Civil Supply Department Started Exercise Regarding Issuance Of New Ration Cards
New Ration Cards: తెలంగాణలో రేవంత్ (Revanth) సర్కార్ కొలువుదీరింది. ఇచ్చిన ఒక్కొ హామీలను అమలు చేస్తోంది. కీలక హామీ రేషన్ కార్డులపై సమీక్షిస్తోంది. కొత్త కార్డుల జారీ, పాత కార్డుల తీసివేత.. తదితర అంశాలపై కసరత్తు చేస్తోంది. కీలక చర్య కూడా తీసుకోనుంది.
ఆదాయపు పన్ను కడుతుంటే.. మీకు రేషన్ కార్డు ఉన్న సరే.. తీసివేస్తారు. దాంతోపాటు మూడున్నర ఎకరాలకు మంచి భూమి ఉంటే కూడా రేషన్ కార్డు రాదు.. ఒకవేళ ఉంటే తొలగిస్తారు. కొత్త రేషన్ కార్డుకు సంబంధించి 27వ తేదీన ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది.
కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసే సమయంలో గుర్తించేలా సాప్ట్ వేర్ అప్ డేట్ చేస్తున్నారు. ఇప్పటికే మీ సేవ సాప్ట్ వేర్ పర్యవేక్షిస్తోన్న నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ)కి పౌరసరఫరాల శాఖ లేఖ రాసినట్టు తెలిసింది. రేషన్ కార్డు ఉన్న వారిలో ఐటీ కట్టేవారిని, మూడున్నర ఎకరాలకు పైగా భూమి ఉన్న వారిని గుర్తించి, తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేసి.. ఆ వ్యక్తి, అతని కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలిసేలా చర్యలు తీసుకుంటారు. కొత్తగా అప్లై చేసుకునే వారు.. లేదంటే ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారివి కూడా ఆ నిబంధనల మేరకు తొలగించే అవకాశం ఉంది. 27వ తేదీన విడుదల చేసే మార్గదర్శకాలను బట్టి తెలియనుంది. అలా చేస్తే కొన్ని వర్గాల నుంచి నిరసన ఎదురయ్యే అవకాశం ఉంది.