YCP: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ (YCP) సత్తా చాటబోతుంది. టైమ్స్ నౌ నవభారత్ సర్వే ప్రకారం వైసీపీ మూడో అతి పెద్ద పార్టీగా నిలువనుంది. బీజేపీకి 285-325 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ (congress) 111-149 సీట్లు సాధించనుంది. ఆ తర్వాత ప్లేస్‌లో వైసీపీ (ycp) నిలువనుంది. ఆ పార్టీకి 24-25 సీట్లు వస్తాయని అంచనా వేేసింది. వైసీపీ (ycp) తర్వాత టీఎంసీ 20-22 సీట్లు, బీజేడీ 12-14 సీట్లు, బీఆర్ఎస్ 9-11 సీట్లు గెలుస్తాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష టీడీపీకి (tdp) ఒక ఎంపీ స్థానం గెలుస్తోందని పేర్కొంది. జనసేన (janasena), బీజేపీ (bjp), ఇతరులు ఖాతా కూడా తెరవరని తెలిపింది. ఈ సర్వే వైసీపీకి (ycp) బూస్ట్ ఇస్తోంది. పార్లమెంట్ సీట్లు అన్నీ సాధిస్తామంటే.. అసెంబ్లీ సీట్లు కూడా అలానే గెలుస్తామని ధీమాతో ఉంది. సర్వే తమ ప్రభుత్వంపై జనాలకు ఉన్న నమ్మకం అని వైసీపీ నేతలు (ycp leaders) అంటున్నారు.
ఎన్నికలకు కాస్తా అటు ఇటుగా ఏడాది సమయం ఉంది. అయినప్పటికీ ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. వైసీపీ సింగిల్‌గా బరిలోకి దిగుతుండగా.. బీజేపీ (bjp) , టీడీపీలతో (tdp) జనసేన (janasena) పోటీ చేసే అవకాశం ఉంది. యువగళం పాదయాత్రతో నారా లోకేశ్ (nara lokesh) కదంతొక్కగా.. వారాహి వాహనంలో పవన్ కల్యాణ్ (pawan kalyan) ఎన్నికల సమర శంఖం పూరించారు. సమయం చూసుకొని చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కూడా ప్రచారం చేస్తున్నారు.