అక్కినేని అఖిల్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఎదురు చూస్తునే ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. కానీ అయ్యగారు మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటుపోతున్నట్టుగా తెలుస్తోంది. మరి అఖిల్ ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు?
Akhil: కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేశాడు అక్కినేని అఖిల్. అప్పటి వరకు కాస్త క్లాస్ సినిమాలు చేసిన అఖిల్.. ఏజెంట్‌తో మాసివ్ హట్ అందుకొని పాన్ ఇండియా రేంజ్లో మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయాడు సురేందర్ రెడ్డి. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఏజెంట్ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. చాలా రోజులుగా అఖిల్, అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వస్తునే ఉన్నాయి. అనిల్ గతంలో సాహో సినిమాకి, యూవీ క్రియేషన్స్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు.
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో.. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్ కూడా లాక్ చేసినట్టుగా సమాచారం. కానీ ఇప్పటి వరకు అఫిషీయల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వడం లేదు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని ఓ ఫారెస్ట్‌లో షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. అయ్యగారి ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు. కానీ అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా అఖిల్ ఈసారి హిట్ కొట్టాలనే కసితో ధీర సినిమా చేస్తున్నాడు. మరి అఖిల్‌కు ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి.