• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విజయవాడ ఎంజీ రోడ్డులో ట్రాఫిక్ జామ్

ఎన్టీఆర్: విజయవాడలోని మహాత్మా గాంధీ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వరకు వాహనాలు రోడ్డుపైనే బారులు తీరాయి. ట్రాఫిక్ పోలీసులు సైతం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

September 21, 2024 / 05:20 PM IST

సామర్లకోట రైల్వే స్టేషన్‌కు 8వ స్థానం

KKD: రైల్వే ఆదాయంలో సామర్లకోటకు 8వ స్థానం సాధించింది. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధుల మంజూరులో భాగంగా 30 రైల్వే స్టేషన్‌లో  ప్రయాణికులు, ఆదాయ వివరాలను రైల్వే కమిటీ సేకరించినట్లు అధికారులు శనివారం తెలిపారు. దీనిలో భాగంగా సామర్లకోటకు 8వ స్థానం లభించిందని అన్నారు.

September 21, 2024 / 05:19 PM IST

‘ఒక్కొక్కరూ ఒక్కో మొక్క నాటితే వనమే ఏర్పడుతుంది’

KKD: పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సామర్లకోట రైల్వేస్టేషన్ మేనేజర్ రమేష్ కోరారు. స్వచ్ఛత మహోత్సవంలో భాగంగా శనివారం సామర్లకోట రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్కరూ ఒక్కో మొక్క నాటితే వనమే ఏర్పాటవుతుందని ఆయన తెలిపారు. అధికారులు రవికాంత్, రామసుబ్బారావు, గిరి, కళ్యాణి, రామకృష్ణ, పాల్గొన్నారు.

September 21, 2024 / 05:17 PM IST

ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలి: పోలంరెడ్డి

NLR: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మంచి చేసింది తప్పా చెడు చేయలేదని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేశ్ రెడ్డి అన్నారు. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరద బాధితులను ఆదుకొని వారికి నగదును అందించింది టీడీపీ అన్నారు. అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజల ఆకలిని తీరుస్తున్నారని చెప్పారు.

September 21, 2024 / 05:16 PM IST

ఇది మంచి ప్రభుత్వం”అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

WG: నరసాపురం మున్సిపాలిటీ లోని 10వ సచివాలయం వద్ద శనివారం “ఇది మంచి ప్రభుత్వం”అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు నరసాపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి తెలిపారు.

September 21, 2024 / 05:15 PM IST

వాహన ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

CTR: ద్విచక్ర వాహన ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని చిత్తూరు- పుత్తూరు జాతీయ రహదారిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు కార్వేటి నగరంలోని మణికండ్రిగ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో వెళుతుండగా వాహనం అదుపుతప్పడంతో కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

September 21, 2024 / 05:15 PM IST

ఆర్టీసీ ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి

కోనసీమ: రావులపాలెం బస్టాండ్‌లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కొత్తపేట జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం CRC క్లబ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్‌ను వారు ప్రారంభించారు.

September 21, 2024 / 05:14 PM IST

రేపటి నుంచి రాష్ట్రస్థాయి జూడో పోటీలు

TPT: తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో రాష్ట్రస్థాయి అండర్-14 బాల, బాలికల జూడో పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ ఎస్.బాబు తెలిపారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. 24న ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.

September 21, 2024 / 05:12 PM IST

నంద్యాల పట్టణంలో రేపు ఉచిత వైద్యశిబిరం

NDL: నంద్యాల పట్టణంలో రేపు (ఆదివారం) ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు వైద్యులు రజినీ దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. పురుషులకు వీర్యకణాల పరీక్ష, మహిళలకు స్కానింగ్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

September 21, 2024 / 05:12 PM IST

నందికొట్కూరు మండలానికి రానున్న మంత్రి నిమ్మల

NDL: నందికొట్కూరు మండలం మల్యాలకి ఈ నెల 22న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రానున్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మండలంలోని హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తారని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నిర్వహణ, పనితీరుపై సమీక్షించనున్నారు. రైలుమార్గంలో ఉదయం డోన్ చేరుకుంటారు. అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ అతిథి గృహం చేరుకుంటారు.

September 21, 2024 / 05:10 PM IST

‘మెరుగైన పాలన అందుతుంది’

CTR: సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించారు. వంద రోజులలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

September 21, 2024 / 05:08 PM IST

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బంద్

ఏలూరు: ఆముదల అప్పలస్వామి కాలనీ ప్రాంతంలో ఈ నెల 22న గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఏలూరు పవర్ పేటలో ఉన్న 33/11 కెవి సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజన్ తెలిపారు. సాయంత్రం 4గం నుంచి నిమజ్జనం ఊరేగింపు పూర్తి అయ్యేవరకు ఆముదల అప్పలస్వామి కాలనీ, మహేశ్వర కాలనీలో సరఫరా ఉండదన్నారు.

September 21, 2024 / 05:08 PM IST

పొన్నవోలులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం

NLR: చిల్లకూరు మండలం పొన్నవోలులో నేడు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పలువురు అధికారులు, టీడీపీ కార్యకర్తలు ప్రజలకు వివరించారు. అనంతరం వారికి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

September 21, 2024 / 05:06 PM IST

ఆకివీడులో ప్రపంచ శాంతి దినోత్సవ మానవహారం

WG: ఆకివీడులో ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా మాదివాడ సరోజనీనాయుడు బాలికోన్నత పాఠశాలలోని లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినుల చేత శాంతి ప్రతిజ్ఞ చేయించారు. అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి రాజేశ్వరి, జ్యోతిరెడ్డి, నాగమణి మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రామచెంచయ్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

September 21, 2024 / 05:06 PM IST

తుమ్మలగుంటలో వెంకన్నకు పూజలు

TPT: తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం పెరటాసి మాసానికి ముస్తాబైంది. పెరటాసి మాసం తొలి శనివారం రోజున ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.అత్యధిక శాతం మంది మహిళలు పిండి దీపాలను నైవేద్యంగా స్వామికి సమర్పించి భక్తితో వేంకటేశ్వర శత నామావళి,అష్టోత్తరాలను చదువుతూ తమ మొక్కులు తీర్చుకున్నారు.

September 21, 2024 / 05:01 PM IST