• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బొబ్బిలిలో నాకాబందీ.. వాహనాల తనిఖీ

VZM: బొబ్బిలి పట్టణంలోని సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. బొబ్బిలి నుంచి రాకపోకలు చేసే వాహనాలను పరిశీలించారు. గంజాయి, మత్తు పదార్థాలు, మందుగుండు సామగ్రి రవాణా జరగకుండా నాకాబందీ నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్థాలు, ఫైర్ క్రాకర్స్ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 6, 2026 / 09:34 AM IST

వైభవంగా ఆలయం పునః ప్రారంభం

AKP: ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని గురువారం వైభవంగా పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా హోమాలు, కలశ పూజలు చేశారు. ఇదే ప్రాంగణంలో మరిడిమాంబ ఆలయాన్ని కూడా ప్రారంభించారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పలువురు అమ్మవారులను దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వినోద్ రాజు పాల్గొన్నారు.

March 6, 2026 / 09:32 AM IST

ప్రొద్దుటూరు పట్టణ ఐద్వా కార్యవర్గం ఎన్నిక..!

KDP: పొద్దుటూరు పట్టణ ఐద్వా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా విజయకుమారి, ఉపాధ్యక్షులుగా సర్వేశ్వరీ, రాములమ్మ, వెంకటసుబ్బమ్మ, భానుమతి, ప్రధాన కార్యదర్శిగా గోకుల ప్రేమ, సహాయ కార్యదర్శులుగా లావణ్య, ఝాన్సీ, గుర్రమ్మ, జ్యోతి, సుదర్శనమ్మ, లక్ష్మీదేవి, పుష్పలత, కోశాధికారిగా పద్మ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

March 6, 2026 / 09:32 AM IST

భానుడి ప్రతాపంలో కావలి టాప్

నెల్లూరు జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే కావలిలో నిన్న అత్య ధికంగా 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. అమరావతి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు కంటే ఎక్కువ కాస్తుందని తెలిపారు. ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

March 6, 2026 / 09:31 AM IST

రేపు భీమడోలుకు రానున్న షర్మిళ

ELR: ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈనెల 7న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి భీమడోలులో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించే ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆమె పాల్గొని కూలీలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహనరావు పార్టీ నేతలతో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు.

March 6, 2026 / 09:28 AM IST

నేడు పత్తికొండలో జాబ్ మేళా..!

KRNL: పత్తికొండలోని శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనునారు. ఈ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివి 18-40 ఏళ్ల మధ్య వారు అర్హులు. ఇంటర్వ్యూలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి.

March 6, 2026 / 09:28 AM IST

5 నిమిషాల ఆలస్యంతో అవకాశం కోల్పోయారు

VSP: రైల్వే టెక్నీషియన్ గ్రేడ్-3 పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో సుమారు పది మంది అభ్యర్ధులు అవకాశం కోల్పోయారు. పెందుర్తి చినముషిడివాడ డిజిటల్ అయాన్ సెంటర్‌లో ఇవాళ ఉదయం మొదటి షిఫ్ట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 నుంచి 8:30 వరకు రిపోర్టింగ్ సమయం కాగా, అభ్యర్థులు 8:35 గంటలకు రావడంతో వారిని అనుమతించలేదు.

March 6, 2026 / 09:26 AM IST

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

కృష్ణా: గుడివాడ మండలం బేతవోలు హై స్కూల్ విద్యార్థులకు మహిళల భద్రతపై వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళల గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

March 6, 2026 / 09:20 AM IST

జనగణన డేటా సేకరణలో జాగ్రత్తలు పాటించాలి: జేసీ

ATP: జన గణన డేటా సేకరణలో జాగ్రత్తగా వ్యవహరించాలని జేసీ విష్ణు చరణ్ అధికారులకు సూచించారు. జనాభా లెక్కల సేకరణలో విధివిధానాలపై అధికారులు సంపూర్ణ అవగాహనతో పని చేయాలని, అనంతపురం జనాభా గణన 2027 ప్రక్రియను 100% పూర్తిచేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సూచించారు.

March 6, 2026 / 09:20 AM IST

బోయకొండకు వెళ్తున్నారా.. గుడ్ న్యూస్!

CTR: బోయకొండ గంగమ్మ ఆలయ టోల్ గేట్ ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తగ్గిస్తున్నట్టు ఈవో ఏకాంబరం ఓ ప్రకటనలో తెలిపారు. బస్సు, లారీలకు రూ. 200 నుంచి 150, కారుకు రూ.150 నుంచి 100, ఆటోకు రూ.70 నుంచి 50 తగ్గించి తీసుకుంటామని చెప్పారు. బైకులకు ఎటువంటి ఫీజు లేదన్నారు.

March 6, 2026 / 09:19 AM IST

‘రీ సర్వే పట్టాదారు పాసు పుస్తకాలు వేగవంతం చేయాలి’

PPM: జిల్లాలో జరుగుతున్న రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ మరింత వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి జె.సీలను, సబ్ కలెక్టర్లను ఆదేశించారు. నిషేధిత భూముల జాబితా నుంచి అర్హులైన వారి భూములకు హక్కులు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో జె.సి, సబ్ కలెక్టర్లతో సమీక్షించారు.

March 6, 2026 / 09:19 AM IST

పబ్లిక్ టాయిలెట్లకు ప్రత్యేక శుభ్రత కార్యక్రమం

BPT: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ జి. రఘునాధ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజలు వినియోగిస్తున్న పబ్లిక్ టాయిలెట్లను శుభ్రపరిచారు. పారిశుధ్య సిబ్బంది టాయిలెట్లను పూర్తిగా శుభ్రం చేశారు.

March 6, 2026 / 09:18 AM IST

కబడ్డీ పోటీలను ప్రారంభించిన బీసీ ఇందిరమ్మ..!

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన కబడ్డీ పోటీలను బీసీ ఇందిరమ్మ ఘనంగా ప్రారంభించారు. అనంతరం కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి ఆమె బహుమతులను అందజేశారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.

March 6, 2026 / 09:15 AM IST

నేడు ఆలయ పునర్నిర్మాణంలో కీలక ఘట్టం

PLD: మహంకాళి అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆలయ ప్రదక్షణ మండపంలో ‘సూర్య కాంతి స్తంభం’ స్థాపన కార్యక్రమం జరగనుంది. దీనితో పాటు అమ్మవారి 51వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం కూడా ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

March 6, 2026 / 09:15 AM IST

‘బాల బాలికలకు హెల్త్ ఐడీ అకౌంట్ ఉండాలి’

AKP: ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం సమాచారాన్ని డిజిటల్ విధానంలో భద్రపరచడానికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడిని ప్రవేశపెట్టినట్లు డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ హైమావతి గురువారం తెలిపారు. అనకాపల్లిలో ఆమె మాట్లాడుతూ.. 14 నుంచి 15 ఏళ్ల బాల బాలికలకు తప్పనిసరిగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీ ఉండాలన్నారు.

March 6, 2026 / 09:11 AM IST