CTR: మంగళవారం కురిసిన భారీ వర్షానికి నగరి కీలపట్టు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌కు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులు ప్రజాప్రతినిధులను పంపించి జేసీబీతో మరమ్మతులు చేయించారు. స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
కోనసీమ: మండపేట ప్రజలంతా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలను సులభంగా పొందేందుకు ‘పురమిత్ర’ మొబైల్ యాప్‌ను వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనరు టి.వి.రంగారావు సూచించారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో సిబ్బంది, సచివాలయం, మెప్మా సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. యాప్ గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ELR: ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామ శివారులో కోడి పందేలు ఆడుతున్న 8 మంది వ్యక్తులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.8,000 నగదు, 8 సెల్‌ఫోన్‌లను, 3 మోటార్ సైకిల్, 2 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారిపై చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా ఉర్దూ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అధికారిగా షకీలా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నందిగామ పట్టణ నివాసి షకీలా విజయవాడలో నివాసం ఉంటూ ఉర్దూ స్కూల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల మేరకు షకీలాను డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అధికారిగా ప్రభుత్వం నియమించింది.
KRNL: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కర్నూలు జిల్లాలో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని జిల్లా IMD అధికారులు తెలిపారు. ఆ తర్వాత 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. రేపు కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయన్నారు.
KRNL: ఆదోనిలో MPTC కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. బైచిగేరి MPTC నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య విజయలక్ష్మి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 22న జరగనున్న MPPపై అవిశ్వాస తీర్మానానికి వెళ్లకుండా తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. నాగభూషణ్ రెడ్డితో పాటు మరో ముగ్గురు MPTCలను కూడా కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
PPM: శివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీకమాసం రేపటి నుండి ప్రారంభం కానుందని అడ్డాపుశీల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ పాడి తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ప్రతీ రోజు రుద్రాభిషేకాలు, బిల్వార్చన, రుద్రపూజలు విశేషంగా జరుగుతాయన్నారు. కార్తీక మాసంలోని 4సోమవారాలు ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు పోటెత్తుతారని అన్నారు.
విశాఖలో దీపావళి పండగ నేపథ్యంలో టపాసులు పేలి 10 మంది వరకు గాయపడ్డారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కేజీహెచ్‌కు గాయపడిన వారు ఓపికి చేరుకోగా చికిత్స అందజేశామని ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు మంగళవారం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఈ కేసుల సంఖ్య నమోదు అయింది.
BPT: బాపట్ల పట్టణ మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో కార్తీకమాస ఏర్పాట్లపై అధికారులతో మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసంలో సూర్యలంక సముద్ర స్నానానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
NTR: జగ్గయ్యపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా ఇందిరా క్రాంతి పథకంలో ధన్య గ్రూపు, విజేత డ్వాక్రా గ్రూపుల సభ్యులకు రూ.35 లక్షల రుణమును పీఎసీఎస్ చైర్ పర్సన్ నరసింహారావు మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్తవరపు వెంకటేష్ పావని, పీఎసీఎస్ సీఈవో నెట్టెం తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని స్థానిక గార్లపేట రోడ్లో ఉన్న ఎస్సీ-2 హాస్టల్ ఆధునీకరణ పనులను మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ గృహాలకు అధిక నిధులు కేటాయించామన్నారు.
SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష తన కార్యాలయంలో మంగళవారం జీడి పరిశ్రమ అభివృద్ధికై సమావేశం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పలాస జీడి ఉత్పత్తిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని అన్నారు. రైతులు ఉత్పత్తి చేసే జీడీ పంటకు తగిన ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ వెంకన్న చౌదరితో పాటు జీడి రైతులు పాల్గొన్నారు.
GNTR: లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. గుంటూరులో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నంలోని బీచ్ రోడ్ హర్బర్ పార్క్‌లో 13.74 ఎకరాల భూములను లూలు సంస్థకు ఇవ్వడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు.
NLR: అనంతసాగరం మండలంలో మెగా డీయస్‌సీ 2025 ద్వారా మండలంలోని వివిధ పాఠశాలల్లో నూతనంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 19మంది ఉపాధ్యాయులను ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులుగా మంగళవారం చేర్చారు. వారికి వృత్తి పరమైన సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
W.G: తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 24న ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వి.చంద్రశేఖర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీపీ శేషులత అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు విధిగా హాజరు కావాలని ఆయన కోరారు.