కింద పడటంతో పదునైన ఆయుధం గుచ్చుకొని మృతి చెందినట్లు తెలిపారు.

March 8, 2026 / 10:26 AM IST

వసతి గృహాలు తనిఖీ చేసిన ఫుడ్ కమిటీ ఛైర్మన్

అన్నమయ్య: మదనపల్లెలో ఫుడ్ కమిటీ ఛైర్మెన్ విజయ్ ప్రతాప్ రెడ్డి స్థానిక పుంగనూరు రోడ్డులోని సోషల్ వెల్ఫేర్, ఎస్సీ, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. శనివారం ఐసీడీఎస్ సీడీపీవో నాగవేణి, రెవెన్యూ అధికారులు, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి హాజరై ఫుడ్ కమిటీ ఛైర్మెన్తో కలసి వసతి గృహాల్లో చుదువుతున్న బాలికలను పలకరించారు.

March 8, 2026 / 10:24 AM IST