• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

PM సూర్య ఘర్ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

అన్నమయ్య: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం కార్యక్రమాల అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు వేగవంతమైన అమలు, మున్సిపల్ సేవలు, శాంతిభద్రతలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలపై సూచనలు జారీ చేశారు.

February 21, 2026 / 08:24 AM IST

చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీపై శిక్షణ

AKP: చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీపై శుక్రవారం పాయకరావుపేట తాండవ రైతు ఉత్పత్తిదారుల సంఘం కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఎలమంచిలి కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎస్ మీనాక్షి మాట్లాడుతూ.. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. వీటి తయారీకి తక్కువ ఖర్చు అవుతుందని అన్నారు.

February 21, 2026 / 08:21 AM IST

ఎంపీ వల్లభనేని బాలశౌరి పర్యటన వివరాలు

కృష్ణా: గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని రెగ్యులేటర్ పునప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం ఉదయం 10 గంటలకు పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం ఆరుగొలును గ్రామంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.

February 21, 2026 / 08:21 AM IST

రాయలసీమ హక్కుల కోసం శైలజానాథ్ ఉద్యమ సన్నాహాలు

ATP: రాయలసీమ హక్కుల సాధన కోసం మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సీమను మోసం చేసేవారికి ఇది హెచ్చరిక అని పేర్కొంటూ, హక్కుల కోసం సమరం తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

February 21, 2026 / 08:20 AM IST

శ్రీ ముఖలింగేశ్వరస్వామి ఆదాయం వివరాలు

SKLM: జలుమూరు మండలంలోని శ్రీ ముఖలింగేశ్వరుని ఆలయంలో హుండీ ఆదాయాన్ని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏడుకొండలు పర్యవేక్షణలో శుక్రవారం లెక్కించారు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమం జరిగినట్లు ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. రూ. 7.31 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.

February 21, 2026 / 08:17 AM IST

ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా కాలువలకు నీటి విడుదల

GNTR: ప్రకాశం బ్యారేజీ నుంచి శుక్రవారం కృష్ణా డెల్టా పంట కాలువలకు మొత్తం 2,858 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో కృష్ణా పశ్చిమ కాలువకు 2,212, తూర్పు కాలువకు 502, మరియు గుంటూరు ఛానల్‌కు 144 క్యూసెక్కుల నీటిని కేటాయించారు. అలాగే తూర్పు కాలువ ద్వారా కేఈబీకి 302, బందరు కాలువకు 200 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు.

February 21, 2026 / 08:15 AM IST

సోమశిల జలాశయం తాజా నీటి మట్టం వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. శనివారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 67.226 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 908 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో 262 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.

February 21, 2026 / 08:13 AM IST

‘జిల్లాలో పంట కొనుగోలు చేస్తాం’

KDP: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా సూచించారు. జిల్లాలో 80,103 హెక్టార్లలో శనగ పంట సాగు చేశారన్నారు. 15 కొనుగోలు కేంద్రాల ద్వారా 18,532 మెట్రిక్ టన్నులు పంట కొనుగోలు చేస్తామన్నారు. రైతులు రైతు సేవా కేంద్రంలో పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.

February 21, 2026 / 08:08 AM IST

ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

CTR: జిల్లా ఎస్పీ, నగరి DSP ఆదేశాల మేరకు నిండ్రలోని బాలికల జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరి రూరల్ సీఐ భాస్కర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుపై ప్రభావం చూపే ర్యాగింగు కళాశాలల్లో స్థానం లేదన్నారు. ర్యాగింగ్ జరగకుండా పూర్తిగా నిషేధించినట్టు తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 21, 2026 / 08:07 AM IST

విశాఖలో రేషన్ డిపోలు పెంచండి: ఎమ్మెల్యే

VSP: విశాఖలో రేషన్ డిపోలను పెంచాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుతం 442 డిపోలు ఉన్నాయని మరో 43 డిపోలు కేసుల్లో ఉండడం వల్ల పనిచేయడం లేదన్నారు. 25 లక్షల జనాభా ఉన్న విశాఖలో ప్రతి 1000 మందికి ఒక రేషన్ డిపో ఉండాలని నిబంధన ఉందని దీనిని అమలు చేయాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 08:05 AM IST

వైభవంగా ఊంజల్ సేవ

అనకాపల్లి పట్టణం గవరపాలెం గౌరీ పంచాయతన ఆలయంలో శుక్రవారం రాత్రి గౌరీ పరమేశ్వరుల ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు గోపాలకృష్ణశర్మ, సూర్యనారాయణ శాస్త్రి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలపించిన భక్తి కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు కే సన్యాసిరావు కార్యదర్శి రామ సత్యనారాయణ పాల్గొన్నారు.

February 21, 2026 / 08:05 AM IST

స్వచ్ఛ రథానికి జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచేందుకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం కేటాయించిందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. అందులో భాగంగా కొత్తవలస మండలానికి కేటాయించిన స్వచ్ఛ రథాన్ని ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మతో కలిసి ఆమె శనివారం జెండా ఊపి ప్రారంభించారు. జెడ్పీ సీఈవో, డీపీవో, పీఏసీఎస్ అధ్యక్షులు ఉన్నారు.

February 21, 2026 / 08:05 AM IST

‘చేనేత గర్జన సభను విజయవంతం చేయండి’

కోనసీమ: ఆదివారం మంగళగిరిలో జరిగే చేనేత గర్జనను విజయవంతం చేయాలని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఊటుకూరు సుబ్రహ్మణ్యం కోరారు. అమలాపురం మండలం బండారులంకలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా నుంచి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 07:49 AM IST

ఆత్రేయపురం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం రాత్రి ఆత్రేయపురం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతలు, కేసుల దర్యాప్తు తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారిని  దర్శించుకునేందుకు ప్రతి శనివారం వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్సై రామును ఆదేశించారు.

February 21, 2026 / 07:49 AM IST

నేడు మండల సర్వసభ్య సమావేశం

SKLM: జి.సిగడాం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 10.30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.రామకృష్ణా రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ మీసాల సత్యవతి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి గౌరవ సభ్యులు, సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కోరారు.

February 21, 2026 / 07:47 AM IST