రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) పెర్కోన్నాది. తెలంగాణ(Telangana)లో నేడు మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్ గిరి, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ (Weather Bulletin) లో తెలిపింది.