Congress defeated in Telangana elections 2023 Victory in Aswaraopeta and yellandu
ఏపీ వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్(Vande Bharat Express) వస్తుంది. విజయవాడ-చెన్నై(Vijayawada chennai )మధ్య ఈ ట్రైన్ రాకపోకలు కొనసాగించనుంది. దీనిని ఈనెల 7న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ ట్రైన్ ఏయే ప్రాంతాల్లో ఆగుతుంది. జర్నీ షెడ్యూల్ వివరాలను మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. భారతీయ రైల్వే ఈ ఏడాది చివరి నాటికి 75 వందేభారత్ రైళ్లను, రాబోయే మూడేళ్లలో 400 రైళ్లను నడపాలని యోచిస్తోంది. ఫ్లాగ్షిప్ మేక్-ఇన్-ఇండియా ఇనిషియేటివ్ కింద చెన్నైలోని పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ద్వారా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తయారు చేయబడింది.