• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఇది ప్రజా ప్రభుత్వం: మంత్రి అచ్చన్న

SKLM: నందిగాం మండలంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్న నాయుడు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి 100 రోజుల్లో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

September 21, 2024 / 07:25 PM IST

ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి రూ1.30 లక్షలు అందజేత

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కొరకు రూ 1.30 లక్షలను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి కనిగిరి పట్టణానికి చెందిన పలువురు తోపాటు టీడీపీ నాయకులు శనివారం అందజేశారు. కనిగిరి అభివృద్ధిలో రాము భాగస్వాములము అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేకి వారు తెలిపారు. విరాళాలు అందించిన వారిని ఎమ్మెల్యే ఉగ్ర అభినందించారు.

September 21, 2024 / 07:24 PM IST

బుచ్చిరెడ్డిపాలెంలో పారిశుద్ధ్య పనులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ పాఠశాలలో శనివారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. నెహ్రూ యువ కేంద్ర, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పరిసరాలు శుభ్రం చేశారు. జిల్లా అధికారి ఆకుల మహేంద్ర మాట్లాడుతూ.. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతోనే గ్రామాలు స్వచ్ఛంగా మారుతాయని అన్నారు.

September 21, 2024 / 07:16 PM IST

సంగంలో ప్రారంభమైన ఇసుక అమ్మకాలు

NLR: సంగం ఇసుక డంపింగ్ యార్డు నుంచి శనివారం ఇసుక అమ్మకాలు ప్రారంభించారు. 15 రోజులుగా పెన్నా నది నుంచి నెల్లూరు-ముంబై హైవే సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక యార్డుకు ఇసుకను తరలించి నిల్వ చేసిన అధికారులు. నేటి నుంచి ఇసుక అమ్మకాలను ప్రారంభించగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టిక ప్రకారం ఇసుకను అందిస్తున్నామన్నారు.

September 21, 2024 / 07:11 PM IST

పోలీస్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

సత్యసాయి: నంబులపూలకుంట పోలీస్ స్టేషన్‌ను శనివారం డీఎస్పీ శివ నారాయణస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోనే లాకప్ గదులు, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల గురించి తెలుసుకున్నారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాల గురించి సిబ్బందితో ఆరా తీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.

September 21, 2024 / 07:02 PM IST

‘రైతులకు లాభసాటి ప్రకృతి వ్యవసాయమే’

KDP: పంటల సాగులో రైతులకు ప్రకృతి వ్యవసాయమే లాభసాటిగా ఉంటుందని మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. వేముల మండలం వి కొత్తపల్లిలో శనివారం సాయంత్రం ఘన జీవామృతం తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఘన జీవామృతం పంటలకు అందించడం వల్ల మంచి దిగుబడులు వస్తాయన్నారు.

September 21, 2024 / 07:00 PM IST

జెసీని కలిసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు

SKLM: రేషన్ కార్డులు బైఫరికేషన్ లబ్ధిదారులకు డీలర్లు ఇబ్బందులు లేకుండా సక్రమంగా అమలు చేయాలని జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షులు ఆరంగి రామారావు ఆధ్వర్యంలో నాయకులు టెక్కలి జాయింట్ కలెక్టర్ ఫర్మాన అహ్మద్ ఖాన్‌ను శనివారం కలసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర డీలర్లసంఘం అధ్యక్షులు మాధవరావు ఆదేశాలు మేరకు కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రతి రేషన్ డిపోకు600కార్డులు ఉండేలా చూడాలన్నారు.

September 21, 2024 / 06:55 PM IST

షరీఫ్ మృతదేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి

KDP: ఖాజీపేట మండల మాజీ కోఆప్షన్ సభ్యులు కొత్తపల్లి మహబూబ్ షరీఫ్ మృతదేహానికి శనివారం మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, మహబూబ్ షరీఫ్ రాజకియంగా ప్రజలకు చెందిన సేవలను కోనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొని, నివాళులర్పించారు.

September 21, 2024 / 06:04 PM IST

‘పొలం పిలుస్తోంది’ పోస్టర్ విడుదల

CTR: గుడిపల్లి మండలంలో ఈనెల 24 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏవో నాగరాజ తెలిపారు. దీనికి సంబధించిన పోస్టర్‌ను  టీడీపి మండల అధ్యక్షుడు బాబు నాయుడు, ఏవో శనివారం విడుదల చేశారు. నాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు రైతులతో కలసి పొలాలను సందర్శించి పంటలలో అనుసరించవలసిన నూతన, ఆధునిక పద్ధతులు గురించి వివరిస్తారని తెలిపారు.

September 21, 2024 / 05:58 PM IST

‘కల్తీ ఆహారాలను అరికట్టాలి’

PLD: నరసరావుపేటలో కల్తీ ఆహారాలను అరికట్టాలని సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేటలో జంతువుల నుంచి వచ్చే కొవ్వు నూనెలు ఉపయోగించి అనేక బిర్యాని పాయింట్లలో ఆహారాలు తయారు చేస్తున్నారని, తద్వారా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. వెంటనే అధికారులు కల్తీ ఆహారాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

September 21, 2024 / 05:57 PM IST

హౌసింగ్ బోర్డ్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే

E.G: రాజానగరం మండలంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ఆయన పలు సమస్యలపై చర్చించారు. మౌలిక వస్తువులకు సంబంధించిన పలు సమస్యలను స్థానిక ప్రజలు ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కృషి చేస్తానని తెలిపారు.

September 21, 2024 / 05:57 PM IST

జూపాడు బంగ్లా మండలంలోని సమస్యలు పరిష్కరించాలి

KRNL: జూపాడు బంగ్లా మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న వివిధ ప్రజా సమస్యలను పరిష్కరించాలని, సీపీఐ నాయకులు రమేష్ బాబు శనివారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. గిరిజనులకు ఇళ్ల స్థలాలు పట్టాలు, పొలాలు ఇచ్చి ఆదుకోవాలని, సిద్దేశ్వరం 80బన్నూర్, చాబోలు గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు, నేసనల్ హైవే భూ లబ్దిదారులకు నష్ట పరిహారం, గ్రామాల్లో స్మశాన వాటికలు నిర్మించాలన్నారు.

September 21, 2024 / 05:55 PM IST

120 రకాల పిండి వంటలతో గణనాధుడికి మహా నైవేద్యం

WG: వినాయక చవితి పర్వదిన మహోత్సవాలలో భాగంగా కొయ్యలగూడెం కోపరేటివ్ బ్యాంకు వీధిలో నెలకొల్పిన గణనాధుడికి మహా నైవేద్యం సమర్పించారు. 120 రకాల పిండి వంటలను మహాగణపతి విగ్రహం ఎదుట నైవేద్యంగా ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల మందికి పైగా భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. మహా నైవేద్య సమర్పణలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

September 21, 2024 / 05:55 PM IST

నందికొట్కూరు సబ్ జైల్లో తనిఖీ చేసిన జిల్లా జడ్జి

NDL: నందికొట్కూరు పట్టణంలోని సబ్ జైల్లో శనివారం జిల్లా జడ్జి జిల్లా న్యాయ లీగల్ సేవా సంస్థ ఛైర్మన్, కబార్డి సెక్రటరి లీల వెంకట శేషాద్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడుతూ వారి సమస్యల గురించి సౌకర్యాల గురించి జడ్జి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా ప్రియదర్శిని జూనియర్ సివిల్ జడ్జి దివ్య పాల్గొన్నారు.

September 21, 2024 / 05:45 PM IST

పొలం పిలుస్తుంది పోస్టర్లను ఆవిష్కరించిన స్పీకర్

AKP: నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. సెప్టెంబర్ 24 నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటన చేసి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతులకు అధిక దిగుబడి వచ్చే పంటలను వివరిస్తారు.

September 21, 2024 / 05:45 PM IST