»Atchannaidu Comments On Minister Appalaraju A Large Scale Of Irregularities In Palasa
Atchannaidu: పలాసలో దౌర్జన్యం..ప్రశ్నించిన వారిని అణచివేస్తున్నారు
మంత్రి సీదిరి అప్పలరాజు తన సొంత నియోజకవర్గమైన పలాసలో అక్రమాలు, దౌర్జన్యాలు చేయిస్తున్నారని టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అక్రమాలను ప్రశ్నించిన వారిని అణచివేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
What Happened In Amit Shah Meeting Atchannaidu Explained
ఏపీ మంత్రివర్గంలోని మంత్రి సీదిరి అప్పలరాజు(appalaraju) తన సొంత నియోజకవర్గమైన పలాసలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఆరోపించారు. ఈ అవకతవకలను అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరైనా ఎత్తిచూపితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సీదిరి అప్పలరాజు చేస్తున్న విపరీతమైన కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరైనా గళం విప్పితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని అచ్చెన్నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ సెగ్మెంట్లోని కాశీబుగ్గ మున్సిపాలిటీలో స్థానిక టీడీపీ నాయకుడు నాగరాజు నివాసం ముందున్న కల్వర్టును కూల్చివేయడం అనాగరిక చర్యగా అచ్చెన్నాయుడు అభివర్ణించారు.
నియంతలు, దుర్మార్గులు పాలకులుగా మారితే పాలన ఇలాగే ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో అణచివేతలు, వేధింపులు, రౌడీయిజం తారాస్థాయికి చేరుకున్నాయని టీడీపీ(TDP) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ విధమైన అణచివేత బ్రిటిష్ పాలనలో కూడా లేదని వ్యాఖ్యానించారు. పలాసకు వెళ్లిన టీడీపీ నేతలు ఇళ్లు కూలిన బాధితులను పరామర్శించకుండా వందలాది మంది పోలీసులను మోహరించడం నిజంగా సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నారు. ప్రతిపక్ష నేత నివాసాన్ని జగన్(jagan) టార్గెట్ చేయగా..అధికార పార్టీ కిందిస్థాయి నేతలు స్థానిక టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తుండడం నిజంగా దుర్మార్గమైన చర్య అని అచ్చెన్ననాయుడు అన్నారు.