సీఎం జగన్ (CM Jagan) సీబీఐ కేసుల విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది.డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు జూలై 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. సీబీఐ (CBI) కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో వేగం పెరిగింది. సీబీఐ ఎనిమిది ఛార్జీషీట్ల(Charge sheets)లో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ముగిసింది. మరో మూడు ఛార్జీషీట్లలో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఈడీ ఏడు ఛార్జీషీట్లలో డిశ్చార్చ్ పిటిషన్లపై విచారణ ముగిసింది.
అక్రమాస్తుల కేసులకు సంబంధించి దాఖలు చేసిన వివిధ రకాల పిటిషన్లపై విచారణ ఉన్నట్లుగా నోటీసు బోర్డులో అంటించిన వివరాల ద్వారా వెల్లడయింది. కాసేపటికే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. సీబీఐ కోర్టులో రోజంతా జగన్ గురించే విచారణ జరిగిందని సోషల్ మీడియాలో ఇతర పార్టీల నేతలు సెటైర్లువేయడం ప్రారంభించారు. ఈ జాబితాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టీడీపీ (TDP) 20 క్రిమినల్ కేసుల్లో ఏ-1 జగన్ రెడ్డే. ఇటువంటి క్రిమినల్ చేత పాలింపబడుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ (AP)గర్వపడాలేమో! ఏది ఏమైనా… దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా… ఈ క్రిమినల్ రికార్డు అధిగమించాలంటే ఇప్పట్లో సాధ్యం కాదని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు