GNTR: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తుళ్ళూరు మండలం ఐనవోలు గ్రామంలో శనివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి, 100 రోజుల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు.
PLD: రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని 100 రోజులలో ప్రభుత్వాన్ని ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద లబ్ది దారులకు పట్టాలు పంపిణీ, గ్రామంలో సీసీ రోడ్లు సీసీ డ్రైన్స్‌కు శంకుస్థాపన చేశారు.
ELR: ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా, భూమి, ఇళ్ల స్థలాలు, స్థానిక సమస్యల పరిష్కారాలపై పోరాటాలు నిర్వహించాలని సీపీఎం మండల కార్యదర్శి ఎం. జీవరత్నం అన్నారు. మైసన్నగూడెంలో శనివారం సీపీఎం మహాసభను నిర్వహించారు. ఈ సందర్బంగా జీవరత్నం మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధరలు, ఉపాధి హామి పథకం వేతనాలు పటిష్టంగా అమలు చేసే విషయంలో సీపీఎం పోరాటాలు చేసిందన్నారు.
TPT: సేంద్రీయ ఎరువులను ఉపయోగించి సహజంగా పండించిన పంటలను ఆహారంగా స్వీకరించాలని ఎస్.పీ.ఎం విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ ఉమ, రిజిస్టార్ రజని పేర్కొన్నారు. శనివారం ఎస్.పీ.ఎం విశ్వావిద్యాలయంలో పలు సంస్థల సహకారంతో గ్రీన్ టీం విద్యార్థులకు సేంద్రియ ఎరువులు తయారీ విధానం వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు రామమూర్తి, సావిత్రి, చాందికుమారి, రమ్య, ఎస్. ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.
కోనసీమ: బాలికలు క్రీడా పోటీల్లో ముందజలో వుండాలని విశ్రాంత ఉపాధ్యాయులు జి. శ్రీనివాస్ పేర్కొన్నారు. మండపేట మండలం ఏడిద జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి బాలికల క్రీడా పోటీలు శనివారం నిర్వహించారు. మండలంలోని 13 పాఠశాలకు చెందిన 150 మంది విద్యార్థినులు హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన బాలికలు ఈ నెల 25న నియోజకవర్గ స్థాయిలో పాల్గొంటారన్నారు.
CTR: పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని శనివారం కలిశారు. మండల పరిస్థితులపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ఆయనకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
GNTR: ప్రజల మనోభావాలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆటలాడారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మండిపడ్డారు. ఆమె శనివారం గుంటూరులో మాట్లాడుతూ… అధికారం ఉన్ననాటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రత చేసిన వారిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఏలూరు జిల్లాలో నిర్మితమవుతున్న పలు జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ విషయంపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏలూరు గౌతమీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణకు సంబంధించి అవరోధాలను అధిగమించి పనులు వేగవంతం చేయాలన్నారు.
ఎన్టీఆర్: విజయవాడ ట్రిపుల్ ఐటీలలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి మీ బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తానని, ఆ బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సామాజిక బాధ్యతతో విజయవాడ వరద బాధితులకు 1,565 మంది నూజివీడు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు యోగా గురువు శ్రీధర్ ఆధ్వర్యంలో రూ.2,82,313ను శనివారం మంత్రి లోకేశ్‌కు చెక్కు రూపేణా విరాళంగా అందజేశారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న శ్రీ శనీశ్వర స్వామి ఆలయానికి హైదరాబాద్ వాసి మనోజ్ మహేశ్ రెడ్డి బంగారు తాపడాన్ని విరాళంగా ఇచ్చారు. అనంతరం ఆయనకు అర్చకులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి పూజలు చేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
KDP: బద్వేల్ (2019) టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్ మంత్రి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందించారు. బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కోరినట్లుగా తెలిపారు.
అన్నమయ్య: ప్రేమించిన ప్రియుడి కోసం ఓ యువతి పోరాడి సాధించింది. పెనగలూరు మండలం ఈటిమార్పురానికి చెందిన పొసలదేవి లావణ్యను ప్రేమించిన యువకుడు బైర్రాజు వెంకట సాయి వివాహం చేసుకున్నారు. తనను ప్రేమించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని పురుగు మందు తాగి చచ్చిపోతానంటూ లావణ్య పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది. అయితే ఎట్టకేలకు రాజంపేటలో పెద్దల సమక్షంలో వెంకట సాయి లావణ్యను పెళ్లి చేసుకుంది.
గుంటూరు: రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి అన్నారు. శనివారం కారంపూడిలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే 100 రోజుల పాలనలో సీఎం చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
KDP: బద్వేలు పట్టణ పరిధిలో లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉదయం భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. పూజారులు ఉత్సవ మూర్తులను వివిధ రకాల వస్త్రాలంకరణ చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
KRNL: నారాయణ స్కూల్‌లో చదువుతున్న ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన నవీన్ కుమార్‌కు స్కూల్ ఫీజును వైసీపీ ఇంఛార్జ్ బుట్టా రేణుక శనివారం అందజేసింది. బుట్టా రేణుక మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులు మెరిట్ సాధించి చదవలేని అనేక మంది విద్యార్థులకు ఫీజులు కట్టి ఉన్నత చదువులు చదవడానికి బుట్టా ఫౌండేషన్ ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.