• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రహదారుల అభివృద్ధికి రూ. 8.20 కోట్ల నిధులు మంజూరు

GNTR: పొన్నూరు నియోజకవర్గంలోని మూడు ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ. 8.20 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం తెలిపారు. ఇందులో భాగంగా చింతలపూడి రోడ్డుకు రూ. 4.20 కోట్లు, గోవాడ రోడ్డుకు రూ. 3.50 కోట్లు, పాండ్రపాడు రోడ్డుకు రూ. 50 లక్షలు కేటాయించామని పేర్కొన్నారు. ఈ రహదారుల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.

March 3, 2026 / 07:18 PM IST

నేషనల్ సైన్స్ డే సందర్భంగా సెమినార్, సన్మానం

నంద్యాల జిల్లా బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే వారోత్సవాల సందర్భంగా “ఉమెన్ ఇన్ సైన్స్” థీమ్‌తో సెమినార్ నిర్వహించారు. ఉప విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బయాలజీ విభాగంలో విశిష్ట సేవలందించిన, విద్యార్థులను రాష్ట్ర–జాతీయ సైన్స్ ఫెయిర్లకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులను సన్మానించారు.

March 3, 2026 / 07:15 PM IST

బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లు సీజ్

నెల్లూరులో మరోసారి బెట్టింగ్ ముఠా పట్టుబడింది. బుచ్చికి చెందిన మహేశ్ బాబు, హరికృష్ణ దుబాయ్ ట్రైనింగ్‌తో ‘Radhee Exchange App’ బెట్టింగ్ దందా నడుపుతున్నారు. నిందితులను బాలాజీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.34.65 లక్షల నగదు, బ్యాంకుల్లోని రూ.1.64 కోట్లతో పాటు 13 సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు.

March 3, 2026 / 07:15 PM IST

హోలీ సంబరాలలో పాల్గొన్న మంత్రి సవిత

సత్యసాయి: పెనుకొండ మండలంలోని మంత్రి సవిత నివాసంలో మంగళవారం అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత రంగులు చల్లుకుంటూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. అందరి జీవితాలు రంగులమయంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి సంతోషం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

March 3, 2026 / 07:11 PM IST

విశాఖలో మందగించిన రిజిస్ట్రేషన్లు

VSP: ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం ఉన్నా, ప్రభుత్వం వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఫిబ్రవరిలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రూ.98 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-26 లక్ష్యం రూ.1400 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.952 కోట్లు వసూలయ్యాయి.

March 3, 2026 / 07:11 PM IST

మంత్రిని కలిసిన నూతన ఎమ్మార్వో

అన్నమయ్య: చిన్నమండెం(మం) నూతన ఎమ్మార్వో రామాంజనేయులు మంగళవారం మధ్యాహ్నం బోరెడ్డిగారిపల్లి గ్రామంలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుశ్యాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. మండల అభివృద్ధి అంశాలపై మంత్రితో ఎమ్మార్వో చర్చించినట్లు సమాచారం.

March 3, 2026 / 07:06 PM IST

మహిళా దినోత్సవం సందర్భంగా వైద్య శిబిరం

TPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం, పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో డా. మాధురి విద్యార్థినులకు ఆరోగ్య అవగాహన కల్పించారు. శక్తి టీమ్ మహిళల భద్రత, సైబర్ నేరాలపై సూచనలు ఇచ్చింది.

March 3, 2026 / 07:05 PM IST

మానవత్వాన్ని చాటుకున్న మదర్ థెరీసా ఎంటర్ప్రైజెస్

KDP: మదర్ థెరీసా ఎంటర్ప్రైజెస్ మానవత్వం చాటుకుంది. సిద్ధవటం మండలంలోని మాధవరం-1 పరిధి రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న చల్లా వెంకటసుబ్బయ్య ఇటీవల రైలు ప్రమాదంలో కుడికాలు పూర్తిగా దెబ్బతింది. మంచానికే పరిమితమైన వెంకటసుబ్బయ్యకు మంగళవారం మదర్ థెరీసా ఎంటర్ప్రైజెస్ అధినేత వెంకట్రామిరెడ్డి 25 కిలోల బియ్యం ప్యాకెట్టు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు.

March 3, 2026 / 07:05 PM IST

టీటీడీ బర్డ్ ఆసుపత్రిలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

CTR: తిరుపతిలోని BIRRD హాస్పిటల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ తదితర 9 విభాగాల్లో మొత్తం 30 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హతలు, ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చన్నారు. చివరి తేదీ: మార్చి 13.

March 3, 2026 / 07:05 PM IST

రేపు కావలి శివాలయంలో పుష్ప యాగం కార్యక్రమం

నెల్లూరు: కావలి పట్టణంలోని శ్రీ దుర్గా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం 16 రోజుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పుష్పయాగం, ఉంజల్ సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

March 3, 2026 / 07:04 PM IST

మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించిన శ్రీకాంత్ రెడ్డి

అన్నమయ్య: ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల జరిగిన దాడి ఘటనపై కుటుంబ సభ్యులతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. జోగి రమేష్ సోదరుడు రాము, కుమారుడు రాజీవ్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశమై పరిస్థితులపై చర్చించారు.

March 3, 2026 / 06:53 PM IST

రాపూరు అటవీ ప్రాంతంలో ప్రేమ జంట ఆత్మహత్య

నెల్లూరు: రాపూరు అటవీ ప్రాంతంలో ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఈ విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న (25), తిరుపతి జిల్లా చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి(24) ఒకే చెట్టుకు చున్నీలతో ఉరివేసుకుని ప్రాణాలు వదిలారు. పంగిలి గ్రామస్తుల సమాచారంతో రాపూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

March 3, 2026 / 06:53 PM IST

గుండెపోటుతో బీసీ సంఘ అధ్యక్షుడు మృతి

CTR: బీసీ సంఘం పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణమూర్తి మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. బీసీల ఐక్యత కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు చేపట్టారు. మత్సకారులకు ఓ ప్రత్యేకమైన గుర్తింపును కూడా నియోజకవర్గంలో ఆయన తీసుకువచ్చారు. ఆయన మృతిపై బీసీ సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వివిధ రాజకీయ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.

March 3, 2026 / 06:50 PM IST

తాగునీటి పంప్ హౌస్‌లను పరిశీలించిన కమిషనర్

GNTR: ప్రజా ఆరోగ్యం దృష్ట్యా MTMC కమిషనర్ అలీమ్ బాషా మంగళవారం నగరంలోని తాగునీటి పంప్ హౌస్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైప్‌లైన్ లీకేజీలను వెంటనే అరికట్టాలని సిబ్బందిని ఆదేశించారు. నీటి నాణ్యతను పరీక్షించేందుకు నమూనాలను గుంటూరు ల్యాబ్‌కు పంపాలని సూచించారు. తాగునీటిలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు వెంటనే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

March 3, 2026 / 06:50 PM IST

గడ్డివాము దగ్ధం.!

KRNL: ఆలూరు(మం) మొలగవల్లిలో జయన్నకు చెందిన 2 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. చెత్తలోని నిప్పురవ్వ గాలికి ఎగిరి వామికి అంటుకోవడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. గ్రామస్తుల సహకారంతో పక్కనున్న నాలుగు వాములు కాపాడబడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.1.30 లక్షలు విలువ చేసే పశువుల మేత కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరయ్యారు.

March 3, 2026 / 06:49 PM IST