• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చేబ్రోలులో ఈ నెల 28న జాబ్ మేళా

GNTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గురువారం వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. కావున ఆసక్తి గల వారు తమ విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.

February 26, 2026 / 03:40 PM IST

వైభవంగా బ్రహ్మంగారి మఠాధిపతి పట్టాభిషేకం

KDP: బ్రహ్మంగారిమఠం(మం) పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం 8వ తరం, 12వ మఠాధిపతులు వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారి పట్టాభిషేక మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కడప జిల్లాలోని కాంగ్రెస్, TDP, YCP నేతలు పాల్గొన్నారు. పీఠాధిపతులు వెంకటాద్రి స్వాములవారి హయాంలో బ్రహ్మంగారిమఠం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

February 26, 2026 / 03:39 PM IST

‘కుటుంబ సర్వే పూర్తి చేయాలి’

VSP: యునిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఫిబ్రవరి 28 నాటికి 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తూర్పు జోన్‌లోని పలు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సర్వే పురోగతిని సమీక్షించారు. ప్రజల సహకారం లేకుండా సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదని పేర్కొంటూ, సర్వేకు పూర్తిగా సహకరించాలని ప్రజలను కోరారు.

February 26, 2026 / 03:39 PM IST

అంబేద్కర్ విశిష్ట సేవా రత్న అవార్డుకు రంగయ్య ఎంపిక

KRNL: ఎమ్మిగనూరులో దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న రంగయ్య డాక్టర్ B.R.అంబేద్కర్  విశిష్ట సేవా రత్న అవార్డుకు ఎంపిక అయ్యాడు. దీంతో పలువురు ప్రముఖులు, ఉద్యమకారులు, సామాజికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. గురువారం రంగయ్య మాట్లాడుతూ.. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, పేదల పక్షాన నిబద్ధతతో ముందుకు సాగుతానని తెలిపారు.

February 26, 2026 / 03:38 PM IST

‘రాష్ట్రంలో టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేస్తాం’

GNTR: రాష్ట్రంలో దెబ్బతిన్న దేవాలయాల వ్యవస్థను తిరిగి నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గురువారం గుంటూరు బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక రంగాన్ని, టెంపుల్ టూరిజాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఇదే క్రమంలో లిక్కర్ స్కామ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

February 26, 2026 / 03:36 PM IST

పల్లికొండేశ్వర స్వామికి బంగారు తాళిబట్టు వితరణ

TPT: నాగలాపురం మండలం సురుటపల్లిలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరిత రామప్రసాద్ రెడ్డి 11 గ్రాముల బంగారు తాళిబట్టును శ్రీ గౌరీ సమేత దక్షిణామూర్తి స్వామికి సమర్పించారు. ఆలయ ఛైర్మన్ డీ.పద్మనాభ రాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అర్చకులు వేదమంత్రాల నడుమ తాళిబొట్టును స్వీకరించారు.

February 26, 2026 / 03:32 PM IST

2027 జనాభా గణన నిర్వహణకు 3 రోజుల శిక్షణ: జేసీ

E.G: జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణకు సంబంధించి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ తెలిపారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో జేసీ మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో శిక్షణ జరగనుందన్నారు.

February 26, 2026 / 03:32 PM IST

జీసీసీలో సిబ్బంది కొరతపై మంత్రికి వినతి

ASR: అమరావతిలో GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిను కలిసి సంస్థలో సిబ్బంది కొరత, పరిపాలనా సమస్యలపై ఇవాళ వినతిపత్రం సమర్పించారు. మార్కెటింగ్, ట్రాన్స్‌పోర్ట్, ఇంజినీరింగ్, ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. గిరిజన రైతుల నుంచి కాఫీ కొనుగోలుకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు.

February 26, 2026 / 03:28 PM IST

పాల కేంద్రాల్లో అధికారుల దాడులు

W.G: తణుకులోని పాల కేంద్రాలతోపాటు డైరీ ఫార్మ్స్‌పై గురువారం అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో కల్తీ పాలు కారణంగా ఆరుగురు మృతి చెందటంతో జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీధర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్, తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తనిఖీలు చేసి నమూనాలు సేకరించారు.

February 26, 2026 / 03:24 PM IST

‘శారదా నది గుట్లును పటిష్టం చేయాలి’

AKP: వరదలు వస్తే పంట పొలాలకు నష్టం కలగకుండా రాంబిల్లి మండలంలో శారదా నది గుట్లును పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ విజ్ఞప్తి చేశారు. గురువారం శాసనసభలో మాట్లాడుతూ.. అల్లూరి జిల్లా, ఒడిస్సాలో ఎక్కడ వర్షం పడినా శారదా నది ఉధృతంగా ప్రవహిస్తూ రాంబిల్లి సముద్రంలో కలుసుకుందన్నారు. దీనివల్ల వరద ముప్పు ఏర్పడుతుందన్నారు.

February 26, 2026 / 03:22 PM IST

YCPలోనే ఆదాల.. పార్టీ మార్పు లేనట్లే!

నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. వైసీపీని వీడి బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ నెల్లూరుకు వచ్చిన జగన్‌ను ఆదాల కలిశారు.

February 26, 2026 / 03:21 PM IST

సీఎం హామీతో ఇల్లు నిర్మాణానికి అధికారులు కృషి

E.G: తాళ్ళపూడి మండలం మలకపల్లిలో నిర్వహించిన ప్రజావేదికలో గ్రామానికి చెందిన సనమండ్ర పోసియ్యకు చెందిన గృహాన్ని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు లబ్ధిదారుడి గృహాన్ని హౌసింగ్ డిపార్ట్‌మెంట్, MRO గురువారం పరిశీలించారు. లబ్దిదారుడికి హౌసింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

February 26, 2026 / 03:18 PM IST

దసరా నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

ATP: రాయదుర్గంలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని MLA కాలవ శ్రీనివాసులు కోరారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. రూ.64.81 కోట్లతో చేపట్టిన ఈ గృహ సముదాయాల్లో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన నిధులు కేటాయిస్తే 1008 పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందన్నారు.

February 26, 2026 / 03:17 PM IST

ఈదురు గాలులకు నేలకొరిగిన పంట

VZM: గజపతినగరం మండలంలో ఈదురుగాలులకు 150 ఎకరాలు మొక్కజొన్న పంట నేలకొరిగిందని సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల జ్యోతి చెప్పారు. నేలకొరిగిన మొక్కజొన్న పంటను పలు గ్రామాల్లో ఏడిఏ నిర్మల జ్యోతితో పాటు మండల వ్యవసాయ అధికారి ఏ కిరణ్ కుమార్ పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

February 26, 2026 / 03:17 PM IST

ప్రశాంతంగా ముగిసిన ఇంగ్లీష్ పరీక్ష..!

CTR: పాలసముద్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ డా. ఏ.హేమలత తెలిపారు. ప్రభుత్వ జూ.కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 100 మందికి 100 మంది హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 03:15 PM IST