సింహాచలం(Simhachalam) దిగువన ఆలయ రథాన్ని విశాఖపట్నం సీపీ త్రివిక్రమ్ వర్మ, సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు జెండా ఊపి ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించగా..ఈ కార్యక్రమంలో భక్తులు(devotees) పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నేడు (జూలై 3) అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం(International Plastic Free Day). ప్లాస్టిక్ బ్యాగ్‌ల వినియోగాన్ని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగహన కల్పించడమే దీని లక్ష్యం. ప్లాస్టిక్ సంచులు కిరాణా కొనుగోళ్లకు ఉపయోగకరమైన సౌలభ్యంలా అనిపించవచ్చు. కానీ అవి పర్యావరణంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్లాస్టిక్ సంచులు కుళ్ళిపోవడానికి 700 సంవత్సరాలు పట్టవచ్చు.
ఏపీ వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్(Vande Bharat Express) వస్తుంది. విజయవాడ-చెన్నై(Vijayawada chennai )మధ్య ఈ ట్రైన్ రాకపోకలు కొనసాగించనుంది. దీనిని ఈనెల 7న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ ట్రైన్ ఏయే ప్రాంతాల్లో ఆగుతుంది. జర్నీ షెడ్యూల్ వివరాలను మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. భారతీయ రైల్వే ఈ ఏడాది చివరి నాటికి 75 వందేభారత్ రైళ్లను, రాబోయే మూడేళ్ల...
మంత్రి సీదిరి అప్పలరాజు తన సొంత నియోజకవర్గమైన పలాసలో అక్రమాలు, దౌర్జన్యాలు చేయిస్తున్నారని టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అక్రమాలను ప్రశ్నించిన వారిని అణచివేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka murder case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో 23 ఏళ్ల విద్యార్థిని ఊరివేసుకుని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.