• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సూసైడ్.. కారణం ఇదే!

TPT: గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బూదురు సునీల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పొదలకూరులోని శ్రీచైతన్య స్కూల్లో ఆయన ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు శ్రీచైతన్య స్కూల్ ఏజీఎం నర్ర శ్రీకాంత్ వేధింపులే కారణమని, పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ చదివించాలన్నదే చివరి కోరికగా లేఖలో పేర్కొన్నారు.

February 28, 2026 / 02:55 PM IST

తాడికొండలో స్వచ్ఛరధాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: తాడికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ‘స్వచ్ఛరధం’ కార్యక్రమాన్ని శనివారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఇళ్లలో సేకరించిన చెత్తను స్వచ్ఛరధం వాహనానికి అందజేస్తే, దానికి బదులుగా నిత్యావసర సరుకులు అందించే విధానాన్ని అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

February 28, 2026 / 02:55 PM IST

‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన సదస్సు

కోనసీమ: డ్రగ్స్‌, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు యువత, విద్యార్థుల జీవితాలను చిత్తు చేస్తున్నాయనీ మండపేట టౌన్ CI సురేష్ పేర్కొన్నారు. శనివారం మండపేట గౌతమి పుర పాలక సంఘం హై స్కూల్ విద్యార్థులుకు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తుకు బానిస కావడం ఎన్నో దుష్పరిణామాలకు కారణమవుతున్నాయన్నారు.

February 28, 2026 / 02:54 PM IST

ఇంటి పన్నులు వసూళ్ళ పై దృష్టి పెట్టాలి: ఎంపీడీవో

కోనసీమ: ఇంటి పన్నులు వసూళ్ళ పై దృష్టి పెట్టి సకాలంలో పన్నులు వసూళ్లు చేయాలని రావులపాలెం ఎంపీడీవో సుబ్రహ్మణ్యం సూచించారు. రావులపాలెం మండలంలోని హౌస్ టాక్స్ కలెక్షన్ తక్కువగా ఉన్న ఈతకోట, దేవరపల్లి, గ్రామాల పంచాయతీలను ఆయన పరిశీలించారు. హౌస్ టాక్స్ కలెక్షన్‌పై తీసుకోవలసిన యాక్షన్ ప్లాన్, చర్యలపై సంబందిత కార్యదర్శులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

February 28, 2026 / 02:54 PM IST

పరిశ్రమల స్థాపన వేగవంతం చేయాలి: కలెక్టర్

పల్నాడు జిల్లాలో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2025 భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న కృష్ణ ఆగ్రో, మైహోం సిమెంట్స్, ఇంధనఎనర్జీస్ ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధిపై చర్చించారు.

February 28, 2026 / 02:52 PM IST

రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

కోనసీమ: రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్య ఇస్తుందని నగరం ఏఎంసీ ఛైర్మన్ పెనుమాల లక్ష్మి అన్నారు. మామిడికుదురు మండలంలోని పెదపట్నం లంక గ్రామంలో నూతనంగా చేపట్టబోయే రహదారి అభివృద్ధి పనులకు ఆమె స్థానిక నాయకులతో కలిసి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొమ్ముల జంగమయ్య, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 02:51 PM IST

మిరప సస్యరక్షణపై రైతులకు అవగాహన

GNTR: ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు, యర్రగుంట్ల పాడు గ్రామాల్లో శనివారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మిరప పంటపై సమగ్ర సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త డా. సి.హెచ్. అనిల్‌కుమార్ మిరపలో కనిపించే నల్ల తామర పురుగు, బొబ్బర తెగులు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను వివరించారు.

February 28, 2026 / 02:50 PM IST

పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: ఐరాల మండలం తిరుమలయ్య గారి పల్లెలో శనివారం ఎమ్మెల్యే మురళీమోహన్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా లబ్ధిదారులకు పెంచిన మొత్తంతో పింఛన్లు అందిస్తున్నామన్నారు.

February 28, 2026 / 02:47 PM IST

జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్‌కు ఘన స్వాగతం

TPT: జిల్లా పర్యటన నిమిత్తం శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్‌కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు జిల్లా జడ్జి గురునాథం, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ప్రధాన న్యాయమూర్తికి సాదరంగా స్వాగతం పలికారు.

February 28, 2026 / 02:40 PM IST

హెచ్ పీవీ వాక్సినేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి

VZM: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు.

February 28, 2026 / 02:38 PM IST

ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వండి: కలెక్టర్

శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. విశాఖ బి, ఇందిరానగర్ కాలనీలలో శనివారం పారి శుద్ధ్యాన్ని, కాలువలు పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా, అక్కడ నిర్వాసితులకు నోటీసులు జారీ చేయాలని అధికారులు ఆదేశించారు.

February 28, 2026 / 02:35 PM IST

పాఠశాలలో సైన్స్ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులు

NLR: ఉదయగిరి దళితవాడ మండల పరిషత్ పాఠశాలలో శనివారం సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు MPD0 బి.శ్రీనివాసులు, HM షబ్బీర్ బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ముందుకు సాగాలని కోరారు.

February 28, 2026 / 02:35 PM IST

కొల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

BPT: కొల్లూరు మండలం, కొల్లూరు గ్రామం గాంధీనగర్ ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. పెన్షన్ పంపిణీని ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షిస్తూ, పెన్షనర్ల అనుభవాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 02:33 PM IST

పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ కాల్వ

ATP: రాయదుర్గం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. సామాజిక పెన్షన్ సాయం కాదని ఓ ఆర్థిక భరోసా అని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పంపిణీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 02:32 PM IST

మేకల చోరీ.. కేసు నమోదు చేసిన పోలీసులు

CTR: పుంగనూరు మండలం చండ్ర మాకులపల్లి పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రైతు దేవేంద్ర నాయుడుకి చెందిన నాలుగు మేకలను గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. ఈ ఘటనపై బాధితుడు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఏఎస్సై అశ్వత్ నారాయణ ఇవాళ మధ్యాహ్నం తెలిపారు.

February 28, 2026 / 02:30 PM IST