VZM: మెరకముడిదాం సొసైటీ పరిధి యెక్క బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రం నిరుపయోగంగా ఉంది. ఈ కేంద్రమును 2023వ సంవత్సరంలో 40 లక్షల మంజూరు చేశారు. దీన్ని ఊరికి చివర స్మశానంలో ఏర్పాటు చేయడంతో రోడ్డు సౌకర్యం లేనందున రైతులు గగ్గోలు పడుతున్నారు. కట్టి 3సంవత్సరాలు అవుతున్న ప్రారంభించలేదని అంటున్నారు. ఈ స్టోరేజ్‌ను వాడుకలోనికి తెస్తే రైతులకు ఉపయోగపడుతుంది.
AKP: నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ ఏఎల్.పురం రైతు మార్కెట్‌ను సందర్శించారు. టమాటాకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా కల్పించారు. టమాటా నేలపాలు కాకుండా గిట్టుబాటు ధర కల్పించేందుకు నర్సీపట్నం, విశాఖపట్నం హోటళ్లు మార్కెట్ వ్యాపారులతో చర్చించి సరఫరా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
KDP: పులివెందుల పట్టణం బోలెవార్డ్‌లో పాత కరెంట్ కార్యాలయం సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వ్యాపించి దుకాణంలోని వస్త్రాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.
కృష్ణా: గుడివాడ బేతవోలులో నిర్వహించిన ‘జనసేన ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, గ్రామ స్థాయి నుంచి ఉద్యమి సభ్యత్వాలను విస్తృతంగా నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు.
కృష్ణా: గుడివాడ బేతవోలులో నిర్వహించిన ‘జనసేన ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, గ్రామ స్థాయి నుంచి ఉద్యమి సభ్యత్వాలను విస్తృతంగా నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు.
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మార్కాపురం జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం జరగనుందని ప్రకాశం జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షుడు నాయబ్ రసూల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ లింగరావు హాజరు అవుతారని తెలియజేశారు.
AKP: అనకాపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానం మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం ఆలయాన్ని మూసివేసినట్లు దేవస్థానం ఛైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ తెలిపారు. తిరిగి చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని శుభ్రపరచి సంప్రోక్షణ చేసిన తర్వాత అమ్మవారి దర్శనాలు ఉంటాయని చెప్పారు.
VSP: విశ్వవిఖ్యాత పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం డోలోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవల అనంతరం స్వామివారిని మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకువచ్చారు. ముందుగా సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయంకు విచ్చేసిన స్వామివారికి వివాహ ప్రార్థనలు నిర్వహించారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో వెలిసిన హజరత్ యదుల్లా హ్ భాష ఖాద్రి ఉరుసు ఉత్సవాల సందర్భంగా రెండవ రోజు మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామ పురవీధుల గుండా స్వామి గంధాన్ని మేళ తాళాలు నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దర్గాలో స్వామి వారికి గంధాన్ని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, చక్కర చదివింపులు చేశారు.
అన్నమయ్య: బోరెడ్డిగారిపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు స్వయంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పలువురు మంత్రిని పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
KKD: అన్నవరం రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అధికారులు ప్లాట్‌ఫామ్‌పై టైల్స్ అమరిక, సమతలీకరణ పనులు చేపట్టారు. ఇందుకోసం ఇసుక మోట్లు, నిర్మాణ సామగ్రి ప్లాట్‌ఫామ్‌పై సిద్ధంగా ఉంచారు. భవిష్యత్తులో మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
VSP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 4న ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు అరకు (M) తంగుల్గూడాలోని రాధాకృష్ణ ఆలయంలో MLA రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుకుని రాణాప్రతాప్ నగర్‌లో మాజీ MLA వాసుపల్లి గణేశ్ నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
ELR: హోలీ పండగ సెలవు రోజైన ఉంగుటూరు మండలంలో అధికారులు ఇంటి పన్ను కులాయి పన్ను వసూళ్లలో నిమగ్నమై ఉన్నారు. ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో మంగళవారం పెద్ద వెల్లమిల్లి, చిన వెల్లమిల్లి, చింతాయిగూడెం గ్రామాలలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను పరిశీలించారు. వెల్లమిల్లి గ్రామపంచాయతీ అభివృద్దికి అప్పారావు, సచివాలయం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
BPT: బాపట్ల విద్యా ప్రదాత కీర్తిశేషులు ముప్పలనేని శేషగిరిరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ, ఆయన కుమారుడు శేషు సుమంత్ కుమార్, అభిమానులు మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మకు వినతి పత్రం అందించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, త్వరలోనే విగ్రహ ఏర్పాటుకు తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన స్టాప్, ఫేస్ వాష్ అండ్ గోకార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి తర్వాత ప్రయాణిస్తున్న లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి అప్రమత్తంగా పంపిస్తున్నారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలని పోలీసులు సూచించారు.