ELR: జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పాలసీ కొండంత అండగా నిలుస్తుందని డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం బయ్యనగూడెంలో నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.లక్ష బీమా వర్తిస్తుందని తెలిపారు.
CTR: కడపలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాయలసీమ లిఫ్ట్ పూర్తి కోసం- భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు రాయలసీమకు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. చంద్రబాబు చర్యల వల్ల సీమకు తీరని నష్టం జరుగుతోందని ఆరోపించారు.
AKP: ఎస్ రాయవరం మండలంలో రూ.2,54,99,134 వసూళ్లు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,26,46,557 వసూళ్లు చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆదివారం తెలిపారు. దార్లపూడి, చినగుమ్ములూరు, తిమ్మాపురం, కొరుప్రోలు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రజలు చెల్లించే ఇంటి పన్నులు ద్వారా కనీస సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు.
GNTR: తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపాడు శివారులో పిచ్చుకులపాలెం వద్ద జరగనున్న ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ భవన నిర్మాణ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటారు.
GNTR: తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపాడు శివారులో పిచ్చుకులపాలెం వద్ద జరగనున్న ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ భవన నిర్మాణ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటారు.
ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ముదిగల్లుకు చెందిన అనాథ యువతి ప్రమీద వివాహానికి MLA అమిలినేని సురేంద్ర బాబు ఆర్థిక చేయూతనిచ్చారు. తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయి పెళ్లి కోసం ఒక పట్టుచీరతో పాటు రూ.15,000 నగదును అందజేశారు. స్థానిక నాయకులు గౌని శ్రీనివాసులు రెడ్డి, ఊటంకి రామాంజనేయులు సమక్షంలో ఈ సాయాన్ని యువతి పెద్దనాన్న, పెద్దమ్మలకు అప్పగించారు.
SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం స్త్రీ శక్తి వాల్ పోస్టర్‌ను జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించ బడిందని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు.
KRNL: ఆదోనిలో విక్టరీపేటకు చెందిన షేక్ గౌసియా అనారోగ్యంతో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుడిసె కృష్ణమ్మ సేవా సమితి తరఫున ఖర్చుల కోసం కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
కోనసీమ: రాయవరం మండలం, వెంటూరు గ్రామ దేవత శ్రీ దండు మారెమ్మను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు దర్శించుకున్నారు. శ్రీ దండు మారెమ్మ జాతర సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ళ వెంటూరులో మారెమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సంధర్బంగా ఆ తల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండల టీడీపీ నేతలు పాల్గొన్నారు.
కోనసీమ: రాయవరం మండలం, వెంటూరు గ్రామ దేవత శ్రీ దండు మారెమ్మను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు దర్శించుకున్నారు. శ్రీ దండు మారెమ్మ జాతర సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ళ వెంటూరులో మారెమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సంధర్బంగా ఆ తల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండల టీడీపీ నేతలు పాల్గొన్నారు.
W.G: కాకినాడ జిల్లా వేట్లపాలెం దుర్ఘటన నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పాలకొల్లులో బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో ఆదివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ నిబంధనల అమలును పరిశీలించారు. తయారీ కేంద్రాలు జనావాసాలకు దూరంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేసి, నిల్వలను రికార్డులతో సరిపోల్చారు.
KRNL: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు వరమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. ఆదివారం పాములపాడు మండలంలోని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. భాను ముక్కల రాజుకు రూ.38,495, వేంపెంట పెద్ద సుబ్బమ్మకు రూ.1,22,228, ఎర్ర గూడూరు శివుడికి రూ.72,656 మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
CTR: ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా బోయకొండ గంగమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏకాంబరం ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. పండితుల సూచనల మేరకు ఆరోజు ఉదయం 9 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుందన్నారు. అనంతరం ఆలయం మూసివేస్తున్నట్టు వెల్లడించారు. 4వ తేదీన ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి అభిషేకం అనంతరం దర్శనాలు ప్రారంభిస్తామన్నారు.
ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘మీ కోసం-ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. వీటిని ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ELR: గణపవరం వెలంపేటలో వేంచేసి యున్న శ్రీ గోధా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికి సన్మానించారు.